సాక్షి, తిరుపతి : వంశపారంపర్య హక్కు అనేది ఒక్క అర్చకులకే కాదని, ఎన్నో కుల వృత్తుల వారు తరతరాలుగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవలో ఉన్నారని చిలుకూరు బాలాజీ టెంపులు ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. కుల వృత్తుల ప్రభావం తెలియకుండా 1987లో అప్పటి ప్రభుత్వం తీసేసిందన్నారు. ఏపీ అసెంబ్లిలో సన్నిధి గొల్లల వంశపారంపర్య హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని రంగరాజన్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అన్నమయ్య వంశస్తులు, నాయీ బ్రాహ్మణులకు త్వరలో వంశపారంపర్య హక్కులు కల్పిస్తారని ఆశిస్తున్నా.
లిక్విడ్ ఓజోన్‌ను చిలుకూరులో ఏర్పాటు చేశాం. కరోనాతో కలిసి సంసారం చేయాలి కాబట్డి ఇది రక్షగా ఉంటుంది. ప్రతి సారీ శానిటైజ్ చేయడం కుదరదు. దీన్ని పీల్చుకోవచ్చు, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. భక్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా ఆలయాలలో వీటిని ఉపయోగిస్తే బాగుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment