Nawab
-
డంప్ యార్డ్ ముందు నోట్ల కట్టలు.. సిగరెట్ తాగుతున్న హీరో
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ళ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'నవాబ్'. హరిహర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్ఎం నిర్మాణ సారథ్యంలో రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ రా అండ్ రస్టిక్ లుక్‌తో సమ్‌థింగ్ స్పెషల్‌గా కనిపిస్తోంది. ముందు డబ్బుల కట్టలు, వెనుక డంప్ యార్డ్, మధ్యలో రక్తపు మరకలతో ఇంటెన్సివ్ గా సిగరెట్ తాగుతున్నాడు హీరో. ఈ చిత్రం ఒక డంప్ యార్డ్ చుట్టూ అల్లుకున్న కథ అని, ఆద్యంతం ఉత్కంఠ భరితమైన థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకుడికి 'నవాబ్' చిత్రం అందిస్తుందని మేకర్స్ తెలిపారు. యాక్షన్ డ్రామాతో పాటు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే హృదయాన్ని కదిలించే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో కీలకమని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం 'నవాబ్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని, త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం చేస్తామని తెలిపింది. వీలైనంత త్వరగా మూవీ విడుదలకు సంబంధించిన ప్రకటనను వెల్లడించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రేక్షక ఆధరణతో పాటు విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న 'నల్లమల' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రవి చరణ్ తన రెండవ చిత్రం అయిన 'నవాబ్' మూవీకి దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే నవాబ్ చిత్రానికి స్టైలిస్ట్ గా శోభారాణి పనిచేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. First look of #RaviCharan’s #Nawab 🔥 Written & directed by #RaviCharan Produced by #RM Music #PR Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam!@mukesh_gupta14 @AnanyaNagalla @Sandhya44245248 #PayalMukherjee#HariHaraCreations pic.twitter.com/3O65SY53Tr — Eluru Sreenu (@IamEluruSreenu) October 16, 2023 చదవండి: ఇంటికి వెళ్లి తల్లిని పట్టుకుని బోరున ఏడ్చేసిన నయని.. టాప్ 5లో ఉండాలనుకున్నా అంటూ. -
డంపింగ్ యార్డులో మూవీ సెట్ వేశాం : డైరెక్టర్
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘నవాబ్’. రవిచరణ్ దర్శకత్వంలో నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రవిచరణ్ మాట్లాడుతూ – ‘‘నా మొదటి సినిమా ‘నల్లమల’కు మంచి ఆదరణ లభించింది. ఆ ఉత్సాహంతో ‘నవాబ్’ తెరకెక్కిస్తున్నాం. పూర్తిగా డంపింగ్ యార్డ్‌లో సాగే కథతో ఈ సినిమా ఉంటుంది. దీని కోసం పదెకరాల్లో డంపింగ్ యార్డ్ సెట్ వేశాం. మా హీరో ముఖేష్ గుప్తా తెలుగు కాదు. ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఓ మంచి కథతో రూపొందుతున్న ‘నవాబ్’లో హీరోగా నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ముఖేష్ గుప్తా. -
జైహింద్ స్పెషల్: ఈస్టిండియా కుటిల వ్యూహం
భారతావనిని దోచుకోవడంలో పాశ్చాత్యులు ఒకరిని మించి మరొకరు అన్నట్లు వ్యవహరించారు. ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్నప్పటి నుంచే ఆక్రమణల పర్వం పతాక స్థాయికి చేరింది. జాగీరులను సొంతం చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్లు పన్నిన కుట్రకు ఒక ప్రత్యక్ష నిదర్శనం ఉదయగిరి (నెల్లూరు జిల్లా) జాగీర్ ఆక్రమణ. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఉదయగిరి నవాబుల వారసురాలు సయ్యద్ ఖాదరున్నీసా బేగం సాక్షి ‘జైహింద్’తో పంచుకున్న ఆనాటి జ్ఞాపకాలివి. దోపిడీకొచ్చిన దొర! ‘‘అవి పందొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్లు. భారతదేశంలో రాజ్యాలు, సంస్థానాలు, జాగీర్దార్ల మీద ఈస్ట్ ఇండియా కంపెనీ కన్ను పడటం మొదలైంది. ఒక్కొక్క సంస్థానాన్ని ఏదో ఒక నెపంతో కంపెనీ పాలనలోకి తీసుకోవడం అనే కుట్ర చాపకింద నీరులా ప్రవహిస్తోంది. మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో ఉంది ఉదయగిరి దుర్గం. ఆ దుర్గం నవాబుల పాలనలో ఉండేది. జాగీర్దారుగా అబ్బాస్ అలీఖాన్ ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. ఆ సమయంలో అంటే.. 1803లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉదయగిరి జాగీర్దారుతో ఒప్పందం కుదుర్చుకోడానికి వచ్చింది. చదవండి: జైహింద్ స్పెషల్: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున స్ట్రాటన్ అనే అధికారి వచ్చాడు. కంపెనీకి ఉదయగిరి జాగీర్ నుంచి ఏడాదికి 53 వేల రూపాయల పేష్కార్ చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు కంపెనీకి చెల్లించడానికి అబ్బాస్ అలీఖాన్ అంగీకరించలేదు. అంతేకాదు.. వాళ్లతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే ఉద్దేశంతో ఐదువేలు మాత్రమే చెల్లించగలనని చెప్పాడు అలీఖాన్. స్ట్రాటన్ దొర చాలా వ్యూహాత్మకంగా అలీఖాన్ చెప్పిన ఆ ఐదువేల మొత్తానికి అంగీకరించాడు. ఆ ఒప్పందం 1837 వరకు కొనసాగింది. ‘కోటలో కుట్ర’ వదంతి! అత్యంత లాభసాటి రాబడి ఉన్న ఉదయగిరి సంస్థానం మీద నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ దృష్టి మరల్చనే లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆ తర్వాత అనుకోకుండా ఒక ప్రచారం తలెత్తింది. ఆ ప్రచారాన్ని సద్దుమణగనివ్వకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ జాగ్రత్త పడింది. అప్పుడు నెల్లూరు కలెక్టర్ పేరు స్టోన్‌హౌస్. ఉదయగిరి పాలకుడు అబ్బాస్ అలీఖాన్, అతడి కుమారులు స్టోన్‌హౌస్‌ను హత్య చేయడానికి పథకం రచిస్తున్నారనే వదంతి ఎలా పుట్టిందో తెలియదు, కానీ స్టోన్‌హౌస్ ఆ వదంతిని ఉపయోగించుకున్నాడు. స్టోన్ హౌస్ కుయుక్తితో ఈ పుకారుకి మరింత ఆజ్యం పోస్తూ మద్రాసు ప్రెసిడెన్సీకి ఉత్తరం రాశాడు. ఉదయగిరి కోటలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అభియోగం అందులో ఉంది. కుట్ర జరుగుతోందని, ఆయుధాలు, తుపాకీ, మందుగుండు సామగ్రిని సిద్ధం చేస్తున్నారని, అబ్బాస్ కుమారులే ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నారనీ..’ రాశాడు. నవాబు నిర్బంధం వివాదాన్ని విచారించే నెపంతో కలెక్టర్ మరితంగా విషయాన్ని క్లిష్టపరుస్తూ 70 మందిని అరెస్ట్ చేయించాడు, మరో 40 మంది మీద నేర విచారణ జరపాల్సిందిగా ఆదేశించాడు. ఇలా రకరకాలుగా జాగీర్దారుల కుటుంబీకులు, సమీప బంధువుల మీద అనేక రకాల కేసులు పెట్టి నానా విధాలుగా బాధలు పెట్టాడు కలెక్టర్. కొందరిని చెంగల్పట్టు జైల్లో, మరికొందరిని సైదాపేట జైల్లో బంధించారు. ఇంట్లో ఉన్న వారికి కానీ, జైల్లో ఉన్న వారికి కానీ ఒకరి సమాచారం మరొకరికి తెలియని స్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబం కకావికలమైంది. ఆంగ్లేయుల మీద పోరాటం సాగించిన ఉదయగిరి దుర్గం చివరి పాలకుడు అబ్బాస్ అలీఖాన్‌ను చెంగల్పట్టు జైల్లో బంధించారు. ఆయన ఆంగ్లేయుల అధికారానికి తలవంచకుండా, వారి ఆధిపత్యాన్ని అంగీకరించకుండా, వారిచ్చిన ఆహారాన్ని స్వీకరించకుండా 21 రోజుల పాటు ఉగ్గబట్టి ప్రాణాన్ని ఆత్మార్పణం చేసుకున్నారు’’ అని తెలిపారు ఖాదరున్నీసా. కలిసిమెలిసి ఉండేవాళ్లు ‘‘ఉదయగిరి జాగీర్దార్ కుటుంబానికి వారసుల్లో ఒకరైన అబ్దుల్ ఖాదర్ సాహెబ్ అఫ్ఫాన్ (ఛాబుదొర) మా పెద్ద తాతగారు. ఆయన 1953లో మరణించారు. ఆయనకు పిల్లల్లేరు. మమ్మల్ని ఆత్మీయంగా చూసేవారు. ఆయన ఉదయగిరి దుర్గానికి పాశ్చాత్యుల కారణంగా ఎదురైన కష్టాలను, స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన అనేక ఘట్టాలను మాకు చెబుతుండేవారు. ఉదయగిరి కోట లోపల మసీదులు, ఆలయాలు ఉండేవి. హిందువులు– ముస్లిమ్‌లు తరతమ భేదాలు లేకుండా సోదరభావంతో మెలిగేవారు. మనమంతా భారతీయులం, తెల్లవాళ్లు మనల్ని దోచుకుంటున్నారనే స్పృహ అందరిలో ఉండేది. అప్పట్లో అది సుసంపన్నమైన జాగీరు కూడా. అలాంటి జాగీరుకు బ్రిటిష్ వాళ్ల దృష్టి పడినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడది పేరుకే కోట అన్నట్లుగా ఉంది. పరాకాష్టకు చెందిన ఇంగ్లిష్ దొరల అరాచకానికి ఆనవాలుగా మిగిలింది. మా పూర్వికులు ప్రజల గుండెల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారు. అబ్బాస్ అలీఖాన్ తండ్రి హజ్రత్ ఖాన్ సాహెబ్ వలి ఉర్సు చేసుకుంటాం. మొహర్రమ్ నెలలో ఉదయగిరి దర్గా ఉరుసులో హిందువులు– ముస్లిమ్‌లు కలిసి పాల్గొంటారు’’ అని ఖాదరున్నీసా తెలిపారు. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం మంగళవారం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1917 ఏప్రిల్ 26న ఉస్మానియా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఫర్మాన్ (రాజాజ్ఞ) జారీ చేశారు. అడిక్‌మెట్ జాగీర్‌లో నిజాం 2వ నవాబు నుంచి మహ లకాభాయి చందా బహుమతిగా పొందిన భూమిని తిరిగి 7వ నవాబుకు కానుకగా ఇవ్వడంతో అదే స్థలంలో ఓయూ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తొలిసారిగా ఓయూలో మంగళవారం ఫౌండేషన్ డే నిర్వహిస్తున్నారు. 105 వసంతాలు పూర్తి చేసుకున్న ఓయూలో కోటిమందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేశారు. ఎందరో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. తొలి రోజుల్లో ధనవంతుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించగా నేడు ఓయూ నూరుశాతం మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తుంది. ఏటా నిర్వహిస్తాం.. దేశంలోనే 7వ యూనివర్సిటీగా ప్రసిద్ధిగాంచిన ఓయూ తొలిసారి ఫౌండేషన్ డేను నిర్వహించడం గర్వంగా ఉంది. ఇకపై ఏటా ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించాం. తొలిసారి జరుగుతున్న 105వ ఫౌండేషన్ డే సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. వందేమాతర ఉద్యమం మొదలు నిన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ఉద్యమాలు ఇక్కడే మొదలయ్యాయి. మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు వందలాది మంది నాయకులను తయరు చేసిన ఘనత ఓయూకు దక్కుతుంది. – వీసీ ప్రొ.రవీందర్ ఆర్ట్స్ కాలేజీ భవనం నిర్మాణం చరిత్రాత్మకం ఓయూ ఐకాన్‌గా నిలిచిన ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణం చరిత్రాత్మకం. ఓయూ స్థాపనకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో నిజాం నవాబ్ 1934లో ప్రారంభించిన ఆర్ట్స్ కాలేజీ భవన నిర్మాణానికి అంతే ప్రాముఖ్యత ఉంది. డిగ్రీ కోర్సులతో ప్రారంభమైన ఓయూలో ప్రస్తుతం సుమారు 2.5 లక్షల విద్యార్థులు పీజీ, పీహెచ్డీ వరకు దూరవిద్య, రెగ్యులర్ కోర్సులు చదువుతున్నారు. 87 దేశాలకు చెందిన విదేశీ విద్యార్థులు ఓయూలో విద్యాభ్యాసం చేస్తున్నారు. – ప్రొ.అంజయ్య– చరిత్ర విభాగం 70 శాతం మహిళలు చదవడం ఓయూ ప్రత్యేకత ఓయూలో తొలిరోజుల్లో ధనవంతుల పిల్లలు చదువుకునేవారు. నేడు నూటి కి నూరుశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అందులో 70శాతం మహిళలు ఉండటం విశేషం. 105 ఏళ్ల చరిత్ర గల ఓయూకు పూర్వ వైభవం తెచ్చేందుకు వీసీ చేస్తున్న కృషి అభినందనీయం. – ప్రొ.సూర్య ధనుంజయ్– తెలుగుశాఖ. ఆనందంగా ఉంది అనేక మంది విద్యావంతులు, మేధావులు, సైంటిస్టులు, రాజకీయ నాయకులను, ఇతరులను అందించిన ఓయూలో చదవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఓయూ నేడు 105 ఫౌడేషన్ డే జరుపుకోవడం ఆనందంగా ఉంది. –సంజయ్–పీహెచ్డీ విద్యార్థి. ఓయూ ఫౌండేషన్ డే పై నేడు లెక్చర్ ఓయూ 105వ ఫౌండేషన్ డే సందర్భంగా లోక్‌పాల్ సెక్రెటరీ భరత్‌లాల్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం లెక్చర్ ఇవ్వనున్నట్లు వీసీ ప్రొ.రవీందర్ తెలిపారు. సోమవారం ఫౌండేషన్ డేను విజయవంతం చేయాలని కోరుతూ వాక్ అండ్ రన్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఓయూ ఇంజినీరింగ్ ఎదుట వీసీ విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 10.30 నిమిషాలకు జరిగే ఫౌండేషన్ డే కార్యక్రమానికి విద్యార్థులు, సిబ్బంది అధిక సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి: సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు) -
నెక్ట్స్ ఏంటి?
రిజల్ట్‌తో సంబంధం లేకుండా చేసే ప్రతీ ప్రాజెక్ట్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచగల దర్శకుడు మణిరత్నం. ఆయన ప్రతీ రిలీజ్ తర్వాత అభిమానుల నుంచి వినిపించే ప్రశ్న నెక్ట్స్ ఏంటి? అని. మణిరత్నం దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో ‘నవాబ్’) మంచి సక్సెస్ అయింది. తాజాగా మణిరత్నం నెక్ట్స్ విజయ్‌తో సినిమా చేస్తారనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ‘చెక్క చివంద..’ సినిమాలానే విజయ్, విక్రమ్, శింబు కాంబినేషన్లో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారన్నది మరో వార్త. మరి.. మణిరత్నం నెక్ట్స్ సినిమా ఏంటి? అంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడటమే. -
చేదు పాయసం
‘‘ఏమైంది, మీరంతా పాయసం పారేశారు? ఎందుకు తినలేదు?’’అని ప్రశ్నించాడు నవాబు. ‘‘జీ హుజూర్, ఆ పాయసం పరమ ఉప్పగా, చేదుగా ఉంది. దాన్ని మేమెలా తినగలం?’’ అని సమాధానం వచ్చింది. పూర్వకాలంలో సులేమాన్ ఒక నవాబు ఉండేవాడు. అతని దగ్గర రియాజ్ అనే నమ్మకస్తుడైన ఒక పల్లెటూరి యువకుడు సేవకుడుగా ఉన్నాడు. అతడంటే నవాబుకు అంతులేని ప్రేమ, అభిమానం. అంత నమ్మకంగా సేవలందించేవాడు రియాజ్. రాజుగారి కొలువులో ఎంతో తెలివైన, గొప్పగొప్ప మంత్రులు కూడా ఉండేవాళ్లు. వారందరికీ ఈ పల్లెటూరి యువకుడిపై అసూయ కలిగింది. ఎలాగైనా ఇతణ్ణి రాజదర్బారునుండి గెంటించి వేయాలని పథకం పన్నారు. రాజుకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. రాజు వీళ్ల దుర్బుద్ధిని పసిగట్టి, ఏదో ఒకరోజు వీళ్లకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒకరోజు పాయసం వండించాడు. అందులో చక్కెరకు బదులు ఉప్పువేసి, వరుసగా మంత్రులందరికీ వడ్డించారు. అందరూ ఒక్క చెంచా నోట్లో పెట్టుకోగానే ముఖం మాడ్చుకొని ‘యాక్ థూ’ అంటూ ఉమ్మేశారు. కాని పల్లెటూరి యువకుడయిన రియాజ్ మాత్రం లొట్టలేసుకుంటూ సంతోషంగా తినేశాడు. అప్పుడు రాజు వారినుద్దేశించి, ‘‘ఏమైంది, మీరంతా పాయసం పారేశారు? ఎందుకు తినలేదు?’’ అని ప్రశ్నించాడు. ‘‘జీ హుజూర్, ఆ పాయసం పరమ ఉప్పగా, చేదుగా ఉంది. దాన్ని మేమెలా తినగలం?’’ అని సమాధానం వచ్చింది. వెంటనే నవాబు ఆ పల్లెటూరి యువకుణ్ణి ఉద్దేశించి, ‘‘అంత ఉప్పగా, చేదుగా ఉన్న పాయసాన్ని నువ్వు ఎలా తినగలిగావు? నీకు చేదుగా అనిపించలేదా?’’ అని ప్రశ్నించాడు. అందుకు ఆ యువ కుడు.. ‘‘అయ్యా! పాయసం ఉప్పగా, చేదుగా ఉన్నమాట నిజమే. కాని జీవితాంతం తమరు నాకు ఎంతో తియ్యనైన, రుచికరమైన పదార్థాలు పెట్టారు. నేను అడగకుండానే నా సమస్త అవసరాలు తీరుస్తున్నారు.అలాంటిది ఒక్కపూట ఉప్పు ఎక్కువైతే ఏమౌతుంది? ఒక్కపూట కాస్త ఇబ్బంది పడ్డందుకే జీవితాంతం చేసిన మేలును ఎలా మరిచిపోగలను?’‘ అన్నాడు కృతజ్ఞతగా. నిజమే, అల్లాహ్ అనునిత్యం మనపై అసంఖ్యాక అనుగ్రహాలు కురిపిస్తున్నాడు. అడగకుండానే అన్నీ సమకూరుస్తున్నాడు. కాని కాస్త బాధ కలగగానే మనం అవన్నీ మరచిపోతాం. దేవుడు నాకు ఏంచేశాడు? అనేస్తాం. పుట్టిన దగ్గరి నుండి మరణించే వరకు చేసిన మేళ్లను మరచిపోయి, కాస్తంత కష్టం కలగగానే బాధపడిపోవడం దైవాన్ని నమ్మినవారికి ఉండవలసిన గుణం కాదు. – మదీహా -
‘నవాబ్’కు మహేష్ ప్రశంసలు
లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నవాబ్. కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న మణిరత్నం.. నవాబ్ తో తిరిగి ఫాంలోకి వచ్చినట్టుగా భావిస్తున్నారు ఫ్యాన్స్. భారీ తారగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు నవాబ్ సినిమాను ఆకాశానికి ఎత్తేశాడు. ‘‘చెక్క చివంత వానం(తెలుగులో నవాబ్)’ అద్భుతమైన నటన.. ఏఆర్ రెహమాన్‌కు మాత్రమే సాధ్యమైన మ్యూజిక్, సంతోష్ శివన్ క్లాస్ సినిమాటోగ్రఫి. మణిరత్నం అభిమానిగా చెన్నై థియేటర్లలో చప్పట్లు కొడుతూ ఆయన సినిమాలు చూశాను. ఇప్పుడు అదే పని నా హోం థియేటర్లో గర్వంగా చేశాను. ఇంకా మీరు సినిమా చూడనట్టైతే వెంటనే వెళ్లి టికెట్స్ తీసుకోండి. ఓ క్లాసిక్ చూసిన భావన కలుగుతుంది. ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం. ద మాస్టర్ ఈజ్ బ్యాక్’ అంటూ పొగడ్తలతో ముంచేశారు. If you haven't seen the film, go grab your tickets people. We are witnessing a classic...👍 movie of the decade!! The master is back & how! 💪💪#ChekkaChivanthaVaanam — Mahesh Babu (@urstrulyMahesh) 2 October 2018 -
వెర్రి అభిమానంతో.. అభిమాని అత్యుత్సాహం!
-
వెర్రి అభిమానం.. క్రేన్‌కు వేళాడుతూ..!
కొన్నిసార్లు అభిమానులు చేసే పనులు సినీ తారలను ఇబ్బందుల పాలు చేస్తాయి. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో అభిమానుల అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నవాబ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాట చెక్క చివంత వానం పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాలో శింబు కీలక పాత్రలో నటించాడు. చాలా రోజులుగా ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న శింబు ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ఓ అభిమాని అత్యుత్సాహంతో చేసిన పని విమర్శలకు కారణమైంది. శరీరానికి సీకులు కుచ్చుకొని క్రేన్‌కు వేళాడుతూ దాదాపు 25 అడుగుల ఎత్తున్న శింబు కటౌట్‌కు పాలాభిషేకం చేశాడు అభిమాని. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది. -
మణిరత్నం ఆఫీస్‌కు బాంబు బెదిరింపు
లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం నవాబ్. అయితే ఈ సినిమాలో అభ్యంతరకర డైలాగ్‌లను తొలగించాలంటూ ఓ అగంతకుడు మణిరత్నం కార్యలయానికి ఫోన్ చేసిన బెదిరించాడు. చెన్నైలోని అభిరామపురంలోని మణి ఆఫీస్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ బెదించినట్టుగా మణి ఆఫీసు సిబ్బంది వెల్లడించారు. అయితే ఏ డైలాగ్‌లను తొలగించాలని అగంతగకుడు డిమాండ్ చేశాడో మాత్రం వెల్లడించలేదు. దీంతో అప్రమత్తమైన పోలీసులు మణిరత్నం ఆఫీస్‌కు భద్రత కల్పించారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తమిళ నాట 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. -
‘సాహో’ బాహుబలిని మించి ఉంటుంది
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సాహో చిత్రం బాహుబలిని మించి ఉంటుందని అందులో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్న నటుడు అరుణ్ విజయ్ పేర్కొన్నారు. ఈయన రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం అయినా, అంతకు ముందు ఎంతవాడుగానీ లాంటి పలు అనువాద చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. తాజాగా మణిరత్నం చిత్రం నవాబ్ ( తమిళంలో సెక్క సెవంద వారం) చిత్రంలో నటించారు. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఇటీవలే తెరపైకి వచ్చి మంచి టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా నటుడు అరుణ్‌విజయ్ శనివారం స్థానిక ఆన్నామలైపురంలోని దర్శకుడు మణిరత్నం కార్యాలయంలో సాక్షితో తన ఆనందాన్ని పంచుకున్నారు. ఆయనతో సాక్షి భేటీ. నవాబ్(సెక్క సెవంద వానం) చిత్రం గురించి? చిత్రానికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. చాలా ఆనందంగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో నటించడం చాలా మంచి అనుభవం. అరవిందస్వామి, శింబు, జ్యోతిక, జయసుధ, ప్రకాశ్‌రాజ్ వంటి ప్రముఖ నటీనటులతో కలిసి నటించడం మధరమైన అనుభూతిని కలిగించింది. నవాబ్ చిత్రంలో మీ పాత్ర గురించి? నవాబ్ చిత్రంలో త్యాగు అనే పాత్రలో నటించాను. ముందుగా మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి కాస్త భయపడ్డాను. నటుడు అరవిందస్వామినే ఏం పర్వాలేదు. ఎలాంటి సందేహం కలిగినా దర్శకుడిని నిస్పందేహంగా అడుగు అని ధైర్యం ఇచ్చారు. నిజం చెప్పాలంటే త్యాగు చిత్రంలో నటించడం నాకు చాలెంజ్ అనిపించింది.అలాంటి పాత్రను ప్రేక్షకులు ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు మణిరత్నం ఆల్వేస్ ఫ్యాషన్. ఆయన పాత్రల కన్వెర్టింగ్ అమేజింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలోని పాత్ర తనకు చాలా ఎంకరేజింగ్ నిచ్చింది. మరిన్ని వైవిధ్యభరిత పాత్రలను పోషించడానికి ప్రేరణ నిచ్చింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? ప్రస్తుతం తడం అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాను. మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. మంచి కథా పాత్రలను ఎంచుకుని నటించాలన్నదే నా భావన. తెలుగులో నటించడం గురించి? తెలుగులో నటించడం నాకు చాలా ఇష్టం. నేను నటించిన ఎంతవాడు గానీ లాంటి పలు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యాను. తెలుగులో రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్రూస్లీ చిత్రంలో విలన్‌గా నటించాను. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చినా మంచి పాత్రల్లోనే చేయాలని వేచి చూశాను. అలాంటి సమయంలో ప్రభాష్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సాహోలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం అద్భుతంగా వస్తోంది. బాహబలి చిత్రాన్ని మించే స్థాయిలో సాహో వస్తోంది. మంచి అవకాశం అయితే తెలుగులో హీరోగానూ నటించాలని ఉంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఆశగా ఉంది. -
అప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయా!
‘‘నటుడిగా ఫస్ట్ సినిమా ‘దళపతి’ కూడా మల్టీస్టారరే చేశాను. మల్టీస్టారర్స్ చేయడం పెద్ద కష్టం కాదు. అన్ని క్యారెక్టర్స్ బాగా కుదిరితే అందరికీ మంచి గుర్తింపు లభిస్తుంది. స్క్రిప్ట్ స్టార్స్‌ని డిమాండ్ చేస్తే తప్పకుండా కలసి నటించాలి. అలాగే కమర్షియల్ యాంగిల్లో కూడా ఆలోచించాలి. దర్శకుడు హ్యాండిల్ చేస్తాడనే నమ్మకం ఒకటి చాలు. మల్టీస్టారర్స్ వస్తూనే ఉంటాయి’’ అని అరవింద స్వామి అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అదితీరావ్ హైదరీ, ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘చెక్క చివంద వానమ్’. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నవాబ్’ పేరుతో అశోక్ వల్లభనేని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అరవింద స్వామి చెప్పిన విశేషాలు... ►నా పాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. సంతోషంగా ఉంది. రోజా, బొంబాయి నుంచి ప్రేక్షకులు ప్రేమను పంచుతున్నారు. ధన్యవాదాలు. మణిరత్నంగారితో తొమ్మిదోసారి కలసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ను నేనో గురువులా భావిస్తాను. కాళ్లకు మొక్కి నమస్కరించకపోయినా ఆయన మీద మాత్రం నాకు అపారమైన గౌరవం ఉంది. ఇప్పటికీ సినిమా ‘చెయ్’ అని అడగరు. ఐడియా ఉంది. సినిమా చేద్దామా? అని అడుగుతారు. అదే ఆయనలోని స్పెషాలిటీ. ►‘తని ఒరువన్’ (తెలుగులో ‘ధృవ’)లో విలన్‌గా నటించినప్పటి నుంచే నా పాత్ర పట్ల క్రియేటీవ్‌గా ఇన్వాల్వ్ అవ్వాలని అనుకున్నాను. అలా చేస్తే పాత్రలో పూర్తిగా నిమగ్నమవ్వొచ్చన్నది నా అభిప్రాయం. ∙నేను నటుణ్ని అవ్వాలనుకోలేదు. ‘బొంబాయి, రోజా’ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ స్టార్డమ్ చాలా కష్టంగా అనిపించింది. స్టార్డమ్ వచ్చినప్పుడు కూడా స్టార్లా ఫీల్ అవ్వలేదు. మధ్యలో బ్రేక్ వచ్చింది. మళ్ళీ మణిసారే పిలిచి ‘కడలి’ సినిమా చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు నెగటీవ్ పాత్రలు చేస్తున్నప్పుడే స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఇంకా ఆసక్తిగా అనిపిస్తోంది. ఏ తప్పూ చేయకుండా హీరో అన్నీ మంచి పనులే చేస్తుంటాడు. కానీ రియల్ లైఫ్‌లో మనుషులు అలా ఉండరే. అందుకేనేమో? (నవ్వుతూ). ∙‘గాడ్ ఫాదర్’ సినిమాలో హీరోకి నెగటీవ్ షేడ్ ఉంటుంది. కానీ కథ అంతా హీరో చుట్టే తిరుగుతుంది. అయినా విలన్ అని అనం. నేను చేసే పాత్రలు కూడా అలానే ఉండాలని భావిస్తాను. ►ఏదైనా స్క్రిప్ట్‌కి ‘యస్’ చెప్పే ముందు మొత్తం స్క్రిప్ట్‌ని క్షుణ్ణంగా చదవాల్సిందే. అప్పుడే యస్ ఆర్ నో చెబుతాను. ఒక్కసారి ‘యస్’ చెప్పాక ఆ పాత్ర గురించి దర్శకుడితో డిస్కస్ చేసుకుంటాను. అలాగే ‘నవాబ్’లో నేను చేసిన వరదన్ పాత్ర గురించి చర్చిస్తుండగా ఫిజిక్ గురించి టాపిక్ వచ్చింది. ‘వరదన్’ పాత్ర బుల్లా ఉంటుంది. అతని శరీరాకృతి అయినా, ప్రవర్తించే విధానమైనా బుల్లానే ఉంటుంది. అలా అనుకుని అందుకు అనుగుణంగా నన్ను మార్చుకున్నాను. ఫస్ట్ సినిమా నుంచి మణిసార్‌తో ఏకీభవిస్తూ, గొడవపడుతూ వర్క్ చేస్తున్నాను. యాక్టర్స్‌కి ఆయన ఎప్పుడూ క్రియేటీవ్ ఫ్రీడమ్ ఇస్తుంటారు. ►ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాల్లో మెల్లిగా మార్పు కనిపిస్తోంది. కొత్త కాన్సెప్ట్స్‌ని ప్రేక్షకులు చూస్తున్నారు. నా వరకు నేను ఫార్ములా సినిమాలు సరిగ్గా తీయకపోతే కూర్చుని చూడలేను. అలాంటిది అలాంటి సినిమాల్లో యాక్టింగ్ అంటే చాలా కష్టం. ‘నవాబ్’ సినిమాను తమిళంలో ‘పొన్నియిన్ సెల్వన్’ నవలతో, కరుణానిధి ఫ్యామిలీకు దగ్గరగా ఉంది అని ట్వీటర్లో పోలుస్తున్నారు. కానీ ఇది ఒరిజినల్ స్క్రిప్ట్. అన్నీ కల్పిత పాత్రలే. ► కమర్షియల్ సక్సెస్ మాత్రమే మణిరత్నంగారి టాలెంట్‌కి కొలమానం కాదు. కమర్షియల్ సక్సెస్ తీయాలనుకోవడం చాలా చిన్న పని ఆయనకు. కానీ తనను తాను చాలెంజ్ చేసుకునే దర్శకుడు. ఇప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉండకుండా పని చేస్తున్నారు. అది గ్రేట్. మనం అభినందించాల్సిన విషయం. గమనిస్తే ఆయన తీసిన ఏ రెండు సినిమాలూ ఒకలా ఉండవు. ► తెలుగుతో ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను. నాకు కొత్త భాష నేర్చుకోవడం రాదు. మా పిల్లలు కొత్త భాషను టక్కున నేర్చుకుంటారు. నేను మాత్రం నేర్చుకోలేకపోతున్నాను (నవ్వుతూ). ► ‘డియర్ డాడ్’ సినిమాలో స్వలింగ సంపర్కం గురించి మాట్లాడాం. ఆ సినిమా చేయడానికి చాలా సంకోచించాను. ఆడియన్స్ ఒప్పుకుంటారా? ‘ఇంత అందగాడు హోమో సెక్కువల్గానా? అమ్మాయికి ఐ లవ్ యు చెప్పాల్సింది పోయి అబ్బాయికా?’ అని ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొడతారా? అని అనుకోలేదు. అసలు ఆ పాత్రకు సూట్ అవ్వగలనా? అని మాత్రమే ఆలోచించాను. అందుకే మణిరత్నంగారికి కాల్ చేశాను. ఆయన సలహా మేరకు ఆ సినిమా చేశాను. ► మధ్యలో కాళ్లకు జరిగిన గాయం వల్ల కాళ్లు చచ్చుబడిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు నా కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయింది. ఇక్కడ మందులు వాడాం. మార్పు కనిపించకపోవడంతో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాం. ఆయుర్వేదం ట్రై చేశాం. పని చేసింది. అలా మళ్లీ మాములుగా అయ్యాను. ఆ సమయంలోనే మణిరత్నంగారు ‘కడలి’ సినిమా చేయమన్నారు. ఆ సినిమా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ► ఇంతకు ముందు న్యూస్ చూస్తుంటే న్యూస్ తెలుసుకుంటున్న భావన కలిగేది. కానీ ఇప్పుడు వాదనలు చూస్తున్నాం. న్యూస్ వినడం లేదు. ఎవరో అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్టు ఉంది. ఆల్రెడీ న్యూస్ అంటేనే ఏదో డ్రామా విషయాన్ని చెబుతున్నాం. దానికి ఇంకా డ్రామా జోడిస్తున్నారు. దాంతో న్యూస్ చూడటం మానేశాను. చదువుతున్నాను అంతే. ► నా బిజినెస్ బాగానే సాగుతోంది. సుమారు 4000వేల మంది వరకూ మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ► ఈ సంవత్సరమే డైరెక్టర్‌గా సినిమా స్టార్ట్ చేద్దామనుకున్నాను. కుదర్లేదు. వచ్చే ఏడాది మెగాఫోన్ పట్టుకుంటాను. చాలా స్క్రిప్ట్స్ రాసుకున్నాను. అందులో ప్రస్తుత టైమ్‌కి సూట్ అయ్యే కథతో సినిమా చేస్తా. తమిళంలో కార్తీక్ నరేన్ అనే టాలెండ్ దర్శకుడితో చేసిన ‘నరగాసురన్’ రిలీజ్ కోసం ఎదురుచూసున్నా. అలాగే తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం గురించి డిస్కషన్ జరుగుతోంది. -
‘నవాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
మణి సార్ ఫామ్‌లో ఉండి తీశారు – ఏఆర్ రెహమాన్
‘‘తెలుగు వినసొంపుగా ఉంటుంది. తెలుగు సినిమాలన్నా నాకు ఇష్టం. ఇక నా గురువుగారు మణిరత్నం విషయానికొస్తే.. ఆయనతో పని చేస్తున్నట్టే ఉండదు’’ అని ఏఆర్ రెహమాన్ అన్నారు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్‌విజయ్ ముఖ్య పాత్రల్లో మణిరత్నం రూపొందించిన మల్టీస్టారర్ మూవీ ‘నవాబ్’. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. రెహమాన్ మాట్లాడుతూ– ‘‘యుఎస్ ట్రిప్ గ్యాప్‌లో ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసేవాణ్ణి. మణి సార్ నన్ను అంత నమ్మారు. ఆయన పూర్తి ఫామ్‌లో ఉండి తీసిన సినిమా ఇది. ‘భగ భగ’ పాట స్క్రిప్ట్‌కి బావుంటుంది అని అడిగి నేనే చేశాను’’ అన్నారు. మణిరత్నం మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా పూర్తి టీమ్ వర్క్. సీతారామశాస్త్రి, రాఖీ మంచి పాటలు రాశారు. రెహమాన్‌కు థ్యాంక్య్. ఈ కథ స్టార్స్‌ని డిమాండ్ చేసింది. అందరితో పని చాలా సులువుగా జరిగింది’’ అన్నారు. ‘‘నేను నిక్కర్లు నుంచి ప్యాంట్లు వేసుకోవడం మొదలుపెట్టిన రోజుల్లో మణి సార్ ‘నాయకుడు’ సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి స్మగ్లర్ అయిపోదామనుకున్నాను. ‘దొంగ దొంగ’ సినిమా చూసి దొంగ అవుదాం అనుకున్నాను. అంత ఇన్ఫ్లూ్యన్స్ చేస్తారు. ఆయన్ను కలిస్తే చాలనుకున్నాను. ఆయన సినిమాను తెలుగులో అన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నాను. రెహమాన్ గారి పాటలకు అభిమాని కాని వారు ఎవరు?’’ అన్నారు అశోక్ వల్లభనేని. ‘‘మణి సార్‌తో వర్క్ చేయాలనే నా కల నిజమైంది. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది అనుకుంటున్నాను. నా కెరీర్‌కు ఈ సినిమా మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది అనుకుంటున్నాను’’ అన్నారు అరుణ్ విజయ్. ‘‘ఇండియన్ లెజెండ్స్‌తో కలసి సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు డయానా ఎరప్ప. ‘‘నేను తెలుగు అమ్మాయినే. చెన్నైలో సెటిల్డ్. అందరితో యాక్ట్ చేయడం మంచి ఎక్స్పీరియన్స్. నేను పని చేసిన దర్శకుల్లో మణి సార్ మోస్ట్ కంఫర్ట్బుల్. ఆయన చెప్పింది చిన్న బిడ్డకు కూడా అర్థం అవుతుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేశ్. ‘‘రోజా’ నుంచి ‘ధృవ’ వరకూ మీ (ప్రేక్షకులు) ప్రేమను ఇస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో పాత్రకూ అలాంటి ప్రేమనే పంచండి. నా కెరీర్ స్టార్ట్ అయింది మణిరత్నంగారి వల్లే. మధ్యలో బ్రేక్ వచ్చింది. మళ్లీ ఆయనే తీసుకొచ్చారు. మణి సార్‌తో ప్రతి మూవీ స్పెషలే. ఈ సినిమా ఇంకా స్పెషల్’’ అన్నారు అరవింద్ స్వామి. -
రేపే ‘నవాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్!
చెలియా చిత్రం తరువాత మణిరత్నం దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం నవాబ్. భారీ మల్టిస్టారర్గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. మణిరత్నం ఈసారీ అన్నదమ్ముల మధ్య జరిగే సంఘర్షణను ‘నవాబ్’ రూపంలో ప్రేక్షకులకు ముందుకు తెస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నవాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్ 25న పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులందరూ హాజరుకాబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీలో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, జయసుధ, జ్యోతిక తదితరులు నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. -
నవాబ్ : అన్నదమ్ముల యుద్ధం!
లెజెండరీ దర్శకుడు మణిరత్నం స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా నవాబ్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. ప్రకాష్ రాజ్ డాన్ తరహా పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తొలి ట్రైలర్లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేసిన నవాబ్ టీం, రెండో ట్రైలర్లో కథ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు. ట్రైలర్ చూస్తుంటే తండ్రి తరువాత ఆదిపత్యం కోసం అన్నదమ్ముల మధ్య జరిగే యుద్ధమే నవాబ్ కథ అని తెలుస్తోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో జోతిక, ఐశ్వర్యరాజేష్, డయానా ఎర్రప్పలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
‘నవాబ్’ రెండో ట్రైలర్‌ను రిలీజ్
-
నవాబ్ వస్తున్నాడు
శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితీరావ్ హైదరి, జయసుధ, ప్రకాశ్‌రాజ్ ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ ‘నవాబ్’. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను అశోక్ వల్లభనేని సొంతం చేసుకున్నారు. నాని ‘సెగ’, గౌతమ్‌మీనన్ ‘ఎర్ర గులాబీలు’ చిత్రాలను విడుదల చేయడంతో పాటు నాగశౌర్య ‘ఛలో’, రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశారు అశోక్. ‘నవాబ్’ గురించి అశోక్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో ‘చెక్క చివంద వానం’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘నవాబ్’ పేరుతో ఈ నెల 27న తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో మణిరత్నం, ఏఆర్ రెహమాన్ పాల్గొంటారు’’ అన్నారు. -
‘నవాబ్’ కూడా నిజజీవిత పాత్రల నేపథ్యమే..!
లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నవాబ్. మణి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. అయితే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మణిరత్నం గత చిత్రాలు ఎక్కువగా పురాణేతిహాసాలు, చారిత్రక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కినవే. ప్రేమకథా చిత్రాలు తప్ప మణి దర్శకత్వంలో తెరకెక్కిన ఇతర చిత్రాలు రామాయణ మహాభారతాలు, తమిళ రాజకీయ నాయకుల కథల ఇన్పిపిరేషన్‌తో తెరకెక్కించారు. తాజా చిత్రం నవాబ్ కూడా అలా నిజజీవిత పాత్రల నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమిళ రాజకీయాల నేపథ్యంలోనే ఈ సినిమా రూపొందించారని ప్రధాన పాత్రలైన ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామిల పాత్రలు తమిళ నాయకులను గుర్తు చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై మణి టీం మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
మణిరత్నం ఆదుకోవాలి.. సినీకార్మికుడి ఫిర్యాదు
దర్శకుడు మణిరత్నంపై సినీ లైట్‌మెన్ పోలీస్ కమిషనర్‌కు సోమవారం ఫిర్యాదు చేశాడు. అనంతరం మణిమారన్ మీడియాతో మాట్లాడుతూ తాను సినీ లైట్‌మెన్‌గా పని చేశానని లైట్‌మెన సంఘంలో సభ్యుడిగా ఉన్నానన్నాడు.10 ఏళ్ల క్రితం తాను దర్శకుడు మణిరత్నం చిత్రాలకు పనిచేశానని చెప్పాడు. కాగా అప్పుడు నటుడు అభిషేక్‌బచ్చన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన గురు చిత్ర షూటింగ్ స్థానిక పెరంబూరులో జరినప్పుడు తాను విష జ్వరానికి గురయ్యానని తెలిపాడు. ఆస్పత్రిలో చేరగా చికిత్సకు రూ.2 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారన్నారు. తాను పేదవాడిని కావడంతో తన వద్ద అంత డబ్బు లేకపోవటంతో దర్శకుడు మణిరత్నం ఇంటికి వెళ్లి సాయం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపాడు. చివరికి ఆర్థికసాయం కోరుతూ ఒక లేఖ కూడా రాశానని, అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు. తన భార్య పని చేసి తన కుటుంబాన్ని పోషిస్తోందని చెప్పాడు. లైట్‌మెన్ సంఘం నుంచి రూ. 2 లక్షలు వైద్య సాయానికి అందించాల్సిందిగా కోర్టు ఆదేశించిందని చెప్పాడు. అయితే ఆ సంఘం నిర్వాహకులు తనను రూ.20 వేలు లంచం ఇవ్వాలని అడిగారన్నాడు. తాను అప్పు చేసి ఆ డబ్బును సంఘంకు ఇచ్చానని, అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం లైట్‌మెన్ సంఘం రూ. 2 లక్షలు కాకుండా లక్ష రూపాయలే ఇచ్చిందని చెప్పాడు. మరో లక్ష ఇవ్వాల్సి ఉందన్నాడు. తను మణితర్నం చిత్రాలకు పని చేశానని, ఆయన మానవత్వంతో తనకు ఆర్థికసాయం చేయాలని కోరారు. అందుకోసం తాను స్థానిక నుంగంబాక్కమ్ వళ్లువర్ కోట్టం వద్ద కుటుంబంసహా నిరాహార దీక్ష చేయడానికి పోలీసుల అనుమతి కోరడానికే కమిషనర్ కార్యాలయానికి వచ్చినట్లు మణిమారన్ తెలిపాడు. ఈ సంఘటన కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
కోలీవుడ్‌కు మరో మోడల్
దర్శకుడు మణిరత్నం హస్తవాసి బాగుంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హీరోయిన్లకు మణి లక్కీ హ్యాండ్. రోజా చిత్రంతో మధుబాలను, ముంబయి చిత్రంతో మనీషా కోయిరాలను, ఇరువర్ చిత్రంతో ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేసి వారి సినీ జీవితాన్ని ఇచ్చారు. ఇటీవల కాట్రువెలియిడై చిత్రం ద్వారా అధితిరావ్ హైదరిని కోలీవుడ్‌కు తీసుకొచ్చారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా అధితిరావ్ హైదరికి మాత్రం ఇక్కడ అవకాశాలు వరుస కడుతున్నాయి. అదే వరుసలో తాజాగా మణిరత్నం మరో ప్రముఖ మోడల్‌ను హీరోయిన్గా పరిచయం చేశారు. అమెనే డయానా ఎరప్పా. మణిరత్నం తాజా చిత్రం సెక్క సివంద వారం చిత్రంలోని హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరుగా కనిపించనుంది. సంచలన నటుడు శింబుతో ఈ అమ్మడు ఇందులో రొమాన్స్ చేసింది. కర్ణాటకకు చెందిన డయానా ఎరప్పా 2011లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో తొలి 10 మందిలో ఒకరుగా నిలిచింది. ఆ తరువాత 2012లో జరిగిన అంతర్జాతీయ మోడలింగ్ పోటీ అయిన షాంగాయ్ ఎలైట్ మోడల్ పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. అదే విధంగా 2015, 2017 కింగ్‌ఫిషర్ క్యాలెండర్, లాక్మే ష్యాషన్ వీక్, అమేజాన్ ష్యాషన్ వీక్ వంటి పలు ప్రాచుర్యం పొందిన పత్రికల ముఖ చిత్రాలపై మెరిసిన సుందరి డయానా ఎరప్పా. అదే విధంగా పలు ప్రముఖ వ్యాపార సంస్థల ప్రచార ప్రకటనల్లో నటించిన ఈ మోడల్ దర్శకుడు మణిరత్నం కంట పడింది. అంతే వెండి తెరకెక్కేసింది. మణిరత్నం లాంటి గొప్ప దర్శకుడి చిత్రంలో నటించే అవకాశం రావడం తన అదృష్టం అని ఈ అమ్మడు చిత్ర ఆడియో విడుదల వేదికపై చెప్పింది. అదేవిధంగా శింబుకు జంటగా నటించడం మంచి అనుభవం అని పేర్కొంది. ఇంత మంచి అవకాశం కల్సించిన దర్శకుడు మణిరత్నంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది. సెక్క సివంద వానం చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తన సినీ భవిష్యత్‌ను నిర్ణయించనున్న ఈ చిత్రం విడుదల కోసం ఈ సుందరి చాలా ఎగ్జైట్‌గా ఎదురు చూస్తోందట. -
అమ్మకు నచ్చిన పాట!
రెహమాన్... భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు. కేవలం ఒక భాషకు పరిమితం కాకుండా నార్త్ నుంచి సౌత్.. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా చాలామందికి ఆయన సంగీతం నచ్చుతుంది. తమిళ తలైవి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ జాబితాలో ఉన్నారు. రెహమాన్ పాటల్లో ఆమె ఎంజాయ్ చేసింది ‘బొం బాయి’ సినిమాలో ‘కన్నానులే కలలు..’ సాంగ్ అట. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు చెప్పారు. మణిరత్నం, రెహమాన్, వైరముత్తు కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. తాజాగా వస్తున్న చిత్రం ‘చెక్క చివంద వానమ్’(తెలుగులో నవాబ్). ఈ చిత్రం ఆడియో వేడుక చెన్నైలో జరిగింది. మీ ముగ్గురి కాంబినేషన్లో రూపొందిన పాటల్లో మీకేది ఇష్టం? అని అడిగిన సందర్భంలో కొన్ని పాటలు చెప్పడంతో పాటు ఓ ఫ్లాష్‌బ్యాక్ సంఘటనని వైరముత్తు పంచుకున్నారు – ‘‘ఒకసారి జయలలితగారు రెహమాన్ స్టూడియోను సందర్శించారు. అప్పుడు రెహమాన్‌తో ‘నువ్వు కంపోజ్ చేసిన లేటెస్ట్ సాంగ్ ఏదైనా ఉంటే ప్లే చేయి’ అని అడిగారట. వెంటనే రెహమాన్ ‘బొంబాయి’ సినిమాలో ‘కన్నానులే కలలు..’ సాంగ్ పాడి వినిపించారట. ఆ పాటను జయలలిత బాగా ఎంజాయ్ చేశారు’’ అని ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేశారాయన. -
మాఫియా నేపథ్యంలో...
మణిరత్నం.. ఈ పేరు చెప్పగానే ‘గీతాంజలి, బాంబే, రోజా, సఖి, ఘర్షణ, దళపతి, యువ’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. ప్రేమకథలే కాదు.. మెసేజ్ ఓరియంటెడ్ ఎమోషనల్ చిత్రాలను తెరకెక్కించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘నవాబ్’. అరవింద స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్యా రాజేశ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్. త్యాగరాజన్ ప్రధాన తారలుగా లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో నాగార్జున విడుదల చేశారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ– ‘‘మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మంచి యాక్షన్ ప్యాక్డ్గా ఉంటూనే ఎమోషనల్ కంటెంట్‌తో సాగుతుంది. నాగార్జునగారు రిలీజ్ చేసిన ట్రైలర్ ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టాప్ టెక్నీషియన్స్ సహకారంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మించేలా సినిమా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ పకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, కెమెరా: సంతోష్ శివన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ ఆనంది, నిర్మాతలు: మణిరత్నం, సుభాష్ కరణ్. -
‘నవాబ్’ ట్రైలర్ విడుదల
-
బిగ్గెస్ట్ మల్టీస్టారర్ : నవాబ్ ట్రైలర్
లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా నవాబ్. అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ ఇలా భారీ తారాగణంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్‌ను కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా తమిళ వర్షన్ ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రిలీజ్ చేశారు. సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ రూపొదించిన ఈ ట్రైలర్లో అందరూ ప్రతినాయకులలాగే కనిపిస్తున్నారు. మణి మార్క్ టేకింగ్ టాప్ స్టార్స్‌తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు.