
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ అంతా డ్యాన్స్ చేయడం ఈ వేడుకలో అన్నింటికన్నా హైలైట్‌గా నిలిచింది. అనంత్ బాలీవుడ్ స్టార్స్‌తో స్టెప్పులేయడం కొసమెరుపు. ఇకపోతే ఈ వేడుక కోసం హాలీవుడ్ స్టార్ సింగర్ జస్టిన్ బీబర్ విచ్చేశాడు. ఈవెంట్‌లో ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌ను ఆలపించి అదరగొట్టేశాడు. ఇందుకోసం దాదాపు రూ.83 కోట్ల మేర తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
అలాగే బాలీవుడ్ సింగర్ బాద్‌షా తన పాటలతో అతిథుల్లో జోష్ నింపాడు. వారితో మమేకమై పాటలు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే! బాద్‌షా కూడా ఈ సంగీత్ కోసం కోట్లు పుచ్చుకున్నాడట! ఒక్కరోజు పర్ఫామెన్స్ కోసం రూ.4 కోట్లు అందుకున్నాడంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.
చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. మీకు ఈ కాలిన మచ్చలే కనిపిస్తున్నాయా?: నటి
Comments
Please login to add a commentAdd a comment