అప్పగింతల్లో ఏడ్చేసిన తల్లి.. ఓదార్చిన హీరోయిన్‌.. కానీ ఇప్పుడు.. | Sonakshi Sinha Says She Misses Her Parents Shatrughan Sinha, Poonam | Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: పెళ్లిలో అమ్మ ఏడిస్తే ఓదార్చా.. కానీ ఇప్పుడు..

Published Sun, Jul 7 2024 4:06 PM | Last Updated on Sun, Jul 7 2024 4:25 PM

Sonakshi Sinha Says She Misses Her Parents Shatrughan Sinha, Poonam

పెళ్లి అంటే ఓ పక్క సంతోషం, మరోపక్క బాధ ఏ అమ్మాయికైనా ఉండేదే! జీవితాంతం తోడుండే అర్ధాంగి దొరికినందుకు సంతోషిస్తూనే.. పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు కన్నీళ్లు రాలుస్తుంటారు. హీరోయిన్‌ సోనాక్షి సిన్హ కూడా అంతే! ప్రేమించినవాడినే పెళ్లి చేసుకున్నందుకు సంతోషించింది. అంతలోనే పుట్టింటికి దూరమైనందుకు బాధపడుతోంది.

ఈ మేరకు తన పెళ్లిలో జరిగిన అప్పగింతల ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. నేను ఇక మీదట ఇంట్లో కనిపించను, వెళ్లిపోతున్నానన్న బాధతో అమ్మ(పూనం సిన్హ) పెళ్లిలో ఏడ్చేసింది. అప్పుడు నేను.. ఏం కాదమ్మా.. బాధపడకు, నేను ఎంతోదూరం వెళ్లట్లేదు. జుహు నుంచి బాంద్రా కేవలం 25 నిమిషాలు మాత్రమే అని చెప్పాను. 

కానీ ఎందుకో ఈ రోజు వాళ్లను ఇంకా ఎక్కువ మిస్‌ అవుతున్నాను. అప్పుడు అమ్మను ఓదార్చినట్లే నన్ను నేను ఓదార్చుకుంటున్నాను. ఈ రోజు ఇంట్లో సింధి కూర చేశారనుకుంటున్నాను. త్వరలోనే వాళ్లను కలుస్తాను అని రాసుకొచ్చింది. కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతుంటే ఆ తల్లి మనసు ఎంత అల్లాడిపోతుందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: పేరెంట్స్‌కు హెచ్చరిక జారీ చేసిన సాయిధరమ్‌ తేజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement