సౌత్ ఇండియాలో సంచలన నటుడుగా ముద్ర వేసుకున్న శింబు.. కొత్త చిత్రాల విషయంలో వేగం పెంచాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన నటించిన వెందు తనిందదు కాడు (లైఫ్ ఆఫ్ ముత్తు) చిత్రం విడుదలై చాలా కాలం అయ్యింది. తదుపరి కరోనా కుమార్ అనే చిత్రంలో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ చిత్రం ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది.
ప్రస్తుతం శింబు రాజ్‌కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమలహాసన్ నిర్మించనున్న చిత్రం కోసం మేకోవర్ అవుతున్నారు. నటుడు రజనీకాంత్ నటించాల్సిన కథలో శింబు నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే శింబు ఇంతకు ముందు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించిన మానాడు చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
కాగా దానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి దర్శకుడు వెంకట్ ప్రభు సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఒక భేటీలో ఆయనే తెలిపారు. ప్రస్తుతం ఆయన నటుడు విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న 68వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నటి మీనాక్షి చౌదరి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతో ఈ చిత్రం పూర్తి అయిన తరువాత మానాడా–2 ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment