డంప్‌ యార్డ్‌ ముందు నోట్ల కట్టలు.. సిగరెట్‌ తాగుతున్న హీరో | Mukesh Gupta And Ananya Nagalla Nawab Movie First Look Poster Out, Goes Viral - Sakshi
Sakshi News home page

Nawab Movie: డబ్బుల కట్టలు, డంప్‌ యార్డు.. దర్జాగా సిగరెట్‌ తాగుతున్న హీరో

Published Mon, Oct 16 2023 11:14 AM | Last Updated on Mon, Oct 16 2023 11:35 AM

Nawab Movie First Look Poster Out - Sakshi

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ళ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'నవాబ్'. హరిహర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్ఎం నిర్మాణ సారథ్యంలో రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ రా అండ్ రస్టిక్ లుక్‌తో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా కనిపిస్తోంది. ముందు డబ్బుల కట్టలు, వెనుక డంప్ యార్డ్, మధ్యలో రక్తపు మరకలతో ఇంటెన్సివ్ గా సిగరెట్‌ తాగుతున్నాడు హీరో. ఈ చిత్రం ఒక డంప్ యార్డ్ చుట్టూ అల్లుకున్న కథ అని, ఆద్యంతం ఉత్కంఠ భరితమైన థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకుడికి 'నవాబ్' చిత్రం అందిస్తుందని మేకర్స్ తెలిపారు.

యాక్షన్ డ్రామాతో పాటు ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే హృదయాన్ని కదిలించే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో కీలకమని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం 'నవాబ్' సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని, త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం చేస్తామని తెలిపింది. వీలైనంత త్వరగా మూవీ విడుదలకు సంబంధించిన ప్రకటనను వెల్లడించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

ప్రేక్షక ఆధరణతో పాటు విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న 'నల్లమల' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ రవి చరణ్ తన రెండవ చిత్రం అయిన 'నవాబ్' మూవీకి దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే నవాబ్ చిత్రానికి స్టైలిస్ట్ గా శోభారాణి పనిచేశారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

చదవండి: ఇంటికి వెళ్లి తల్లిని పట్టుకుని బోరున ఏడ్చేసిన నయని.. టాప్‌ 5లో ఉండాలనుకున్నా అంటూ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement