Rajiv Sarma
-
చిలుకూరుకు బాకీపడిన తిరుమల!
హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయానికి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు రావలసి ఉంది. టీటీడీ, ఇతర ఆలయాల నుంచి ఈ మొత్తం రావలసి ఉందని ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందర్ రాజన్ తెలిపారు. సౌందర్ రాజన్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను కలిశారు. ఇతర ఆలయాల నుంచి రావలసిన బకాయిలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు రాజీవ్ శర్మ సానుకూలంగా స్పందించారు. -
తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై చర్చ
న్యూఢిల్లీ: హైదరాబాద్ కింగ్‌కోఠిలోని పరదా ప్యాలెస్‌లో తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసే అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈరోజు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రధాన న్యాయమూర్తి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు భవనాన్ని తాత్కాలికంగా ఏపికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో తెలంగాణ హైకోర్టును కింగ్‌కోఠిలోని నిజాం పరదా ప్యాలెస్‌లో లేదా ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ భవనంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో కలిసి రాజీవ్ శర్మ ఈ రెండు భవనాలను పరిశీలించారు. **