చిలుకూరుకు బాకీపడిన తిరుమల!
హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయానికి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు రావలసి ఉంది. టీటీడీ, ఇతర ఆలయాల నుంచి ఈ మొత్తం రావలసి ఉందని ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందర్ రాజన్ తెలిపారు.
సౌందర్ రాజన్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. ఇతర ఆలయాల నుంచి రావలసిన బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు రాజీవ్ శర్మ సానుకూలంగా స్పందించారు.