
‘‘మత్తువదలరా (2019)’ సినిమా తర్వాత నా కెరీర్‌లో సరైన హిట్ చిత్రం లేదు. అయితే ఓ సినిమా సక్సెస్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో నేను డిఫరెంట్ జానర్స్ సినిమాలు చేశాను. ఇప్పుడు క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా చేయాలనుకుంటున్నాను’’ అని శ్రీ సింహా అన్నారు. రీతేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’.
చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీ సింహాæ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో నేను, సత్య, ఫరియా హై ఎమర్జెన్సీ టీమ్ ఏంజెంట్స్‌గా కనిపిస్తాం. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో యాక్షన్ , ఫన్, థ్రిల్, సర్‌ప్రైజ్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభాస్, రాజమౌళిగార్లు మా సినిమా ట్రైలర్, టీజర్‌ను చూసి అభినందించారు. ‘మత్తువదలరా’ సినిమాని ఓ ఫ్రాంచైజీలాగా కొనసాగించే అవకాశం ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment