ఎన్నేసి మాటలన్నారు.. ఒక్క వీడియోతో ఆన్సరిచ్చిన హీరోయిన్‌ | Sonakshi Sinha And Zaheer Celebrated Their First Ganesh Chaturthi After Wedding, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

పెళ్లి తర్వాత తొలి వినాయక చవితి.. కలిసి పూజ చేసిన సెలబ్రిటీ జంట

Published Sun, Sep 8 2024 8:44 PM | Last Updated on Mon, Sep 9 2024 1:08 PM

Sonakshi Sinha, Zaheer Celebrate First Ganesh Chaturthi After Wedding

ప్రేమకు కులమత బేధాలు లేవు. ఈ విషయాన్ని నిరూపించిన ఎంతోమందిలో సోనాక్షి సిన్హ- జహీర్‌ ఇక్బాల్‌ జంట ఒకటి. వీరిద్దరూ ఈ ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి మరీ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పినవారి కంటే విమర్శలతో బురద చల్లినవారే ఎక్కువ!

వినాయక చవితి సెలబ్రేషన్స్‌
తిట్లను సైతం కొత్త జంట ఆశీర్వాదంగా తీసుకుంది. తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అప్పటినుంచి ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా వీరు వినాయక చవితి పండగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. సోనాక్షి సాంప్రదాయాలను ఇక్బాల్‌ గౌరవిస్తూ అతడి ఇంట్లోనే వినాయకుడిని ప్రతిష్టించారు. ఇద్దరూ కలిసి పండగను కన్నుల వేడుకగా జరుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వీళ్లిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

ఫ్యాన్స్‌ సంబరం
అందమైన డెకరేషన్‌ మధ్యలో బొజ్జ గణపయ్యను పూజించిన వీడియోను చూసి ఫ్యాన్స్‌ సంబరపడిపోయారు. ఇరు వర్గాల సాంప్రదాయాలను గౌరవించుకుంటూ, అన్ని పండగలను కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటూ మీరు అందరికీ ఆదర్శంగా నిలవండి అని పలువురూ సూచిస్తున్నారు. ఇకపోతే సోనాక్షి చివరగా హీరామండి అనే నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌ సిరీస్‌లో కనిపించింది.

 

 

బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement