పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్ | Actress Sonakshi Sinha House In Bandra For Sale | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha Apartment: ఏడాది కాలేదు.. ఇంటిని అమ్మకానికి పెట్టేసింది

Published Tue, Aug 20 2024 6:26 PM | Last Updated on Tue, Aug 20 2024 8:05 PM

Actress Sonakshi Sinha House In Bandra For Sale

హీరోయిన్ సోనాక్షి సిన్హా మొన్నీ మధ్యే జూన్ 23న పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ వేడుకంతా ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న సోనాక్షి అపార్ట్‌మెంట్‌లోనే జరిగాయి. ఇప్పుడు ఆ ఇంటినే అమ్మకానికి పెట్టేసింది. ఈ విషయం ఆమె చెప్పలేదు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పోస్ట్ చేసిన వీడియో వల్ల ఇది బయటపడింది.

(ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. కొత్త వీడియోతో నటి హేమ)

ప్రముఖ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ 'దబంగ్' మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. దక్షిణాదిలోనూ రజినీకాంత్ 'లింగా' సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆడపదడపా సినిమాలు చేస్తోన్న ఈమె.. గతంలో తనతో పాటు నటించిన జహీర్ ఇక్బాల్‌తో చాన్నాళ్ల క్రితమే ప్రేమలో పడింది. ఈ ఏడాది జూన్‌లో పెళ్లికి కొన్నిరోజుల ముందు ఈ విషయం బయటపడింది.

ఇక 2020లో బాంద్రాలో ఓ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన సోనాక్షి.. అదే బిల్డింగ్‌లో మరో అపార్ట్‌మెంట్‌ని గతేడాది మే నెలలో సొంతం చేసుకుంది. తాజాగా అందులోనే తన పెళ్లిని గ్రాండ్‌గా జరుపుకొంది. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ దీన్ని రూ.25 కోట్ల రేటుకి అమ్మకానికి పెట్టింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి జరిగిన ఇంటిని మరి సోనాక్షి ఎందుకు అమ్మాలనుకుందనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: వెయిట్ చేయండి.. సర్‌ప్రైజ్ ఇస్తా: హీరోయిన్ సమంత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement