‘వరద’గా అరవింద్‌ స్వామి.. | Mani Ratnam Nawab Simbu look May Be Revealed On 14th August | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 14 2018 11:46 AM | Last Updated on Tue, Aug 14 2018 11:49 AM

Mani Ratnam Nawab Simbu look May Be Revealed On 14th August - Sakshi

మణిరత్నం సినిమా అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయన తన సినిమాల్లో క్యారెక్టర్స్‌ను మలిచే విధానం ఆకట్టుకుంటుంది. మణిరత్నం సృష్టించే పాత్రలే సినిమాను నడిపిస్తాయి. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన కడలి, చెలియా సినిమా అభిమానులను అంతగా మెప్పించలేకపోయాయి. మళ్లీ ఓ భారీ మల్టిస్టారర్‌ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. 

‘నవాబ్‌’గా తెలుగులో రాబోతోన్న ఈ మూవీలో అరవింద్‌ స్వామీ, శింబు, విజయ్‌ సేతుపతిలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రోజూ ఒక పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్‌ చేయనున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా సోమవారం ‘వరద’పాత్రకు సంబంధించిన అరవింద్‌ స్వామీ లుక్‌ను రివీల్‌ చేశారు. ఈ లుక్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నేడు శింబు పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జ్యోతిక, అదితీరావ్‌ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement