ముప్పై అయిదేళ్ల తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట మణిరత్నం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని, ఇందులో భాగంగానే కథలోని ఓ కీలక పాత్ర కోసం మణిరత్నం నుంచి శింబుకు కబురు వెళ్లిందనీ టాక్.
ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘చెక్క చివంద వానం’ (2018) (తెలుగులో ‘నవాబ్’) సినిమాలో శింబు ఓ లీడ్ రోల్‌లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరి.. కమల్–మణిరత్నం కాంబో సినిమాలో శింబు నటిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఇక కమల్, మణిరత్నం కాంబినేషన్‌లో 1987లో ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) వచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment