హీరోయిన్‌ చెప్పులు మోసిన భర్త.. ఇలాగే ఉంటుంది మరి! | Zaheer Iqbal Carries Wife Sonakshi Sinha's Heels, She Calls Him Greenest Flag Ever | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: హీరోయిన్‌ చెప్పులు మోసిన భర్త.. ఇలాగే ఉంటుంది మరి!

Jul 1 2024 11:03 AM | Updated on Jul 1 2024 11:13 AM

Zaheer Iqbal Carries Wife Sonakshi Sinha's Heels, She Calls Him Greenest Flag Ever

ప్రేమకు అర్థం ఏదంటే.. నిన్ను, నన్నే చూపిస్తానంటోంది హీరోయిన్‌ సోనాక్షి సిన్హ. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ సుందరి భర్త గురించే ఈ పాట పాడుతోంది. ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌ భర్తగా మారినా తనపై ప్రేమ ఏమాత్రం తగ్గలేదంటోంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ వీడియో షేర్‌ చేసింది. ఇందులో సోనాక్షి హీల్స్‌ (చెప్పులు)ను ఇక్బాల్‌ తన చేతులతో పట్టుకుని ముందు నడుస్తున్నాడు. 

పెళ్లిపై ట్రోలింగ్‌
భార్యపై చిరాకు పడకుండా నవ్వుతూనే చెప్పులు మోశాడు. కరెక్ట్‌ పర్సన్‌ను పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది అని హీరోయిన్‌ రాసుకొచ్చింది. ఇకపోతే సోనాక్షి- ఇక్బాల్‌ పెళ్లిపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. ఇద్దరూ విభిన్న వర్గానికి చెందినవారు కావడంతో ఈ జంటపై నెటిజన్లు విషం చిమ్మారు. కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి అనరాని మాటలు అన్నారు.

సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హ

ఆస్పత్రిలో తండ్రి
మరోవైపు హీరోయిన్‌ పెళ్లి జరిగిన రెండు రోజులకే తండ్రి, నటుడు శత్రుఘ్న సిన్హా ఆస్పత్రిపాలయ్యాడు. సర్జరీ చేయించుకోబోతున్నాడని రూమర్లు రాగా వాటిని ఆయన కుమారుడు లవ్‌ సిన్హ కొట్టిపారేశాడు. తీవ్ర జ్వరం కారణంగానే ఆస్పత్రిలో చేరాడని, సర్జరీ వంటిదేమీ లేదని స్పష్టం చేశాడు.

చదవండి: ప్రభాస్ 'కల్కి' రేర్ రికార్డ్.. ఇది కదా అసలైన మాస్ అంటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement