శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద మంచి ఫన్ చిత్రంగా గుర్తింపు పొందింది. కలెక్షన్ల పరంగా కూడా లాభాలను తెచ్చిపెట్టిన ఈ మూవీని రీతేష్ రానా దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్టైనర్గా విజయం సాధించిన ఈ చిత్రంలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా జంటతో పాటు సత్య, వెన్నెల కిషోర్ నటించారు.
సెప్టెంబర్ 13న విడుదలైన ‘మత్తువదలరా 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 11 అంటే శుక్రవారం అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు పేర్కొంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
కథేంటంటే..
‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్ అయిన బాబు మోహన్(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్‌లో హీ టీమ్(హై ఎమర్జెన్సీ టీమ్)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ల పని.
వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్‌ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్‌కి తెలియకుండా డీల్ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్ ఆకాశ్(అజయ్) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్‌ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్ చేసిందెవరు..? స్టార్ హీరో యువ(వెన్నెల కిశోర్)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment