
కొన్నిసార్లు అభిమానులు చేసే పనులు సినీ తారలను ఇబ్బందుల పాలు చేస్తాయి. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో అభిమానుల అత్యుత్సాహం విమర్శలకు తావిస్తోంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నవాబ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాట చెక్క చివంత వానం పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాలో శింబు కీలక పాత్రలో నటించాడు.
చాలా రోజులుగా ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న శింబు ఓ క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ఓ అభిమాని అత్యుత్సాహంతో చేసిన పని విమర్శలకు కారణమైంది. శరీరానికి సీకులు కుచ్చుకొని క్రేన్‌కు వేళాడుతూ దాదాపు 25 అడుగుల ఎత్తున్న శింబు కటౌట్‌కు పాలాభిషేకం చేశాడు అభిమాని. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment