పుష్ప ప్రోడ్యూసర్స్‌ అంటుంటే గర్వంగా అనిపిస్తోంది: రవిశంకర్, నవీన్‌ | Producer Ravi Shankar Gives Clarity On Pushpa 3 | Sakshi
Sakshi News home page

పుష్ప ప్రోడ్యూసర్స్‌ అంటుంటే గర్వంగా అనిపిస్తోంది: రవిశంకర్, నవీన్‌

Oct 25 2024 3:27 AM | Updated on Oct 25 2024 3:27 AM

Producer Ravi Shankar Gives Clarity On Pushpa 3

‘‘మైత్రీ మూవీ మేకర్స్‌ అంటే ఇక్కడ తెలుసు. కానీ ముంబైలో ‘పుష్ప’ సినిమా ప్రోడ్యూసర్స్‌ అనగానే ఇంకా ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. అది మాకు గర్వంగా అనిపిస్తోంది. ‘పుష్ప’ తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’లోని నటనకుగాను అల్లు అర్జున్‌గారికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ‘పుష్ప: ది రూల్‌’ సినిమాతోనూ ఆయనకు జాతీయ అవార్డు వస్తుందనుకుంటున్నాం.

అల్లు అర్జున్‌గారు అంత కష్టపడుతున్నారు. సుకుమార్‌ అండ్‌ టీమ్‌ కూడా శ్రమిస్తోంది’’ అన్నారు నిర్మాత వై. రవిశంకర్‌. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప: ది రైజ్‌’కు సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్‌’ చిత్రం రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాను డిసెంబరు 6న రిలీజ్‌ చేయనున్నట్లుగా ఆ మధ్య ప్రకటించారు. కానీ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘పుష్ప: ది రైజ్‌’ని డిసెంబరు 5న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘పుష్ప: ది రూల్‌’ను గతంలో చెప్పిన డేట్‌ కంటే ఒకరోజు ముందుగానే రిలీజ్‌ చేస్తున్నాం. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్‌ అభి్రపాయాలు, లాంగ్‌ వీకెండ్‌ అంశాలను దృష్టిలో పెట్టుకుని తేదీ మార్చాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌ హైలైట్‌గా ఉంటుంది. రికార్డు స్థాయిలో ‘పుష్ప: ది రూల్‌’ సినిమాకు 420 కోట్ల రూపాయల నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది.

ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లో ఎవరు నటిస్తారనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తాం. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది’’ అన్నారు వై. రవిశంకర్‌. ‘పుష్ప: ది రూల్‌’ సినిమా మలయాళం డిస్ట్రిబ్యూటర్‌ ముఖేశ్‌ మెహతా, హిందీ డిస్ట్రిబ్యూటర్‌ అనిల్‌ తడానీ, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి, తమిళనాడు డిస్ట్రిబ్యూటర్‌ మాలి, నైజాం డిస్ట్రిబ్యూటర్‌ మైత్రీ శశి, వెస్ట్‌ గోదావరి డిస్ట్రిబ్యూటర్‌ ఎల్వీఆర్‌పాల్గొన్నారు.

ఈ సినిమాలోని ఓపాటకు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేయ నున్నారా? అనే ప్రశ్నకు... ‘‘ఒకపాటకు అనుకున్నాం కానీ ఇప్పుడు ఆయన ఆపాట చేయడంలేదు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement