C. Prem Kumar
-
డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున
కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్మెంట్పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదలైంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. తమిళ్లో '96' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.కుటుంబ కథా చిత్రంగా విడుదలైన ‘సత్యం సుందరం’ పట్ల ప్రేక్షకులు ఆధరణ భారీగానే ఉంది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేస్తుంది. దీంతో తాజాగా ఈ చిత్రాన్ని చూసిన అక్కినేని నాగార్జున.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. సినిమాకు ప్రధాన బలం అయిన కార్తీ, అరవింద్ స్వామి నటనకు ఆయన ఫిదా అయ్యారు.'డియర్ కార్తీ, నిన్న రాత్రి 'సత్యం సుందరం' సినిమా చూశాను!! మీరు, అరవింద్ స్వామి చాలా బాగా నటనతో మెప్పించారు. సినిమాలో నువ్వు కనిపించిన ప్రతిసారి నేను నవ్వుతూనే ఉన్నాను. అనంతరం ఆ చిరునవ్వుతోనే ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ సినిమా ద్వారా ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేశావ్... అలాగే మన సినిమా 'ఊపిరి' రోజులను కూడా గుర్తుచేశావ్. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు అందుతున్నాయి. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు.' అని ఆయన మెచ్చుకున్నారు.అయితే, కార్తీ కూడా ఇలా స్పందించారు. థ్యాంక్యూ అన్నయా.. మీ మాటలతో అందించే ప్రోత్సాహం మాలో ఆనందాన్ని నింపింది. సినిమా మీకు నచ్చినందుకు సంతోసిస్తున్నాం. ఈ చిత్రంపై మీరు చూపించిన ఆదరణ మా అందరికీ ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.' అని ఆయన అన్నారు. -
ఆ ఇద్దరే ఈ సినిమాకి పెద్ద బలం : డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్
‘‘నేను తీసిన ‘96’ సినిమా ప్రేమకథ. కానీ, ‘సత్యం సుందరం’ కుటుంబ కథా చిత్రం. కార్తీ, అరవింద్ స్వామిగార్ల పాత్రల మధ్య ఒక రాత్రిలో జరిగే కథ. వాళ్ల మధ్య అనుబంధం ఏంటి? ఆ ఒక్క రాత్రిలో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్ అన్నారు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్మెంట్పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సి. ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘సత్యం సుందరం’ నవలని సినిమా స్క్రిప్ట్లాగానే రాశాను. కార్తీ, అరవింద్ స్వామిగార్లు ముందు నవలని చదివారు... వారికి బాగా నచ్చింది. ఆ నవలని స్క్రిప్ట్‌గా మలచడం సులభంగా అనిపించింది. కార్తీ, అరవింద్ స్వామిగార్లలో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఈ సినిమా చేసేవాడిని కాదు. వాళ్లిద్దరే అలా నటించగలరు. వాళ్ల కెమిస్ట్రీ, కాంబినేషన్ ఈ సినిమాకి పెద్ద బలం. సూర్యగారికి సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం నిర్మించారు. గోవింద్ వసంత ‘96’కి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారో అందరికీ తెలుసు. ‘సత్యం సుందరం’కి కూడా అంతే అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ డబ్బింగ్ అద్భుతంగా వచ్చింది’’ అన్నారు.