
సాయిపల్లవి.. ఓ స్టార్ హీరోని 'అన్న' అనేసింది. ఈ విషయాన్ని సదరు హీరోనే బయటపెట్టాడు. ఆమె అలా పిలిచినందుకు అప్పుడు చాలా బాధపడ్డాడని కూడా చెప్పాడు.'అమరన్' అనే తమిళ మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా హీరో శివకార్తికేయన్ ఇదంతా చెప్పాడు.
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి లేటెస్ట్ మూవీ 'అమరన్'. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత కథతో ఈ మూవీ తీశారు. అక్టోబర్ 31న తెలుగు-తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ కార్తికేయన్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యేంతవరకు వచ్చాడు. తన కెరీర్ ప్రారంభంలో సాయిపల్లవితో జరిగిన ఫన్నీ సంఘటననే ఇప్పుడు బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా)

'గతంలో నేను టీవీ ఛానెల్‌లో పనిచేస్తున్నప్పుడు సాయిపల్లవిని మొదటిసారి కలిశాను. నేను హోస్ట్ చేసిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆ తర్వాత 'ప్రేమమ్'లో ఈమె నటన నాకు తెగ నచ్చేసింది. దీంతో ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాను. వెంటనే 'థ్యాంక్యూ అన్న' అనేసింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా బాధపడ్డాను' అని శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో 'తండేల్' సినిమా చేస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగానే తీస్తున్నారు. కొందరు తెలుగు జాలర్లు.. పాకిస్థాన్ అధికారులకు చిక్కి, అక్కడి జైల్లో కొన్నాళ్లు గడిపారు. ఈ సినిమాని క్రిస్మస్ లేదా సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు మూవీస్‌తో మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతాననే సాయిపల్లవి ధీమాతో ఉంది.
(ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'రియా'.. అసలు ఈమె ఎవరంటే?)
Heart of #Amaran ♥️ @Sai_Pallavi92 at #AmaranAudioLaunch
#AmaranDiwali #AmaranOctober31#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy
A Film By @Rajkumar_KP
A @gvprakash Musical@ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @Sai_Pallavi92… pic.twitter.com/kRBCU7ADld— Raaj Kamal Films International (@RKFI) October 18, 2024