‘‘నేను తీసిన ‘96’ సినిమా ప్రేమకథ. కానీ, ‘సత్యం సుందరం’ కుటుంబ కథా చిత్రం. కార్తీ, అరవింద్ స్వామిగార్ల పాత్రల మధ్య ఒక రాత్రిలో జరిగే కథ. వాళ్ల మధ్య అనుబంధం ఏంటి? ఆ ఒక్క రాత్రిలో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్ అన్నారు.
కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సి. ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘సత్యం సుందరం’ నవలని సినిమా స్క్రిప్ట్‌లాగానే రాశాను. కార్తీ, అరవింద్ స్వామిగార్లు ముందు నవలని చదివారు... వారికి బాగా నచ్చింది. ఆ నవలని స్క్రిప్ట్‌గా మలచడం సులభంగా అనిపించింది.
కార్తీ, అరవింద్ స్వామిగార్లలో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఈ సినిమా చేసేవాడిని కాదు. వాళ్లిద్దరే అలా నటించగలరు. వాళ్ల కెమిస్ట్రీ, కాంబినేషన్ ఈ సినిమాకి పెద్ద బలం. సూర్యగారికి సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం నిర్మించారు. గోవింద్ వసంత ‘96’కి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారో అందరికీ తెలుసు. ‘సత్యం సుందరం’కి కూడా అంతే అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ డబ్బింగ్ అద్భుతంగా వచ్చింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment