
‘‘మత్తు వదలరా’ సినిమా హిట్ కావడంతో సీక్వెల్ చేద్దామని చెర్రీగారు అన్నారు. మేము అనుకున్నట్లే వర్కవుట్ అయ్యింది. ‘మత్తు వదలరా 2’ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అని డైరెక్టర్ రితేష్ రానా అన్నారు. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలైంది.
(చదవండి: రాఘవా లారెన్స్‌తో పూజా హెగ్డే జోడీ!)
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో మా సినిమాకి మంచి ప్రశంస అంటే టీమ్ అంతా హ్యాపీగా ఉండటమే. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అలాగే చిరంజీవి, మహేశ్‌బాబుగార్లు అభినందించడం కూడా ఆనందాన్నిచ్చింది. మా సినిమా రాజమౌళిగారికి చాలా నచ్చింది. నేనిప్పటివరకూ అన్ని సినిమాలు చెర్రీగారితోనే చేశాను. నా తర్వాతి చిత్రం కూడా ఆయనతోనే చేస్తాను. ‘మత్తు వదలరా 3’ సినిమా ఉంటుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment