Chilukuru Balaji Temple
-
రామ్ చరణ్ భార్యకు ప్రియాంక చోప్రా ధన్యవాదాలు.. ఎందుకంటే?
ప్రముఖ చిలుకూరి బాలాజీ అలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. శ్రీ బాలాజీ కొత్త అధ్యాయం ప్రారంభమైంది.. ఆ దేవుని దయతో మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. అంతే కాకుండా రామ్ చరణ్ భార్య ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా లాస్ ఎంజెల్స్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. దీంతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో పని చేయనుందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక చోప్రా?మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు గతంలో తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే టాక్ వినిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
గరుడ ప్రసాదం.. పోటెత్తిన జనం.. ట్రాఫిక్ నరకం
మొయినాబాద్, బండ్లగూడ: చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేని మహిళలకు పిల్లలు కలుగుతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేయడంతో శుక్రవారం అనూహ్యంగా భక్తులు పోటెత్తారు. ప్రసాదం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఢిల్లీ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. వేకువ జామున 4 గంటల నుంచే వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూడు నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుని, ఎండలో కాలినడకన ఆలయానికి చేరుకున్న భక్తులకు క్యూలైన్లు ఎక్కడ ఉన్నాయో..? ప్రసాదం ఎక్కడ పంపిణీ చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఆలయ ప్రాంగణంలోనికి మహిళలను మాత్రమే అనుమతించడంతో పురుషులు బయటే ఉండిపోయారు. చేతులెత్తేసిన పోలీసులు ప్రసాదం కోసం పోటెత్తిన మహిళలను నియంత్రించడంలో ఆలయ సిబ్బంది, పోలీసులు చేతులెత్తేశారు. క్యూలైన్లలో తోపులాటలు జరగడంతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. కానీ వచ్చిన వారిలో సగం మందికి కూడా అందలేదు. దీంతో కొంత మంది మహిళలు నిరసన చేపట్టారు. గరుడ ప్రసాదం కొరతపై భక్తుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే వారం రోజుల పాటు ప్రసాదం ఇస్తామని, వారం రోజుల్లో ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చని ఆలయ అర్చకులు తెలిపారు. గరుడ ప్రసాదం కోసం ఏటా సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది వచ్చేవారు. ఈసారి రెండింతలు వస్తారని భావించాం.. కానీ ఇంతమంది వస్తారని ఊహించలేదని ఆలయ అర్చకులు రంగరాజన్ తెలిపారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. వేలాది వాహనాలు ఒక్కసారిగా రావడంతో సుమారు 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య నెలకొంది. మెహిదీపట్నం నుంచి నానల్ నగర్, లంగర్‌హౌస్, టిప్ఖాన్పూల్ బ్రిడ్జ్, సన్‌సిటీ, కాళీమందిర్, టీఎస్పీఏ చౌరస్తా మీదుగా చిలుకూరు ఆలయం వరకు పూర్తిగా ట్రాఫిక్‌తో రోడ్డంతా స్తంభించిపోయింది. -
చిలుకూరు బాలాజీ టెంపుల్ పాడుబడిందని అక్కడ మహేష్ బాబు సినిమా చేయలేదు
-
చిలుకూరు ఆలయంలోకి తాబేలు
మొయినాబాద్(చేవెళ్ల): చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని శివాలయంలోకి కూర్మం(తాబేలు) ప్రవేశించింది. ఇది కోవిడ్–19ని జయించడానికి శుభసూచికంగా భావిస్తున్నామని ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో ఉన్న సుందరేశ్వరస్వామి ఆలయం(శివాలయం)లోకి ఆదివారం తెల్లవారు జామున తాబేలు వచ్చింది. అర్చకుడు సురేష్ ఆత్మారాం ఆలయం తలుపు తెరిచేసరికి శివలింగం పక్కన తాబేలు ఉండడాన్ని గమనించారు. ఈ విషయాన్ని అర్చకుడు రంగరాజన్‌కు తెలియజేయడంతో ఆయన వచ్చి పరిశీలించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించి స్వామివారితోపాటు కురుమూర్తి(తాబేలు)కి సైతం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. చిలుకూరు బాలాజీ సన్నిధిలోని శివాలయంలోకి కురుమూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుందన్నారు. వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో త్వరలో కరోనా వైరస్‌ను అంతంచేసే అమృతం లభిస్తుందని సూచిస్తున్నట్లుగా ఉందని చెప్పారు. -
రాష్ట్రపతికి రంగరాజన్ లేఖ
సాక్షి, మొయినాబాద్ : కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం కేసు విషయమై చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త రంగరాజన్ భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్‌కు లేఖరాశారు. సోమవారం ఈ విషయాన్ని ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపద్మనాభ స్వామి దేవాలయం కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు వాయిదా వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే శబరిమల ఆలయం తీర్పును కోర్టు ధర్మానికి విరుద్ధంగా ఇచ్చిందని మండిపడ్డారు. అదేవిధంగా పూరీ జగన్నాథ్ రథయాత్ర నిర్వహించొద్దని తీర్పు ఇచ్చి.. తర్వాత ప్రజల ఆగ్రహాన్ని గమనించి పరిమిత సంఖ్యలో భక్తులతో రథయాత్ర తీయొచ్చని తన తీర్పును తానే మార్చుకుందన్నారు. ఇలాంటి వాటితో న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతుందని తెలిపారు. హిందూ దేవతల విషయంలో సుప్రీంకోర్టు వ్యవహారశైలి సరిగా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం దేవాలయాల్లో కొలువుండే దైవుళ్లకు అధికారాలు ఏమీ లేవని ఉందని, అందుకే భగవంతుడు కోవిడ్–19 నుంచి భక్తులను కాపాడే అధికారాన్ని కోల్పోయాడేమో అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తన విశిష్ట అధికారాన్ని వినియోగించుకుని అనంత పద్మనాభ స్వామి దేవాలయం తీర్పును హిందువుల మనోభావాలకు అనుగుణంగా వెలువరించే విధంగా సుప్రీంకోర్టును ఆదేశించాలని కోరుతూ లేఖ రాశానని వెల్లడించారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: రంగరాజన్
సాక్షి, తిరుపతి : వంశపారంపర్య హక్కు అనేది ఒక్క అర్చకులకే కాదని, ఎన్నో కుల వృత్తుల వారు తరతరాలుగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో ఉన్నారని చిలుకూరు బాలాజీ టెంపులు ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. కుల వృత్తుల ప్రభావం తెలియకుండా 1987లో అప్పటి ప్రభుత్వం తీసేసిందన్నారు. ఏపీ అసెంబ్లిలో సన్నిధి గొల్లల వంశపారంపర్య హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని రంగరాజన్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అన్నమయ్య వంశస్తులు, నాయీ బ్రాహ్మణులకు త్వరలో వంశపారంపర్య హక్కులు కల్పిస్తారని ఆశిస్తున్నా. లిక్విడ్ ఓజోన్ను చిలుకూరులో ఏర్పాటు చేశాం. కరోనాతో కలిసి సంసారం చేయాలి కాబట్డి ఇది రక్షగా ఉంటుంది. ప్రతి సారీ శానిటైజ్ చేయడం కుదరదు. దీన్ని పీల్చుకోవచ్చు, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. భక్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా ఆలయాలలో వీటిని ఉపయోగిస్తే బాగుంటుంది. -
చిలుకూరులో భక్తుల రాకపై నిషేధం
-
కరోనా ఎఫెక్ట్: అలయాలు మూసివేత
-
చిలుకూరుకు చార్జి రూ. 200
గొల్కొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సందట్లో సడేమియా అన్నట్లుగా ప్రైవేట్ వాహనాలవారు అందినకాఇకి దోచుకున్నారు. ట్యాక్సీ, ఆటో నిర్వాహకులు మెహిదీపట్నం నుంచి టోలిచౌకీకి ఒక్కో ప్రయాణికుడికి రూ.30, లంగర్‌హౌస్‌కు రూ.40 చొప్పున వసూలు చేశారు. మరోవైపు సుమోలు, తుఫాన్ల వారు చేవెళ్లకు ఒక్కో వ్యక్తికి రూ.350 నుంచి 400, చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు రూ.200, గచ్చిబౌలికి రూ.100 వసూలు చేశారు. మహిళల పాట్లు ఎన్నో నేను రోజూ దిల్సుఖ్నగర్ నుంచి బండ్లగూడ వెళ్లాలి. బస్సులు దొరక్క ఆటోలో ఆఫీసుకు వెళ్లడంతో ఖర్చు రెట్టింపైంది. మరోవైపు సకాలంలో ఆఫీసుకు చేరుకోలేక ఇబ్బంది పడ్డాం. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ సమ్మె వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి.–కె.భారతి, పీ అండ్ టీ కాలనీ,దిల్సుఖ్నగర్ పూల కోసం వస్తే సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పూలు కొనుగోలు చేసేందుకని షాద్‌నగర్ చిన్నరేవల్లి నుంచి నగరానికి వచ్చాను. కాని బస్సులు నడవక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎక్కువ డబ్బులు చెల్లించి తుపాన్ వాహనంలో వచ్చాను. పండుగ సమయం కావడంతో తిరిగివెళ్లేసమయంలో మరింత ఇబ్బంది ఎదురవుతోంది. –మల్లారెడ్డి, చిన్న రేవల్లి ఉద్యోగానికివెళ్లడం కష్టమైంది... నేను బాలానగర్ మండలానికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. రూ.65 టికెట్‌కు గాను రూ.35 అదనంగా చెల్లించి వెళ్లాను. అధికంగా ఎక్కువ తీసుకుంటున్నావని ప్రశ్నిస్తే ఇష్టం లేకుంటే దిగిపో అంటున్నారు. బస్సులు నడవని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. –సాజిదా బేగం, ఉద్యోగిని -
కన్నుల పండువగా చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
-
స్త్రీజాతికి పూర్వ గౌరవం రావాలి
మొయినాబాద్(చేవెళ్ల) : ప్రస్తుత సమాజంలో స్త్రీజాతికి పూర్వ గౌరవం రావాలనే సంకల్పంతో చిలుకూరు బాలాజీ దేవాలయంలో చేపట్టిన ‘రక్షా బంధనం’ ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకుడు రంగరాజన్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అర్చకులు రాఖీలతో ప్రదక్షిణ చేసి ప్రధాన ఆలయం ఎదుట ఉన్న మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. సూర్య భగవానుడికి, అమ్మవారికి అష్టోత్తరంతో అర్చన నిర్వహించారు. పూజాకార్యక్రమాల అనంతరం రాఖీలను ఆలయానికి వచ్చిన మహిళా భక్తులకు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో వారు ముక్కుమొఖం తెలియని కొత్త వ్యక్తులకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమమంతా కనులపండగలా జరిగింది. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. అన్నాచెల్లెలి అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరిపై అదే భావన కలిగే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కొత్త వ్యక్తులకు రాఖీలు కట్టే కార్యక్రమం చేపట్టామన్నారు. సమాజంలో మార్పుకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని.. ఇప్పటితో ఇది ఆగిపోదన్నారు. మహిళల ఆత్మగౌరవం పెరిగే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. సమాజంలో అందరూ సోదరభావంతో మెలగా ల్సిన అవసరం ఉందని రంగరాజన్ అభిప్రా యపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, అర్చకులు కన్నయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు. -
చిలుకూరు బాలాజీ సేవలో దళిత భక్తుడు
మొయినాబాద్(చేవెళ్ల) : చిలుకూరు బాలాజీ దేవాల య అర్చకుడు రంగరాజన్ భుజస్కందాలపై కూర్చొని మునివాహన సేవతో ఆలయ ప్రవేశం పొం దిన దళిత భక్తుడు ఆదిత్య పరాశ్రీ సోమవారం చి లుకూరు బాలాజీని దర్శించుకున్నారు. ఏప్రిల్ 16 న ఆదిత్య పరాశ్రీని అర్చకుడు రంగరాజన్ తన భుజస్కందాలపై ఎత్తుకుని నగరంలోని జియాగూడ లో ఉన్న రంగనాథస్వామి ఆలయంలోకి మునివాహన సేవతో ఆలయ ప్రవేశం చేయించారు. ఆ భక్తుడు మొదటి సారిగా సోమవారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించడంతో అర్చకుడు రంగరాజన్ ఆ భక్తుడిని గర్భగుడిలోకి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు. అదే విధంగా మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల సోమవారం బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. వీరితోపాటు టీయూఎఫ్ఫౌండర్ కుమారస్వామి స్వామివారిని దర్శించుకున్నారు. -
దళిత భక్తుడికి ఆలయప్రవేశం
-
దళిత భక్తుడికి ఆలయప్రవేశం
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి మనుషులంతా ఒక్కటేనని చాటాలని తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్, చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవా మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దళిత భక్తుడు, దేవీ ఉపాసకుడు ఆదిత్య పరాశ్రీకి ఆలయ ప్రవేశం కల్పించారు. ఆయనను రంగరాజన్ భుజస్కంధాలపై ఎత్తుకొని మండపం నుండి ప్రధాన ధ్వజస్థంభం వరకు తీసుకెళ్లారు. ప్రదక్షిణ అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించారు. శిరస్సుపై శఠగోపం ధరింపచేసి ఆశీర్వదించారు. అనంతరం జరిగిన సమావేశంలో రంగరాజన్ మాట్లాడుతూ 2,700 ఏళ్ల నాటి లోకసారంగముని స్ఫూర్తితో రంగనాథస్వామి ఆలయంలో మునివాహన సేవా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కుల ఆధారిత సమాజంలో దళితులు నేటికీ అనేక రకాలుగా వివక్ష ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేశారు. దళితులపట్ల వివక్షను తొలగించడానికి, సమానత్వాన్ని చాటడానికే దళిత భక్తుణ్ని భుజస్కంధాలపై మోసుకుంటూ ఆలయ ప్రవేశం చేశామన్నారు. ఇది అంకురార్పణ మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి మాట్లాడుతూ ప్రతిగుడిలో దళితులకు ప్రవేశం కల్పించడంతోపాటు వారిని అన్ని విధాల జాగృతిపరిచే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి కారెంపుడి లక్ష్మీనరసింహా మాట్లాడుతూ నగరంలో మొదటిసారి చేపట్టిన మునివాహన సేవా కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆధిత్య పరాశ్రీ మాట్లాడుతూ దళితులు ఆలయ ప్రవేశం చేయడంతోపాటు హైందవ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలన్నారు. దళితులపై దాడులు జరుగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తిరుపావై కోకిల మంజులశ్రీ, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ వంశీతిలక్, రంగనాథస్వామి దేవాలయ ఫౌండర్ ట్రస్టీ ఎస్టీ చార్యులు, శేషాచార్యులు, సుందర రాజన్, రాధామనోహర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. -
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మొయినాబాద్(చేవెళ్ల): కలియుగ దైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వారం రోజులపా టు కొనసాగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకు లు ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశా రు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతి ష్టించి అర్చకులు పరావస్తు రంగాచార్యులు ఆ« ద్వర్యంలో బ్రహ్మోత్సవాల పూజా కార్యక్ర మాలు ఘనంగా నిర్వహించారు. మొదట సె ల్వర్ కూత్తు నిర్వహించి.. వేద మంత్రోచ్ఛారణ తో దేవాలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం పు ట్ట బంగానం (పుట్ట మన్ను) తీసుకొచ్చి హోమగుండాలు ఏర్పాటు చేసి.. అందులో నవధాన్యా లు, పాలికలు కలిపి హోమాలను వెలిగించారు. తరువాత విష్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచన కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి ఉ త్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్న్ సౌందరరాజన్, అర్చకులు రంగరాజన్, వరదరాజన్, బాలాజీ, మురళీ, కన్నయ్య, నర్సింహన్, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నేడు గరుడ ప్రసాదం వితరణ... చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ధ్వజారోహణం, శేషవాహనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి సమర్పించే నైవేద్యాన్ని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. గరుడ ప్రసాదం కోసం అధిక సంఖ్యలో మహిళలు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయం ముందు భాగంలో టెంట్లు వేసి తగిన ఏర్పాట్లు చేశారు. -
వర్షాల కోసం సైకిల్ యాత్ర
రామచంద్రాపురం: వర్షాలు కురిసి రైతులు, ప్రజలు శుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ శనివారం తెల్లాపూర్ హెల్త్‌క్లబ్ సభ్యులు ఎంపీపీ ఉపాధ్యక్షుడు చిలకమర్రి ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చిలుకూరు వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. ఉదయం గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలుచేసి అక్కడి నుండి చిలుకూరి బాలాజి దేవాలయం వరకు సైకిల్‌పై వెళ్లారు. ఈ సందర్బంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాలు లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిపించాలన్న కొరికతో తాము ఈ సైకిల్ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తెల్లాపూర్ సోసైటీ చైర్మన్ మల్లెపల్లి బుచ్చిరెడ్డి, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షుడు కంజర్ల శ్రీశైలంయాదవ్, గ్రామస్థులు రాజు, మల్లేష్, గోపాల్, మల్లారెడ్డి, మహేష్, టికారామ్, నిరంజన్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, బలరాం, రాజు, నర్సింలు సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. -
వీసా బాలాజీపై సీఎన్ఎన్ ప్రత్యేక కథనం
చిలుకూరు బాలాజీ.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో కొలువైన కలియుగదైవం.. వీసా బాలాజీగానూ ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. భక్తుల కోరికలు.. ప్రధానంగా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగార్థుల పాలిట కొంగుబంగారంగా భాసిల్లుతోన్న చిలుకూరు బాలాజీ ప్రతిష్ట ఇప్పుడు విదేశీ మీడియాను సైతం ఆకట్టుకుంది. తాజాగా ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల న్యూస్ ఛానెల్.. అమెరికాకు చెందిన కేబుల్ న్యూస్ నెట్ వర్క్ (సీఎన్ఎన్) తన వెబ్ సైట్ లో చిలుకూరు బాలాజీ ఆలయంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 500 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీవేంకటేశ్వరుడి అవతారంలో కొలువైఉన్న విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా అడిగితే ఏదైనా అనుగ్రహిస్తాడని, అమెరికా సహా ఇతర దేశాల వీసా కావాలనుకునేవారు ఆ ఆలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేస్తే దైవానుగ్రహంతో వీసా లభిస్తుందని, కోరిక నెరవేరిన తర్వాత మరో 108 ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం బ్రసెల్స్(బెల్జియం)లో ఉంటోన్న తన సోదరికి కూడా చిలుకూరు బాలాజీ దయవల్లే వీసా లభించిందని మంజునాథ్ సింగ్ అనే భక్తుడు పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ అనుగ్రహంతో ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నవారి సంఖ్య తక్కువేమీకాదని ఆలయ ప్రధాన అర్చకులు ఎస్. రంగరాజన్ సీఎన్ఎన్ కు చెప్పారు. సాంకేతిక విద్యాసంస్థల సంఖ్య పెరగడంతో విదేశాల్లో ఉద్యోగాలు, చదువుల కోసం వెళ్లగోరే సంఖ్య కూడా పెరిగిందని, అయితే దేశంలోని మరే ఇతర ఆయలయాలకు రాని విధంగా చిలుకూరు బాలాజీకి 'వీసా బాలాజీ' అని పేరొచ్చిందని రంగరాజన్ చెప్పుకొచ్చారు. -
ఆటో బోల్తా: 11 మందికి గాయాలు
మొయినాబాద్: ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘటన మండల పరిధిలోని చిలుకూరు సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, 108 సిబ్బంది కథనం ప్రకారం.. మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గురువారం సాయంత్రం చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం రాత్రి 9 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్లేందుకు రెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆటోలో ఎక్కారు. చిలుకూరు గ్రామ సమీపంలోకి వెళ్లగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 11 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన దశరథ, దేవి, నితీష్, అనితలను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్వల్ప గాయాలైన రాములమ్మ, నితిన్, రాజశేఖర్, రాజ్‌కుమార్, రాములు, సుభిక్ష, ప్రవళికలను స్థానిక భాస్కర ఆస్పత్రిలో చేర్పించారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని సీఐ రవిచంద్ర తెలిపారు. -
చిలుకూరుకు బాకీపడిన తిరుమల!
హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయానికి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు రావలసి ఉంది. టీటీడీ, ఇతర ఆలయాల నుంచి ఈ మొత్తం రావలసి ఉందని ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందర్ రాజన్ తెలిపారు. సౌందర్ రాజన్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. ఇతర ఆలయాల నుంచి రావలసిన బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు రాజీవ్ శర్మ సానుకూలంగా స్పందించారు. -
చినుకు రాలాలి.. చింత తీరాలి
చిలుకూరు (మొయినాబాద్): వేద పండితుల మంత్రోచ్చారణలు... విరాటపర్వం పారాయణం... హనుమాన్ చాలీసా పారాయణం... కలశాభిషేకాలతో వరుణ జపం ఘనంగా నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని చిలుకూరు బాలాజీ దేవాలయం ఆధ్వర్యంలో పన్నెండమంది వేదపండితులతో గురువారం ఆలయ సమీపంలోని గండిపేట చెరువులో వరుణ జపం చేపట్టారు. ఉదయం 10 గంటలకు కలశాల్లో స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకువెళ్లి చెరువులో కలిపి వరుణ జపం ప్రారంభించారు. నాభి (నడుము భాగం) వరకు నీటిలో నిల్చుని పన్నెండు మంది వేదపండితులు మంత్రోచ్చారణలతో మధ్యాహ్నం 12 గంటల వరకు వరుణ జపం చేశారు. నూటా ఎనిమిదిసార్లు (11 ఆవృతులు) వరుణ దేవు ణ్ని ప్రార్థిస్తూ మంత్రాలు జపించారు. అనంతరం చెరువులో నుంచి కలశాన్ని తీసుకువచ్చి గరుత్మంతుడికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు సైతం వరుణ జప మంత్రాల్ని అనుకరించారు. చిలుకూరు బాలాజీ దేవాల యంలో ప్రదక్షిణలు చేసే భక్తులు వర్షాలకోసం అదనంగా రెండు ప్రదక్షిణలు చేశారు. వారం రోజుల నుంచి అదనపు ప్రదక్షిణలు కొనసాగుతున్నాయి. వర్షాలు పడే వరకు భక్తులు అదనపు ప్రదక్షిణలు చేయాలని ఆలయ అర్చకులు సూచించారు. వరుణ జపంలో చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్, అర్చకులు రంగరాజన్, సురేష్‌స్వామి, వేదపండితులు పాల్గొన్నారు. అన్ని ఆలయాల్లో పూజలు చేయాలి: సౌందరరాజన్ వర్షాలు లేక దేశం కరువు కోరల్లోకి వెళ్తుందన్న సంకేతాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు ఎక్కడిక్కడ దేవాలయాల్లో పూజలు చేయాలని, వర్షాలకోసం భగవంతున్ని ప్రార్థించాలని చిలుకూరు బాలాజీ దేవాలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ సూచించారు. వరుణ జపం అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం చిలుకూరులో వరుణ జపం చేసిన తర్వాతే వర్షాలు బాగా పడ్డాయని, ఆ నీళ్లే ఇప్పటి వరకు ఉన్నాయన్నారు. చిలుకూరు బాలాజీ కరుణతో ఈసారి వర్షాలు బాగానే కురుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.