
ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ ఎవరైనా ఉన్నారా? అంటే అందులో సత్య ముందు వరుసలో ఉంటాడు. 'మత్తు వదలరా' సీక్వెల్‌తో ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాడు. ఎక్కడ చూసినా సత్య కామెడీ క్లిప్పులే కనిపిస్తున్నాయి. ఇంత మంచి నటుడిని టాలీవుడ్‌కు పరిచయం చేసింది.. తనలో కమెడియన్‌ను గుర్తించి ఎవరో తెలుసా? హీరో నితిన్.
తెలిసేది కాదు
ఈ విషయాన్ని సత్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హీరో నితిన్, రచయిత హర్షవర్ధన్, నిర్మాత డీఎస్ రావు.. వీళ్లే నాలో నటుడున్నాడని గ్రహించారు. మొదట్లోనేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడిని. అప్పుడు నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. అందరితోనూ ఒకేలా మాట్లాడేవాడిని. సర్, షార్ట్ రెడీ.. అని పిలిచేవాడిని కాదు.. ఇదిగో మిమ్మల్ని రమ్మంటున్నారు.. వెళ్లండి.. ఇలా అమలాపురం యాసలోనే చెప్పేవాడిని.

ఆ హీరో సలహా ఇవ్వడమేగాక
నా మాటలు విన్నాక నితిన్ గారు నువ్వు యాక్టర్ అవ్వు, బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా బలవంతంగా నాతో యాక్టింగ్ చేయించారు. అలా నెమ్మదిగా నటుడిగా మారాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన సత్య అభిమానులు.. ఇంత మంచి నటుడిని అందించిన నితిన్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. కాగా నితిన్ ద్రోణ (2009) సినిమాకు సత్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.
కమెడియన్‌గా, హీరోగా
ఇతడు జబర్దస్త్ షోలోనూ పాల్గొన్నాడు. పిల్ల జమీందార్ చిత్రంతో గుర్తింపు అందుకున్నాడు. స్వామిరారా మూవీతో కమెడియన్‌గా పాపులర్‌గా అయ్యాడు. చలో సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు. గతంలో మత్తు వదలరా చిత్రంతో, ఇప్పుడు దాని సీక్వెల్‌తో ఆడియన్స్‌కు నవ్వుల విందు వడ్డించాడు.
Thanks @actor_nithiin anna oka manchi actor ni maku ichav #MathuVadalara2 #Satya #Devara pic.twitter.com/hYPSWUG5kP
— surya k (@naistam2k) September 15, 2024
చదవండి: జాన్వీ కపూర్ టాలెంట్ చూసి షాకయ్యా..: జూనియర్ ఎన్టీఆర్