లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం గతంలో గట్టిగా వినిపించింది. కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తమిళ్ స్టార్ హీరో విజయ్, మహేష్ బాబుల కాంబినేషన్‌లో భారీ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేశారు మణిరత్నం. మహేష్ కూడా చాలా సందర్భాంలో మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తానంటూ ప్రకటించటంతో త్వరలోనే సినిమా పట్టాలెక్కుతుందని భావించారు. కానీ అనివార్య కారణాల వల్ల ప్రాజెక్ట్ సెట్ కాకపోవటంతో మణి, మహేష్‌లు ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయారు.
అయితే తాజాగా మణిరత్నం మరోసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ కు ప్రయత్నాలు ప్రారంభించారట. కానీ ఈ సారి మహేష్ బాబును ఈ ప్రాజెక్ట్ కోసం సంప్రదించే అవకాశం లేదని తెలుస్తోంది. తమిళ హీరోలతోనే సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట మణి. విజయ్‌తో పాటు శింబు, విక్రమ్‌లత ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనల్‌చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి సమచారం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment