ఆటో బోల్తా: 11 మందికి గాయాలు | by auto roll 11 members are injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: 11 మందికి గాయాలు

Published Fri, Dec 26 2014 11:22 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

ఆటో బోల్తా: 11 మందికి గాయాలు - Sakshi

ఆటో బోల్తా: 11 మందికి గాయాలు

మొయినాబాద్: ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సంఘటన మండల పరిధిలోని చిలుకూరు సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, 108 సిబ్బంది కథనం ప్రకారం.. మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గురువారం సాయంత్రం చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లారు.

దర్శనం అనంతరం రాత్రి 9 గంటల సమయంలో స్వగ్రామానికి వెళ్లేందుకు రెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆటోలో ఎక్కారు. చిలుకూరు గ్రామ సమీపంలోకి వెళ్లగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 11 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన దశరథ, దేవి, నితీష్, అనితలను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్వల్ప గాయాలైన రాములమ్మ, నితిన్, రాజశేఖర్, రాజ్‌కుమార్, రాములు, సుభిక్ష, ప్రవళికలను స్థానిక భాస్కర ఆస్పత్రిలో చేర్పించారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని సీఐ రవిచంద్ర తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement