భారీ మల్టీస్టారర్‌.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Mani Ratnam Chekka Chivantha Vaanam Gets Rrelease Date | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 11 2018 1:28 PM | Last Updated on Sat, Aug 11 2018 1:28 PM

Mani Ratnam Chekka Chivantha Vaanam Gets Rrelease Date - Sakshi

ఇటీవల  ఒక్క ‘ఓకె బంగారం’ సినిమా తప్ప మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. తాజాగా చెలియా సినిమాతో నిరాశపరిచిన ఆయన తన తదుపరి చిత్రం ‘చెక్క చివంత వానం’ షూటింగ్‌ను శరవేగంగా ముగించేస్తున్నారు. భారీ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మణి చాలా వేగంగా కంప్లీట్‌ చేస్తున్నారు. మణి సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకిస్‌, లైకా ప్రొడక్షన్స్‌ తో కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల మణి ఆరోగ్య సమస్యల కారణంగా కొద్ది రోజులు నిర్మాణాంతర కార్యక్రమాలు బ్రేక్‌ ఇచ్చిన చిత్రయూనిట్‌, తిరిగి పనులు ప్రారంభించారు. పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శింబు, అరవింద్‌ స్వామి, విజయ్‌ సేతుపతి, అరుణ్‌ విజయ్‌లు అన్నదమ్ములుగా కనిపించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఏఆర్‌ రెహమాన్ సంగీత మందిస్తున్న ఈ సినిమాకు సంతోష్‌శివన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో నవాబ్ పేరుతో రిలీజ్ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement