రేపే ‘నవాబ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌! | Mani Ratnam Nawab Pre Release Event on 25th September | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 24 2018 7:28 PM | Last Updated on Mon, Sep 24 2018 8:57 PM

Mani Ratnam Nawab Pre Release Event on 25th September - Sakshi

చెలియా చిత్రం తరువాత మణిరత్నం దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం నవాబ్‌. భారీ మల్టిస్టారర్‌గా తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది. మణిరత్నం ఈసారీ అన్నదమ్ముల మధ్య జరిగే సంఘర్షణను ‘నవాబ్‌’ రూపంలో ప్రేక్షకులకు ముందుకు తెస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

నవాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్‌ 25న పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి చిత్ర నటీనటులందరూ హాజరుకాబోతున్నారని మేకర్స్‌ ప్రకటించారు. ఈ మూవీలో అరవింద్‌ స్వామి, శింబు, విజయ్‌ సేతుపతి, అరుణ్‌ విజయ్‌, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, జ్యోతిక తదితరులు నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న  విడుదల కానుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement