లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా నవాబ్. అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ ఇలా భారీ తారాగణంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్‌ను కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా తమిళ వర్షన్ ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రిలీజ్ చేశారు. సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ రూపొదించిన ఈ ట్రైలర్‌లో అందరూ ప్రతినాయకులలాగే కనిపిస్తున్నారు. మణి మార్క్ టేకింగ్ టాప్ స్టార్స్‌తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment