∙డయానా, ఐశ్వర్యా రాజేశ్, రెహమాన్, అరవింద్ స్వామి, మణిరత్నం, అశోక్ వల్లభనేని, అరుణ్ విజయ్
‘‘తెలుగు వినసొంపుగా ఉంటుంది. తెలుగు సినిమాలన్నా నాకు ఇష్టం. ఇక నా గురువుగారు మణిరత్నం విషయానికొస్తే.. ఆయనతో పని చేస్తున్నట్టే ఉండదు’’ అని ఏఆర్ రెహమాన్ అన్నారు. అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబు, అరుణ్‌విజయ్ ముఖ్య పాత్రల్లో మణిరత్నం రూపొందించిన మల్టీస్టారర్ మూవీ ‘నవాబ్’. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మించాయి. అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. రెహమాన్ మాట్లాడుతూ– ‘‘యుఎస్ ట్రిప్ గ్యాప్‌లో ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసేవాణ్ణి. మణి సార్ నన్ను అంత నమ్మారు. ఆయన పూర్తి ఫామ్‌లో ఉండి తీసిన సినిమా ఇది. ‘భగ భగ’ పాట స్క్రిప్ట్‌కి బావుంటుంది అని అడిగి నేనే చేశాను’’ అన్నారు. మణిరత్నం మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా పూర్తి టీమ్ వర్క్. సీతారామశాస్త్రి, రాఖీ మంచి పాటలు రాశారు. రెహమాన్‌కు థ్యాంక్య్. ఈ కథ స్టార్స్‌ని డిమాండ్ చేసింది. అందరితో పని చాలా సులువుగా జరిగింది’’ అన్నారు. ‘‘నేను నిక్కర్లు నుంచి ప్యాంట్లు వేసుకోవడం మొదలుపెట్టిన రోజుల్లో మణి సార్ ‘నాయకుడు’ సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి స్మగ్లర్ అయిపోదామనుకున్నాను.
‘దొంగ దొంగ’ సినిమా చూసి దొంగ అవుదాం అనుకున్నాను. అంత ఇన్‌ఫ్లూ్యన్స్ చేస్తారు. ఆయన్ను కలిస్తే చాలనుకున్నాను. ఆయన సినిమాను తెలుగులో అన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నాను. రెహమాన్ గారి పాటలకు అభిమాని కాని వారు ఎవరు?’’ అన్నారు అశోక్ వల్లభనేని. ‘‘మణి సార్‌తో వర్క్ చేయాలనే నా కల నిజమైంది. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందుతుంది అనుకుంటున్నాను. నా కెరీర్‌కు ఈ సినిమా మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది అనుకుంటున్నాను’’ అన్నారు అరుణ్ విజయ్. ‘‘ఇండియన్ లెజెండ్స్‌తో కలసి సినిమా చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు డయానా ఎరప్ప. ‘‘నేను తెలుగు అమ్మాయినే. చెన్నైలో సెటిల్డ్. అందరితో యాక్ట్ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్. నేను పని చేసిన దర్శకుల్లో మణి సార్ మోస్ట్ కంఫర్ట్‌బుల్. ఆయన చెప్పింది చిన్న బిడ్డకు కూడా అర్థం అవుతుంది’’ అన్నారు ఐశ్వర్యా రాజేశ్. ‘‘రోజా’ నుంచి ‘ధృవ’ వరకూ మీ (ప్రేక్షకులు) ప్రేమను ఇస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో పాత్రకూ అలాంటి ప్రేమనే పంచండి. నా కెరీర్ స్టార్ట్ అయింది మణిరత్నంగారి వల్లే. మధ్యలో బ్రేక్ వచ్చింది. మళ్లీ ఆయనే తీసుకొచ్చారు. మణి సార్‌తో ప్రతి మూవీ స్పెషలే. ఈ సినిమా ఇంకా స్పెషల్’’ అన్నారు అరవింద్ స్వామి.
Comments
Please login to add a commentAdd a comment