‘మెగా’ రివ్యూ : రాత, తీత, కోత, మోత.. ప్రాసతో ప్రశంసలు! | Megastar Chiranjeevi Review On Mathu Vadalara 2 Movie | Sakshi
Sakshi News home page

ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనబడలేదు.. ‘మత్తు వదలరా 2’పై చిరంజీవి రివ్యూ

Published Sun, Sep 15 2024 10:04 AM | Last Updated on Sun, Sep 15 2024 12:00 PM

Megastar Chiranjeevi Review On Mathu Vadalara 2 Movie

శ్రీసింహా హీరోగా నటించిన తాజా చిత్రం మత్తు వదలరా 2. ఆయన కెరీర్‌లో హిట్‌గా నిలిచిన హిట్‌ ఫిల్మ్‌ ‘మత్తు వదలరా’కి సీక్వెల్‌ ఇది. సత్య, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. సత్య కామెడీ సినిమాకు ప్లస్‌ అయింది. 

అలాగే ఈ మధ్యకాలంలో ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైన్‌ చిత్రాలేవి రాకపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. తొలి రోజు తక్కువ వసూళ్లే వచ్చినా.. పాజిటివ్‌ టాక్‌తో రెండో రోజు నుంచి కలెక్షన్స్‌ పెరిగాయి. ఇదిలా ఉంటే..తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ మధ్యకాలంలో ఓ సినిమా చూసి ఇంతలా నవ్వుకోలేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా మత్తు వదలరా 2 చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

(చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)

‘నిన్ననే ‘మత్తు వదలరా 2’ సినిమా చూశాను. ఈ మధ్యకాలంలో మొదటి నుంచి చివరిదాకా ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనబడలేదు. ఎండ్‌ టైటిల్‌ని కూడా వదలకుండా చూశాను. ఈ క్రెడిట్‌ అంతా డైరెక్టర్‌ రితేష్‌ రానాకే ఇవ్వాలి. అతని రాత, తీత, కోత, మోత, ప్రతీది చక్కగా బ్యాలెన్స్‌ చేస్తూ మనల్ని వినోదపర్చిన విధానానికి అభినందించకుండా ఉండలేం. హాట్సాఫ్‌ రితేజ్‌ రానా. 

నటీనటులు శ్రీసింహాకి, ప్రత్యేకించి సత్యకి నా అభినందనలు. అలాగే ఫరియా అబ్దుల్లా, కాల భైరవతో పాటు మంచి విజయాన్ని అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ, టీం అందరికి నా అభినందనలు. మత్తు వదలరా 2 మిస్‌ కాకండి. వందశాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ గ్యారెంటీ’ అని చిరంజీవి ఎక్స్‌లో రాసుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement