పేరెంట్స్‌కు హెచ్చరిక జారీ చేసిన సాయిధరమ్‌ తేజ్‌ | Sai Dharam Tej Request to Parents Do not Share Your Kids Videos on Social Media | Sakshi
Sakshi News home page

పిల్లల వీడియోలు సోషల్‌ మీడియాలో పెడుతున్నారా? జాగ్రత్త అంటున్న హీరో

Published Sun, Jul 7 2024 1:42 PM | Last Updated on Sun, Jul 7 2024 5:42 PM

Sai Dharam Tej Request to Parents Do not Share Your Kids Videos on Social Media

సోషల్‌ మీడియాలో పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసే పేరెంట్స్‌ తస్మాత్‌ జాగ్రత్త అంటున్నాడు మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌. 'పిల్లల ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్‌ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే సోషల్‌ మీడియా మరీ దారుణంగా, భయంకరంగా మారిపోయింది. 

ఇక్కడ ఉన్న మానవ మృగాలను నియంత్రించడం, అడ్డుకోవడం కష్టమైపోతోంది. కాబట్టి మీ పిల్లల పిక్స్‌, వీడియోస్‌ పోస్ట్‌ చేసేటప్పుడు విచక్షణతో ఆలోచించండి. లేదంటే తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది' అని హెచ్చరిక జారీ చేశాడు.

కాగా కొంతమంది తెలుగు యూట్యూబర్స్‌ తండ్రీకూతుర్ల బంధంపై అసభ్య కామెంట్లు చేశారు. డార్క్‌ కామెడీ పేరుతో విచ్చలవిడిగా మాట్లాడారు. ఆత్మీయ బంధాన్ని అవమానించేలా వికృత చేష్టలకు దిగారు. తండ్రీకూతుర్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ వారి గురించి అత్యంత నీచంగా మాట్లాడారు. 

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సాయిధరమ్‌ తేజ్‌ వారిమీద మండిపడుతూ పేరెంట్స్‌ జాగ్రత్తగా ఉండాలని పోస్టు పెట్టాడు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ ట్వీట్‌పై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. పిల్లల భద్రతే తొలి ప్రాధాన్యతగా పేర్కొంటూ సోషల్‌ మీడియాలో చిన్నారులపై అసభ్య కామెంట్లు చేస్తూ వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.

 

 

 

 

 

 

చదవండి: అంబానీ ఇంట సంగీత్‌.. బాద్‌షా ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement