
రియా ఎక్కడ? ఆమె ఎవరు? దామిని డాటర్? దామిని ఎవరు? రియా మదర్.. అసలు వీళ్లిద్దరూ ఎవరు? మదర్ అండ్ డాటర్.. గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతోంది. 'మత్తు వదలరా 2' సినిమాలోని సత్య-అజయ్ మధ్య జరిగే సీన్ ఇది. ఊహించని విధంగా ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ రియా అసలు పేరు ఏంటి? ఆమె ఎవరో తెలుసా?
(ఇదీ చదవండి: బిచ్చగాడిలా మారిపోయిన స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?)
సోషల్ మీడియాలో ఎప్పుడు.. ఏది.. ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు అర్ధం కాదు. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన తర్వాత 'మత్తు వదలరా 2' సినిమా సీన్లని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ మూవీలో సత్య తనదైన కామెడీతో అదరగొట్టేశాడు. అలా రియా అనే అమ్మాయి గురించి అడిగే సీన్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ రియా పాత్రధారి అసలు పేరు ఐషూ యాదవ్. ఈమె స్వతహాగా నార్త్ అమ్మాయి.

తెలుగులో 'సిద్ధు బీకాం' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఐషూ యాదవ్‌కి ఇన్ స్టాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. డిజిటల్ క్రియేటర్‌గా వీడియోలతో ఎంటర్‌టైన్ చేసే ఈమె.. అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల 'మత్తు వదలరా 2'లో ఛాన్స్ దక్కించుకుంది. ఈమెకు ఇదే తొలి మూవీ. అయితేనేం రియా అనే పేరు దెబ్బకు తెగ పాపులర్ అయిపోయింది.
మరి ఈ ట్రెండింగ్ వల్ల రియా అలియాస్ ఐషూ యాదవ్‌కి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి?
(ఇదీ చదవండి: మణికంఠ చిన్న పొరపాటు.. కొత్త మెగా చీఫ్‌గా గౌతమ్)
one of the best scenes from #MathuVadalara2 @RiteshRana 🤣🤣🤣 #Satya pic.twitter.com/cAlPSjQsA6
— KSNSK (@SmoothingWoods) October 15, 2024