మణిరత్నం రత్నాల్లాంటి సినిమాలను ప్రేక్షకులకు అందించారు. మణిరత్నం సినిమాల్లో నటిస్తే చాలనుకుంటారు హీరోలు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా.. జాతీయ స్థాయిలో మణిరత్నం సినిమాలకు క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎంచుకునే కథలకు సరిహద్దులు ఉండవు. పాత్రల మధ్య భావోద్వేగాలే ఆయన కథను నడిపిస్తాయి.
గత కొంతకాలం పాటు మణిరత్నం నుంచి వచ్చే సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. అయితే మళ్లీ మునుపటి మణిరత్నాన్ని తలపించేలా, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేలా ‘నవాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, శింబులు అన్నదమ్ములుగా నటిస్తున్నారని, వీరి మధ్య వచ్చే సంఘర్షణలే సినిమాకు కీలకం అని తెలుస్తోంది. ఈ సినిమాలో జ్యోతిక, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సోమవారం సాయంత్రం నుంచి సినిమాలోని లీడ్ క్యారెక్టర్స్‌కు సంబంధించిన లుక్స్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. నేటి సాయంత్రం 5గంటలకు అరవింద్ స్వామి లుక్‌ను రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
#Nawab - Look 1 coming up at 5 PM today! Guess who?#ManiRatnam @LycaProductions @thearvindswami #STR #VijaySethupathi @arunvijayno1 @prakashraaj #Jyotika @aditiraohydari @aishu_dil @DayanaErappa @salamsir21@arrahman @santoshsivan @sreekar_prasad #SirivennelaSeetharamaSastry pic.twitter.com/ii5tPgqtrg
— Lyca Productions (@LycaProductions) August 13, 2018
Comments
Please login to add a commentAdd a comment