చిలుకూరు బాలాజీ సేవలో దళిత భక్తుడు | Dalit devotee In Chilukuru Balaji Service | Sakshi
Sakshi News home page

చిలుకూరు బాలాజీ సేవలో దళిత భక్తుడు

Published Tue, Aug 14 2018 8:52 AM | Last Updated on Tue, Aug 14 2018 8:52 AM

Dalit devotee In Chilukuru Balaji Service - Sakshi

మునివాహన సేవ పొందిన ఆదిత్య పరాశ్రీ, మాజీ మంత్రి పుష్పలీలతో అర్చకుడు రంగరాజన్‌  

మొయినాబాద్‌(చేవెళ్ల) : చిలుకూరు బాలాజీ దేవాల య అర్చకుడు రంగరాజన్‌ భుజస్కందాలపై కూర్చొని మునివాహన సేవతో ఆలయ ప్రవేశం పొం దిన దళిత భక్తుడు ఆదిత్య పరాశ్రీ సోమవారం చి లుకూరు బాలాజీని దర్శించుకున్నారు. ఏప్రిల్‌ 16 న ఆదిత్య పరాశ్రీని అర్చకుడు రంగరాజన్‌ తన భుజస్కందాలపై ఎత్తుకుని నగరంలోని జియాగూడ లో ఉన్న రంగనాథస్వామి ఆలయంలోకి మునివాహన సేవతో ఆలయ ప్రవేశం చేయించారు.

ఆ భక్తుడు మొదటి సారిగా సోమవారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించడంతో అర్చకుడు రంగరాజన్‌ ఆ భక్తుడిని గర్భగుడిలోకి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించారు. అదే విధంగా మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల సోమవారం బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. వీరితోపాటు టీయూఎఫ్‌ఫౌండర్‌ కుమారస్వామి స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement