ప్రముఖ చిలుకూరి బాలాజీ అలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. శ్రీ బాలాజీ కొత్త అధ్యాయం ప్రారంభమైంది.. ఆ దేవుని దయతో మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. అంతే కాకుండా రామ్ చరణ్ భార్య ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా లాస్ ఎంజెల్స్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. దీంతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో పని చేయనుందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ఎస్ఎస్‌ఎంబీ29లో ప్రియాంక చోప్రా?
మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు గతంలో తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment