గొల్కొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సందట్లో సడేమియా అన్నట్లుగా ప్రైవేట్ వాహనాలవారు అందినకాఇకి దోచుకున్నారు. ట్యాక్సీ, ఆటో నిర్వాహకులు మెహిదీపట్నం నుంచి టోలిచౌకీకి ఒక్కో ప్రయాణికుడికి రూ.30, లంగర్‌హౌస్‌కు రూ.40 చొప్పున వసూలు చేశారు. మరోవైపు సుమోలు, తుఫాన్ల వారు చేవెళ్లకు ఒక్కో వ్యక్తికి రూ.350 నుంచి 400, చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు రూ.200, గచ్చిబౌలికి రూ.100 వసూలు చేశారు.
మహిళల పాట్లు ఎన్నో
నేను రోజూ దిల్‌సుఖ్‌నగర్ నుంచి బండ్లగూడ వెళ్లాలి. బస్సులు దొరక్క ఆటోలో ఆఫీసుకు వెళ్లడంతో ఖర్చు రెట్టింపైంది. మరోవైపు సకాలంలో ఆఫీసుకు చేరుకోలేక ఇబ్బంది పడ్డాం. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ సమ్మె వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి.–కె.భారతి, పీ అండ్ టీ కాలనీ,దిల్‌సుఖ్‌నగర్
పూల కోసం వస్తే
సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని పూలు కొనుగోలు చేసేందుకని షాద్‌నగర్ చిన్నరేవల్లి నుంచి నగరానికి వచ్చాను. కాని బస్సులు నడవక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎక్కువ డబ్బులు చెల్లించి తుపాన్ వాహనంలో వచ్చాను. పండుగ సమయం కావడంతో తిరిగివెళ్లేసమయంలో మరింత ఇబ్బంది ఎదురవుతోంది. –మల్లారెడ్డి, చిన్న రేవల్లి
ఉద్యోగానికివెళ్లడం కష్టమైంది...
నేను బాలానగర్ మండలానికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. రూ.65 టికెట్‌కు గాను రూ.35 అదనంగా చెల్లించి వెళ్లాను. అధికంగా ఎక్కువ తీసుకుంటున్నావని ప్రశ్నిస్తే ఇష్టం లేకుంటే దిగిపో అంటున్నారు. బస్సులు నడవని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. –సాజిదా బేగం, ఉద్యోగిని
Comments
Please login to add a commentAdd a comment