చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. కొంతమంది నటీనటులు వందల సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు రాదు. మరికొంత మంది ఒక్క సినిమాతో ఫేమస్ అవుతారు. ఇది కేవలం హీరోహీరోయిన్లకు మాత్రమే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా వర్తిస్తుంది. తాజాగా ఓ నటుడు అలాగే ఫేమస్ అయ్యాడు. వెబ్ సిరీస్‌లో చేసిన ఓ చిన్న పాత్ర అతన్ని ఫేమస్ చేసింది. అతనే ప్రశాంత్ తమాంగ్. అతన్ని ఫేమస్ చేసిన వెబ్ సిరీసే ‘పాతాళ్‌లోక్-2’(Paatal Lok Season 2 ).
స్నిపర్ డేనియల్ లెచో..
ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన పాతాళ్‌లోక్ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన వెబ్ సిరీస్ పాతాళ్‌లోక్ సీజన్ 2. జైదీప్ అహ్లవత్, గుల్‌పనాగ్, ఇష్వాక్ సింగ్, విపిన్ శర్మ, తిలోత్తమ షోమీ, ప్రశాంత్ తమాంగ్ కీలక పాత్రలు పోషించారు.అవినాష్ అరుణ్, ప్రోసిత్ రాయ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ చూసిన వారందరూ హాథీరామ్ చౌదరి పాత్రతో పాటు స్నిపర్ డేనియల్ లెచో పాత్ర గురించి కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు. నిడివి తక్కువే అయినా ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. తనదైన నటనతో ఆ పాత్రకే వన్నె తెచ్చిన నటుడే ప్రశాంత్ తమాంగ్(Prashant Tamang). ఈ ఒక్క వెబ్ సిరీస్‌తో ఒక్కసారిగా ఆయన ఫేమస్ అయిపోయాడు. నెటిజన్స్ ఆయన గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అతని నేపథ్యాన్ని చూసి షాకవుతున్నారు. మనోడిలో మంచి నటుడే కాదు.. సింగర్ కూడా ఉన్నాడంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే..
ప్రశాంత్ తమాంగ్ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జన్మించాడు. తండ్రి కానిస్టేబుల్. ప్రశాంత్ స్కూల్ ఏజ్‌లోనే ఓ ప్రమాదంలో తండ్రి చనిపోయాడు. దీంతో ప్రశాంత్ తన చదవుని మధ్యలోనే ఆపేసి తండ్రి ప్లేస్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. అయితే చిన్నప్పటి నుంచే సింగర్ కావాలని ప్రశాంత్ కోరిక. కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూనే.. అవకాశం ఉన్నప్పుడలా తన గాత్రాన్ని వినిపించేవాడు. పోలీసులు ఏర్పాటు చేసుకునే ఆర్కెస్ట్రాలో ప్రశాంత్ పాల్గొని అద్భుతమైన పాటలు ఆలపించేవారు.
ఇండియన్ ఐడల్ విన్నర్
తన పై అధికారులు ఎంకరేజ్ చేయడంతో కోల్ కత్తాలో జరిగిన ఇండియన్ ఐడల్ సీజన్ 3(2007)లో ప్రశాంత్ పాల్గొన్నాడు. తనదైన గాత్రంతో అలరించి.. సీజన్ 3 విన్నర్‌గా నిలిచాడు. నేపాలి ఫ్యామిలీస్‌కి చెందిన ప్రశాంత్.. 2009లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో ఆయన నటించిన తొలి నేపాలీ సినిమా రిలీజైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాలేదు. కానీ పాతాళ్‌లోక్ 2లో పోషించిన చిన్న పాత్రతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు.
Here's Daniel from Paatal Lok, Indian Idol 2007 winner Prashant Tamang pic.twitter.com/V5tyVmD4ut
— Abhishek ✨ (@ImAbhishek7_) January 20, 2025
Comments
Please login to add a commentAdd a comment