ప్రభాస్ 'కల్కి' రేర్ రికార్డ్.. ఇది కదా అసలైన మాస్ అంటే | Prabhas Kalki 2898 AD Movie First Weekend Worldwide Box Office Collections Details Inside | Sakshi
Sakshi News home page

Kalki 2898 Box Office Collections: ఒక్క వీకెండ్.. వసూళ్లలో 'కల్కి' అదిరిపోయే ఘనత

Published Mon, Jul 1 2024 8:47 AM | Last Updated on Mon, Jul 1 2024 9:36 AM

Prabhas Kalki 2898 AD First Weekend Collection Details ‍

డార్లింగ్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించాడు. 'కల్కి'తో ఇప్పటికే వరల్డ్ వైడ్ మరింతగా గుర్తింపుతో పాటు వసూళ్ల జోరు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి మరోసారి చేరిపోయాడు. 'బాహుబలి' నుంచి వరసగా ఈ మార్క్ చేరుకుంటున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం అదిరిపోయే రికార్డ్ తన పేరిట నమోదు చేసుకున్నాడు.

(ఇదీ చదవండి: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్‌గా ఉండేదాన్ని: మంచు లక్ష‍్మీ)

'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌డమ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. దీని తర్వాత బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. ఇలా వరస చిత్రాలతో వందల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. కాకపోతే 'బాహుబలి 2' తప్పితే మిగిలినవన్నీ కూడా లాంగ్ రన్‌లో ఐదారు వందల కోట్లు మాత్రమే సొంతం చేసుకున్నాయి. 'కల్కి' మాత్రం తొలి వీకెండ్ పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్ అధిగమించింది. రేర్ రికార్డ్ నమోదు చేసింది.

ఆదివారం సాయంత్రం ఫస్ట్ షో పడేటప్పటికీ రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేసినట్లు తెలిసిపోయింది. మరోవైపు ఓవర్సీస్‌లోనూ వీకెండ్ పూర్తయ్యేసరికి 10.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. గతంలో 'బాహుబలి' మూవీ తొలి వారాంతంలో రూ.415 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు దీన్ని 'కల్కి' అధిగమించిందంటే.. లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల దాటడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement