అందులో వాస్తవం లేదు: నిర్మాత రవిశంకర్‌ | Producer Ravi Shankar Gives Clarity To Rumours On Allu Arjun Involvement In Jani Master Case | Sakshi
Sakshi News home page

అందులో వాస్తవం లేదు: నిర్మాత రవిశంకర్‌

Published Tue, Sep 24 2024 3:12 AM | Last Updated on Tue, Sep 24 2024 11:22 AM

Producer Ravi Shankar Reveals Allu Arjun Comments On Jani Master

అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ‘పుష్ప’ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్‌ స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మత్తు వదలరా 2’ సినిమా సక్సెస్‌ మీట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జానీమాస్టర్‌ వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ , డైరెక్టర్‌ సుకుమార్‌ పేర్లు వినిపిస్తున్నాయి. దానిపై మీ స్పందన ఏంటి?’ అనే ప్రశ్నకు రవిశంకర్‌ బదులిస్తూ... ‘‘ప్రస్తుతం నడుస్తున్న వివాదం పూర్తీగా వాళ్ల (జానీ మాస్టర్, బాధితురాలు) వ్యక్తిగతం.

 ‘పుష్ప 2: ది రూల్‌’ సినిమాకి గణేశ్‌ ఆచార్య మెయిన్‌ కొరియోగ్రాఫర్‌. విజయ్‌ పోలకి, ఆ అమ్మాయి      (బాధితురాలు) అడిషనల్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ‘పుష్ప 2: ది రూల్‌’ప్రారంభం నుంచే ఆ అమ్మాయిని తీసుకున్నాం. సినిమాలోని అన్ని పాటలకు ఆమె పని చేస్తారు. ఐదారు నెలల క్రితం మేము రిలీజ్‌ చేసిన ఓ లిరికల్‌ వీడియోలోనూ ఆమె పేరు ఉంటుంది. ప్రస్తుతం రెండు పాటలు బ్యాలñ న్స్‌ ఉన్నాయి. అక్టోబర్‌ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు సన్నాహాలు చేశాం. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాటని జానీ మాస్టర్‌తో చేయించాలనుకున్నాం. ఇంతలోగా ఈ గొడవ తెరపైకి వచ్చింది.

ఎవరైనా డ్యాన్స్‌ మాస్టర్స్, డ్యాన్సర్‌ గుడ్‌ మార్నింగ్, గుడ్‌ ఈవెనింగ్‌ చెబితే స్పందించడం తప్ప హీరోకు    (అల్లు అర్జున్‌) ఏమీ తెలియదు. ఈ విషయంపై బాధ్యత కలిగిన ప్రధాన మీడియా వార్తలు రాయడం లేదు. కానీ, కొత్తగా వచ్చిన కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్‌ సెన్సేషన్  కావడం కోసం ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. జానీ మాస్టర్‌ని ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్‌ చేయాలనే వ్యక్తిత్వం బన్నీగారిది కాదు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇదంతా కొందరి అలజడి మాత్రమే.   వారిద్దరి మధ్య గొడవలు ఉన్నా అది వారి వ్యక్తిగతం.. దాని గురించి మనం మాట్లాడటానికి కూడా ఏం లేదు’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement