Badshah
-
అంబానీ ఇంట సంగీత్.. బాద్షా ఎన్ని కోట్లు తీసుకున్నాడంటే?
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ అంతా డ్యాన్స్ చేయడం ఈ వేడుకలో అన్నింటికన్నా హైలైట్‌గా నిలిచింది. అనంత్ బాలీవుడ్ స్టార్స్‌తో స్టెప్పులేయడం కొసమెరుపు. ఇకపోతే ఈ వేడుక కోసం హాలీవుడ్ స్టార్ సింగర్ జస్టిన్ బీబర్ విచ్చేశాడు. ఈవెంట్లో ఆల్‌టైమ్ హిట్ సాంగ్స్‌ను ఆలపించి అదరగొట్టేశాడు. ఇందుకోసం దాదాపు రూ.83 కోట్ల మేర తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.అలాగే బాలీవుడ్ సింగర్ బాద్షా తన పాటలతో అతిథుల్లో జోష్ నింపాడు. వారితో మమేకమై పాటలు ఆలపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే! బాద్షా కూడా ఈ సంగీత్ కోసం కోట్లు పుచ్చుకున్నాడట! ఒక్కరోజు పర్ఫామెన్స్ కోసం రూ.4 కోట్లు అందుకున్నాడంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. మీకు ఈ కాలిన మచ్చలే కనిపిస్తున్నాయా?: నటి -
పెళ్లి చేసుకున్నా బాగుండేది.. ఇవన్నీ తప్పేవి: నటి
ఇద్దరు సెలబ్రిటీలు ఒకచోట కనిపిస్తే చాలు లవ్ అని పేరు పెట్టేస్తున్నారు. డేటింగ్ అంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఓసారి ఈ రూమర్స్ బారిన పడినవారే! ఆ మధ్య బాద్షా హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో కనిపించగా సమ్‌థింగ్..సమ్‌థింగ్.. ఏదో జరుగుతోందని వెంటపడ్డారు. అలాంటిదేమీ లేదండీ బాబు అని బాద్షా స్వయంగా చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. పాకిస్తాన్ నటి హనియా ఆమిర్‌తోనూ బాద్షాను లింక్ చేశారు. వీరిద్దరూ ఒకరి పోస్టుకు మరొకరు రిప్లై ఇస్తుంటారు. దుబాయ్‌లోనూ కలుసుకోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది.పార్టీ చేసుకున్నాం..తాజాగా తన డేటింగ్ రూమర్‌పై హనియా స్పందించింది. బాద్షా పాటలంటే నాకు ఇష్టం. అతడు నా ఫ్రెండ్. తనతో కలిసి పార్టీ చేసుకున్నదానికి రిలేషన్షిప్లో ఉన్నామని అతిగా ఊహించుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నేను పెళ్లి చేసుకోకపోవడమే పెద్ద సమస్య అనుకుంటా.. వైవాహిక జీవితం మొదలుపెట్టి ఉంటే ఇలాంటి రూమర్లకు దూరంగా ఉండేదాన్ని.ఆన్లైన్ ఫ్రెండ్షిప్బాద్షాతో నా స్నేహం ఎలా మొదలైందంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చేసిన రీల్‌కు అతడు కామెంట్ పెట్టాడు. అది నా ఫ్రెండ్ చూసి బాద్షా కామెంట్ చేశాడంది. ఏంటి, నిజమా? అని ఆశ్చర్యపోయాను. తను నాకు డైరెక్ట్‌గా కూడా మెసేజ్ చేశాడు. అలా ఇద్దరం మాట్లాడుకున్నాం. తను చాలా మంచి వ్యక్తి. నేనెప్పుడైనా బాధలో ఉండి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోతే.. ఏమైంది? అంతా ఓకేనా? ఏం జరుగుతోంది? అని ఆరా తీస్తుంటాడు. బాద్షా నాకు దొరికిన గొప్ప మిత్రుడు అని హనియా చెప్పుకొచ్చింది.చదవండి: Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ -
మృణాల్ తో డేటింగ్..ఎవరంటే..!
-
మృణాల్తో డేటింగ్ వార్తలు.. స్పందించిన బాద్షా!
సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. గతంలోనే ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. తాజాగా మరోసారి మృణాల్ డేటింగ్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనికి ప్రధాన కారణం ముంబయిలో జరిగిన శిల్పాశెట్టి దివాళీ బాష్‌కు హాజరవ్వడమే. పార్టీకి హాజరైన ముద్దుగుమ్మ ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో సన్నిహితంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా నెట్టింట వైరలవుతున్న మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్ రూమర్స్‌పై ర్యాపర్ బాద్షా స్పందించారు. ‘మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదు' అంటూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి వస్తున్న రూమర్స్ గురించే ఈ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీపావళి బాష్‌లో రాపర్ బాద్షా, మృణాల్ ఠాకూర్ చేయి పట్టుకుని నడుస్తూ వీడియోలో కనిపించారు. కాగా. మృణాల్ ఇటీవలే ఇషాన్ ఖట్టర్‌తో కలిసి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన 'పిప్పా'లో కనిపించింది. బ్రిగేడియర్ బలరామ్ సింగ్ మెహతా రచించిన 'ది బర్నింగ్ ఛాఫీస్' పుస్తకం ఆధారంగా రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్ 10న విడుదలైన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంషు పైన్యులి, సోని రజ్దాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లోనూ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. -
పార్టీలో మెరిసిన సీతారామం బ్యూటీ.. అతనితో డేటింగ్ నిజమేనా!
సీతారామం సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన పిప్పా అనే హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ తాజాగా ముంబయిలో తళుక్కున మెరిసింది. శిల్పాశెట్టి నిర్వహించిన దివాళీ బాష్‌లో సందడి చేసింది. అయితే శిల్పాశెట్టి పార్టీకి హాజరైన మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో కలిసి జంటగా కనిపించింది. అంతే కాకుండా అతని చేతిలో చేయి పట్టుకుని కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. మృణాల్ అతనితో డేటింగ్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్, అతనితో కలిసి ఓకే కారులో వెళ్లడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఓ నెటిజన్ రాస్తూ.. " మృణాల్, బాద్షా డేటింగ్లో ఉన్నారా? అంటూ కామెంట్ చేయగా.. మరొకరు 'వీరిని జంటగా నేను ఊహించలేదు ... వావ్ " అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ..'అతను ఇప్పటికే పెళ్లయినట్లు కనిపిస్తున్నారంటూ' కామెంట్ చేశాడు. ఓ నెటిజన్ ఏకంగా 'ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది' అంటూ రాసుకొచ్చారు. అయితే కొందరేమో ఈ జోడీ సెట్ కాలేదంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఇటీవలే టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోనుందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. -
డాబర్ చేతికి బాద్షా మసాలా
న్యూఢిల్లీ: బాద్షా మసాలాలో మెజారిటీ వాటా(51 శాతం) కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా తాజాగా పేర్కొంది. ఇందుకు దాదాపు రూ. 588 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వేగవంత వృద్ధిలోనున్న మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశించేందుకు డాబర్‌కు వీలు చిక్కనుంది. డీల్ ప్రకారం రూ. 1,152 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో బాద్షా సొంతం చేసుకోనుంది. మిగిలిన 49 శాతం వాటాను సైతం ఐదేళ్ల తదుపరి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆహార సంబంధ బిజినెస్‌ను మరింత విస్తరించే వ్యూహంలో భాగంగా బాద్షా కొనుగోలుకి తెరతీసినట్లు డాబర్ పేర్కొంది. వెరసి రూ. 25,000 కోట్ల విలువైన బ్రాండెడ్ మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశించనుంది. దీంతో రానున్న మూడేళ్లలో ఫుడ్ బిజినెస్ ఆదా యాన్ని రూ. 500 కోట్లకు చేర్చే వీలున్నట్లు డాబర్ తెలియజేసింది. 1958లో ఏర్పాటైన బాద్షా మసాలా 2021–22లో రూ. 189 కోట్ల టర్నోవర్ సాధించింది. రూ. 2.5 డివిడెండ్ ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) రెండో త్రైమాసికంలో డాబర్ ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 3 శాతం క్షీణించి రూ. 491 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2021–22) ఇదే కాలంలో లాభం రూ. 505 కోట్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 2.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 2,986 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 2,818 కోట్ల టర్నోవర్ సాధించింది. -
ఖో ఖో లీగ్‌లో ఆరో జట్టుగా ముంబై
ముంబై: అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో ఆరో జట్టుగా ముంబై చేరింది. ప్రముఖ గాయకుడు బాద్షా, బాలీవుడ్ సినీ నిర్మాత, వ్యాపారవేత్త పునీత్ బాలన్ ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ ఏడాది చివర్లో అల్టిమేట్ ఖో ఖో లీగ్ జరగనుంది. ‘మా అమ్మ కాలేజీ రోజుల్లో ఖో ఖో ఆడేది. ఆటపై ఇష్టం, వ్యక్తిగత అనుబంధం నన్ను ఖో ఖో లీగ్‌లో భాగమయ్యేలా చేసింది’ అని తొలిసారి క్రీడల్లో పెట్టుబడి పెడుతున్న బాద్షా అన్నాడు. బాలన్ గ్రూప్ అధినేత పునీత్ బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, హ్యాండ్‌బాల్ లీగ్‌లలోనూ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. ఇప్పటికే అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో అదానీ గ్రూప్, జీఎంఆర్ గ్రూప్, కాప్రి గ్లోబల్, కేఎల్ఓ స్పోర్ట్స్ వివిధ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి. చదవండి: Elorda Cup 2022: సిమ్రన్‌జిత్ శుభారంభం..! -
ఛీ.. ఇదా మీరిచ్చే గౌరవం.. శిల్పా శెట్టి, బాద్షాపై నెటిజన్ల ఫైర్
Shilpa Shetty Badshah Gets Trolled Showing Attitude To Harnaaz Sandhu: హర్నాజ్ కౌర్ సంధు 'మిస్ యూనివర్స్ 2021' కిరీటాన్ని గెలిచి భారదేశం గర్వించేలా చేసింది. బాలీవుడ్ బ్యూటీ లారా దత్తా తర్వాత ఈ కిరీటాన్ని సాధించిన మూడో భారతీయురాలిగా హర్నాజ్ పేరు పొందింది. ఈ టైటిల్ సొంతం చేసుకున్నప్పటి నుంచి హర్నాజ్ సంధు అనేక వేడుకలకు హాజరవుతోంది. ఇటీవల లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచి ఆకట్టుకుంది. తాజాగా మోస్ట్ పాపులర్ అయిన బాలీవుడ్ షో 'ఇండియాస్ గాట్ టాలెంట్ 9'కు అతిథిగా హాజరైంది. ఈ రియాలిటీ షోలో శిల్పా శెట్టి, బాద్షా, మనోజ్ ముంతాషీర్, కిరణ్ ఖేర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో నుంచి హర్నాజ్ సంధు అతిథిగా హాజరైన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోలో హర్నాజ్ సంధు న్యాయనిర్ణేతలను పలకరించేందుకు వచ్చినప్పుడు శిల్పా శెట్టి పట్టించుకోకుండా కనిపించింది. మిగతా జడ్జ్‌లతో హర్నాజ్ షేక్‌హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతుంటే శిల్పా శెట్టి మాత్రం తన చెల్లెలు షమితా శెట్టితో ఉంది. తర్వాత చివర్లో హర్నాజ్ను పలకరించింది శిల్పా శెట్టి. ఇది చూసిన నెటిజన్లు శిల్పా శెట్టి, బాద్షాపై మండిపడుతున్నారు. కనీసం అతిథులుగా గౌరవం ఇచ్చే సంస్కారం లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే శిల్పా శెట్టి, బాద్షాలు పలకరించిన తీరు ఫేక్ అంటూ కామెంట్ పెడుతున్నారు. హర్నాజ్ షేక్‌హ్యాండ్ ఇస్తున్నప్పుడు శిల్పా ఇచ్చి ఎక్స్ప్రెషన్ నెటిజన్లకు మింగుడుపడటం లేదు. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) 'ఈ జడ్జ్‌లకు కనీస గౌరవమర్యాదలు తెలియవు. అంతా నకిలీ, కొంచెం కూడా ఇష్టం లేనట్టుంది. హర్నాజ్ సంధు ఎంత మంచి అమ్మాయి. దేశానికి ఎంత పేరు తీసుకొచ్చింది. కొంచెం కూడా గౌరవం లేదు. సిగ్గుచేటు.' అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. మరొకరు 'వారి ముఖాలకు ఏమైంది ? ఫేక్ ఎక్స్ప్రెషన్స్', 'అసలు వాళ్లకైమైంది. వాళ్లదంతా నటన అని చాలా సులభంగా తెలిసిపోతుంది', 'ఈ అమ్మాయి దేశం కోసం చాలా చేసింది. 21 సంవత్సరాల తర్వాత కిరీటాన్ని తీసుకొచ్చింది. అందుకు జడ్జ్‌ల తీరు చూడండి. అదంతా ఫేక్. ఆమెను కలవడం వాళ్లకు బొత్తిగా ఇష్టం లేనట్టుంది', 'వారికి హర్నాజ్ నచ్చలేదని ఇప్పటిదాకా నేను మాత్రమే అనుకున్నాను' అని శిల్పా శెట్టి, బాద్షా తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్. View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) View this post on Instagram A post shared by Miss Diva (@missdivaorg) -
రెండే రెండు నిమిషాల్లో బాద్షా సాంగ్, స్పందించిన ర్యాపర్
హ్యూమర్ అంటే ఇష్టం లేనిది ఎవరికి? ఆ మాటకొస్తే మ్యూజిక్ అంటే కూడా! ఈ రెండిటినీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుందిగానీ, ఆ కళ కాస్త గట్టిగా తెలిసుండాలి. సరిగ్గా ఈ కోవకు చెందిన మ్యూజిషియన్ అన్ష్మన్ శర్మ. ‘హౌ టూ మేక్ ఏ బాద్షా సాంగ్ ఇన్ 2 మినిట్స్’ పేరుతో ఆయన ఒక వీడియో రూపొందించాడు. సాంగ్ మేకింగ్ గురించి ఎనిమిది స్టెప్స్‌తో జనవరి 10న పోస్టు చేసిన ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 9 లక్షల పైనా వ్యూవ్స్ వచ్చాయి. ఇలాంటి వీడియోనే గతంలో రిత్విక్, ప్రతీక్ పాటల గురించి చేసి శబ్భాష్ అనిపించుకున్నాడు శర్మ. అయితే ఈ వైరల్ వీడియో చివరికి రాపర్ దృష్టిని ఆకర్షించింది. దీనిపై స్పందిస్తూ ‘అతను దాదాపు కొల్లగొట్టాడని ప్రమాణం చేస్తున్నాను" అంటూ బాద్షా నవ్వుతున్న ఎమోజీ షేర్ చేశారు. How to make a Badshah song in 2 minutes! pic.twitter.com/MtpILEwgvi — Anshuman Sharma (@anshumonsharma) January 10, 2022 -
‘బచ్పన్ కా ప్యార్’ పిలగాడు: బతికి బట్ట కట్టాడు.. మళ్లీ అదృష్ట దేవత తలుపు తట్టింది
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒక్కోసారి అదృష్టం, మరోసారి దురదృష్టం వెంటాడడం సహజమే!. పదేళ్ల వయసున్న సహదేవ్ దిర్డో విషయంలో ఇలాంటిదే జరుగుతోంది. ఒక వైరల్ వీడియోతో సెన్సేషన్ అయిన ఈ గిరిజన కుర్రాడికి.. బాలీవుడ్లో పాప్ సాంగ్స్ చేసే అదృష్టం దక్కింది. ఆ వెంటనే రోడ్డు ప్రమాదం చావు అంచుల దాకా తీసుకెళ్లింది. మరి ఇప్పుడో..? ‘జానే మేరీ జానేమన్ బచ్పన్ కా ప్యార్ మేరా భూల్ నహీ జానా రే’ అంటూ స్కూల్ యూనిఫామ్‌లో తరగతి గదిలో హుషారుగా పాట పాడిన సహదేవ్ దిర్డో.. ఏడాది తర్వాత(2021లో) కరోనా టైంలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఇంటర్నెట్ సెలబ్రిటీ అయిపోయాడు. ఆ రాష్ట్ర సీఎం, సెలబ్రిటీలంతా ఆ వీడియోపై రియాక్ట్ అయ్యారు. లగ్జరీ కారుతో పాటు కొంత ఆర్థిక సాయం కూడా అందింది ఆ కుర్రాడికి. సుక్మాలో అతని చిన్న ఇంటికి నేషనల్ మీడియా సైతం క్యూ కట్టింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. బాలీవుడ్ ర్యాపర్ బాద్షాతో కలిసి ఏకంగా తన వైరల్ సాంగ్‌కు ర్యాప్ కట్టాడు సహదేవ్. ఆ దెబ్బతో అతని జీవితం మారిపోయిందని అంతా భావించారు. కానీ.. కిందటి నెలలో తన తండ్రితో కలిసి బైక్ మీద వెళ్తున్న క్రమంలో జారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో బతకడం కష్టమని ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు భావించారు. కానీ, ఆ పిలగాడి నసీబ్ మంచిగుంది. బతికి బట్టకట్టాడు. సహదేవ్‌కు బాద్షా వెన్నంటే ఉన్నాడు. ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. ఆపై కోలుకున్న అతన్ని రాయ్‌పూర్‌లోని మంచి న్యూరోసర్జన్ దగ్గరికి తీసుకెళ్లి కోలుకునేలా చేశాడు ఈ బాలీవుడ్ ర్యాపర్. View this post on Instagram A post shared by Sahdev Dirdo (@viralboy_sahdev) ఆ రూపంలో లక్ తన ప్రాణాలు నిలబెట్టిన వైద్యులకు కృతజ్ఞతలు చెప్తూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్వయంగా ఓ వీడియో సందేశం పోస్ట్ చేశాడు సహదేవ్. అంతేకాదు తన క్షేమసమాచారాల కోసం ఆరా తీసిన వాళ్లకు, తాను కోలుకోవాలని ఆకాంక్షినవాళ్లకు కృతజ్ఞతలు సైతం తెలియజేశాడు. అంతేకాదు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నానంటూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. సెలబ్రిటీల ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ అయిన ఎన్వోఎఫ్టీఈఎన్(nOFTEN) వెంచర్లో భాగం కానున్నట్లు ప్రకటించాడు. ఇది మన దేశంలో సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేసిన మెటావర్స్ మార్కెట్‌ప్లేస్. ఈ ఎన్ఎఫ్టీలో ఒరిజనల్ సాంగ్‌కు చెందినదంతా ఉంటుంది. తద్వారా సహదేవ్‌కు కాసుల వర్షం కురవడంతో పాటు అమితాబ్లాంటి ప్రముఖుల సరసన నిలిచే అదృష్టం కలిగింది(ఎన్ఎఫ్టీ ద్వారా). ర్యాప్ సాంగ్ ఒరిజినల్ సాంగ్‌తోపాటు బిహైండ్ సీన్స్, షార్ట్ మూవీస్.. ఇలా ఎన్నో ఉంటాయి. వీటిని కొనుగోలు చేసి.. ఎన్వోఎఫ్టీఈఎన్లో మంచి ధర ఆఫర్ అయినప్పుడు అమ్మేసుకోవచ్చు. మొదటి మార్గంగా ప్రాధాన్యత ప్రకారం వారి కళాకృతులను చేర్చుకోవడం, వారి డిజిటల్ భాగాన్ని వేలం వేయడానికి సులభమైన బిడ్డింగ్ విధానం ద్వారా వారి భాగానికి సరైన ధరను పొందడం. రెండో మార్గం క్రియేటర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌లో స్థిరమైన ధర పాయింట్‌ను జోడించడం ద్వారా ఆసక్తి ఉన్నవాళ్లకు అమ్మేసి డబ్బు సంపాదించవచ్చు, View this post on Instagram A post shared by nOFTEN NFT Marketplace (@noften_nft) ఇదిలా ఉంటే హెల్మెట్ ధరించనందువల్లే తాను గాయపడ్డానని, దయచేసి అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటూ స్థానిక మీడియా హౌజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం వ్యాఖ్యానించాడు సహదేవ్. मेरी जिंदगी बदल दी 🙏🙏 नमस्कार दोस्तों अपने मुझे बहुत सारा प्यार दिया मैं इसके लिए आपका सदैव आभारी हूं। @Its_Badshah @Bollyhungama@bollywood_life@BollywoodBoyz@arrahman@bhupeshbaghel@Devendra_1925 धन्यवाद pic.twitter.com/3hIADmh18N — Sahdev Dirdo (@Sahdev_Dirdo) August 2, 2021 -
అభిమానం @ 29 ఏళ్లు
గాడ్‌ఫాదర్ లేడు. బ్యాక్గ్రౌండు లేదు. ఏదో సాధించాలని రైలేక్కి ముంబై చేరుకున్నాడు. ‘అసహ్యంగా ఉన్నాడనే’ ఛీదరింపు అతనిలో కసి పెంచింది. నటనలో మరింత రాటుదేలేలా చేసింది. బుల్లితెరపై నాలుగేళ్ల రాణింపు ఫలితం.. వెండితెరకు సాదరంగా ఆహ్వానం పలికింది. అక్కడ అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టింది. ఆ సినీ స్టార్డమ్ ఇవాల్టికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ బాద్షా, కింగ్ ఆఫ్ ఖాన్స్.. ఈ ట్యాగుల్ని వరుస ఫ్లాపులు, డిజాస్టర్లు ఇప్పటికీ షారూఖ్ ఖాన్ నుంచి దూరం చేయలేకపోతున్నాయి. దీవానా(జూన్ 25, 1992న రిలీజ్)తో సెకండ్ హీరోగా మొదలైన షారూఖ్ నటన.. తొలినాళ్లలో నెగెటివ్ రోల్స్‌తో జనాలకు దగ్గరైంది. మేనరిజం, చేతుల చాచే స్టయిల్, నటన.. యువతలో చెరగని ఓ ముద్ర వేశాయి. 90వ దశకం నుంచి దాదాపు పదిహేనేళ్లకుపైగా లవర్‌బాయ్, ఫ్యామిలీమ్యాన్ తరహా పాత్రలతో షారూఖ్‌ను అలరించేలా చేశాయి. కి..కి..కిరణ్ ఇప్పుడున్న యాక్టింగ్ జనరేషన్ నెగెటివ్ రోల్స్‌ను తేలికగా ఓన్ చేసుకుంటోంది. కానీ, అప్పట్లో ఆడియెన్స్ ఎలా రియాక్టర్ అవుతారో అనే సంగ్ధిగ్దం నడుమే స్టార్లు పచ్చ జెండా ఊపేవాళ్లు. అలాంటిది యాక్టింగ్ తొలినాళ్లలో.. అదీ ఛాలెంజింగ్ రోల్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు షారూఖ్. పగతో రగిలిపోయి ప్రేమను సైతం చంపుకునే యువకుడిగా ‘బాజీఘర్’లో, సైకో లవర్‌గా ‘డర్’, ‘అంజామ్’ సినిమాలతో హీరో‘విలని’జం పండించాడు. ‘కరణ్ అర్జున్, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే, కోయ్లా, దిల్ తో పాగల్ హై, డుప్లికేట్, కుచ్కుచ్ హోతా హై, జోష్, మోహబ్బతేన్, మైహూనా’ లాంటి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టులు యూత్‌లో షారూఖ్ క్రేజ్‌ను అమాంతం పెంచాయి. అన్ని భాషల్లో షారూక్ పేరు మారుమోగేలా చేయడంతో పాటు బాలీవుడ్‌కి బాద్షాగా షారూఖ్‌ను నిలబెట్టాయి. ప్రయోగాలు వెక్కిరించినా.. షారూఖ్ కెరీర్లో పర్దేశ్, డీడీఎల్జే, దేవదాస్, కల్హోనహో, వీర్‌జరా, చక్‌దే ఇండియా లాంటి పర్ఫార్మెన్స్ బేస్డ్ సినిమాలే కాదు.. ప్రయోగాలు చాలానే ఉన్నాయి. దిల్ సే, అశోక, ఛల్తే ఛల్తే, స్వదేశ్, మై నేమ్ ఈజ్ ఖాన్, రా వన్, ఫ్యాన్, రాయిస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చినప్పటికీ.. షారూఖ్ యాక్టింగ్‌కు ఆడియెన్స్‌ను ఫిదా చేయకుండా ఉండలేకపోయాయి. ఇక డిజాస్టర్ల సంగతి సరేసరి. అయినప్పటికీ షారూఖ్ స్టార్ హీరో క్రేజ్, ఫ్యాన్డమ్ ఈనాటికి తగ్గలేదు. అందుకు కారణం.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించాడనే. ముంబైలోని మన్నత్ ముందు ప్రతీ పుట్టినరోజుకి క్యూ కట్టే అభిమానం చాలు.. షారూక్‌పై అభిమానం ఏనాటికీ తరిగిపోదని చాటి చెప్పడానికి. Been working. Just saw the ’overwhelmed ness’ of the lov of nearly 30 yrs u r showering on me here. Realised it’s more than half my life in the service of hoping to entertain u all. Will take out time tomorrow & share some love back personally. Thx needed to feel loved…. — Shah Rukh Khan (@iamsrk) June 24, 2021 -
స్టెప్పులతో ఇరగదీసిన బామ్మ.. ర్యాపర్ ఫిదా
60 ఏళ్ల దాటాయంటే ఎవరైన రామా, కృష్ణా అంటూ ఇంట్లో ఖాళీగా కూర్చునేవాళ్లే మనకు తెలుసు.. ఉరుకుల పరుగుల జీవితానికి స్వస్తి చెప్పి తీరిగ్గా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే బామ్మ మాత్రం సాధారణ వ్యక్తి కాదు. సమ్‌థింగ్ స్పెషల్.. ఈ వయసులో నాకెందుకు అని అనుకోకుండా తనకున్న టాలెంట్‌ను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆమె తమిళనాడుకు చెందిన ఓ బామ్మ. అవును ఆరవై ఏళ్లు పైబడిన బామ్మ పాతికేళ్ల యువకుడితో సమానంగా డ్యాన్స్(టిక్‌టాక్) వీడియోలు చేస్తుంటుంది. వాటిని అతను తరుచుగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. దీంతో బామ్మకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. తాజాగా రష్మిక మందన, ర్యాపర్ బాద్షా, యువన్ శంకర్ రాజా కలిసి నటించిన రాప్ సాంగ్ టాప్ టక్కర్ అనే పాటకు బామ్మ తన మనవడు అక్షయ్ పార్థసారథితో కలసి స్టెప్పులేసింది. పాట లిరిక్కు తగ్గట్టుగా కేవలం చేతులు, తల కదిలిస్తూ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. దీనిని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేయగా..ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం బామ్మ టాలెంట్‌కు ర్యాపర్ బాద్షాకు కూడా ఫిదా అయిపోయాడు. ‘నానమ్మ నువ్వు నా టాప్ టక్కర్’ అంటూ బామ్మ పెర్ఫార్మన్స్ వీడియోను రీపోస్టు చేశాడు. చదవండి: నజ్రియా నజీమ్ ‘వాది’ కమింగ్!.. ఎందుకంటే.. View this post on Instagram A post shared by BADSHAH (@badboyshah) -
‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాద్షా’
బాలీవుడ్ సింగర్ బాద్షా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ‘బోరోలోకర్ బీటీ లో’ పాట సృష్టికర్త, బెంగాల్ జానపద కళాకారుడు రతన్ కహార్‌కు ఆర్థిక సాయం అందిస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం బాద్షా తన టీంతో ఆ కళాకారుడుకి వీడియో కాల్ చేసి అకౌంట్ వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం అతని ఖాతాలో రూ. 5లక్షలు జమ చేసి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నాడు. బాద్షా చేసిన సాయంపై రతన్ కహార్ స్పందించారు. ‘బాద్షా చేసిన సాయానికి కృతజ్ఞతలు. పశ్చిమ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లా శౌరి గ్రామంలో ఉండే నా ఇంటికి బాద్షా రావాల’ని ఆయన ఆహ్వానించారు. ఇక తన పాటను ఆల్బమ్‌లో ఉపయోగించుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బాద్షాతో సంగీతానికి సంబంధించిన పలు విషయాలు చర్చించాలని ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రతన్ కహార్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. (‘దారుణం, అతడి ప్రతిభను కొట్టేశారు’) హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్, సింగర్ బాద్షా కలిసి ఆడిపాడిన మ్యూజిక్ ఆల్బమ్ ‘జెండా ఫూల్’ ఈ మధ్యే రిలీజ్ అయింది. ఈ పాట మూలాలు రతన్ కహార్ ‘బోరోలోకర్ బీటీ లో’తో దగ్గరగా ఉన్నాయని, కనీసం ఆ కళాకారుడికి గుర్తింపు ఇవ్వకపోవటంపై సోషల్‌మీడియాలో నెటిజన్లు బాద్షాపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. -
‘దారుణం, అతడి ప్రతిభను కొట్టేశారు’
హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్, సింగర్ బాద్షాపై నెటిజన్లు గరం అవుతున్నారు. ఇతరుల ప్రతిభను కొట్టేసి అది మీదేనని చెప్పుకోడానికి మనసెలా వచ్చిందని నిలదీస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఆడిపాడిన మ్యూజిక్ ఆల్బమ్ ‘జెండా ఫూల్’ ఈ మధ్యే రిలీజ్ అయింది. దీనికి ఎంతగా విశేష ఆదరణ దక్కిందో, అంతే స్థాయిలో విమర్శలపాలవుతోంది. దీని మూలాలు బెంగాలీ పాటను గుర్తు చేస్తున్నాయి. దీంతో ఇది బెంగాలీ ఫోక్ సాంగ్ అని, ఒరిజినల్ పాటకు కర్త, కర్మ, క్రియ అయిన జానపద కళాకారునికి గుర్తింపునివ్వకపోవడం దారుణమని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అతడి అనుమతి లేకుండా నిర్దాక్షిణ్యంగా కాపీ కొట్టారని విరుచుకుపడుతున్నారు. ఈ విషయం గురించి బెంగాలీ సంగీతకారుడు రోహన్ దాస్‌గుప్తా స్పందిస్తూ.. ‘రతన్ కహార్ అనే బెంగాల్ జానపద కళాకారుడు ఈ పాటను రూపొందించడంతోపాటు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాడాడు. ఇప్పుడు వచ్చిన జెండా ఫూల్.. అతను 1970లో "బోరోలోకర్ బీటీ లో" అంటూ గొంతెత్తి పాడాడు. దురదృష్టమేంటంటే తాజా పాట సంగీతం, లిరిక్స్‌పై హక్కులు కోరుతూ దావా వేసేందుకు అతని దగ్గర డబ్బు లేదు. కానీ ఈ పాట అచ్చంగా అతనిదేనన్న నిజం అందరికీ తెలియాలి’ అని కోరుతూ ట్వీట్ చేశాడు. యూట్యూబ్‌లో ‘జెండా ఫూల్’ పాట వీడియోలో అతని పేరును కూడా చేర్చాలంటూ పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా రతన్ కహార్ పశ్చిమ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లాలో శౌరి గ్రామంలో నివసిస్తున్నారు. (సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!) -
ఇస్మార్ట్ స్టెప్స్
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నిధీ అగర్వాల్. ఆ జోష్‌తోనే ఇస్మార్ట్ స్టెప్స్ వేయడానికి రెడీ అవుతున్నారు. హిందీ ర్యాపర్ బాద్షాతో కలసి నిధీ అగర్వాల్ ఓ మ్యూజిక్ వీడియో చేశారు. ఈ వీడియో ఇవాళ రిలీజ్ కానుంది. ఈ మ్యూజిక్ వీడియోకు బలీందర్ యస్. మహంత్ దర్శకత్వం వహించగా ఈ పాటను బాద్షాయే రాసి, పాడి, సంగీతం సమకూర్చారు. ఈ వీడియోలో నిధీ గ్లామర్, తన స్టెప్స్, బాద్షా ర్యాప్ కచ్చితంగా మ్యూజిక్ లవర్స్‌కు ట్రీట్‌లా ఉంటుందని అనుకుంటున్నారు బాద్షా, నిధీ ఫ్యాన్స్. నిధీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో ‘జయం’ రవితో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే తెలుగులో తన తదుపరి సినిమా విశేషాలను ప్రకటించనున్నారు. -
నంబర్ 3
మళ్లీ బెంగాలీ డైలాగ్ పేపర్స్ పట్టుకున్నారు కథానాయిక శ్రద్ధాదాస్. ‘ది రాయల్ బెంగాల్ టైగర్ (2014), బాద్షా : ది డాన్ (2016)’ శ్రద్ధాదాస్ ఇంతకుముందు నటించిన బెంగాలీ చిత్రాలు. ‘‘టాలీవుడ్ (బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ అని పిలుస్తారు) బాద్షా జీత్ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నందుకు హ్యాపీగా ఉంది. గౌరవంగా ఫీల్ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. ఇలా బెంగాలీలో మూడో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు శ్రద్ధా. ఈ సినిమాకు అన్షుమాన్ ప్రత్యూష్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ కోల్‌కతాలో ప్రారంభం అయ్యింది. రెండేళ్ల క్రితం ‘బాద్షా: ది డాన్’ చిత్రంలో స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు శ్రద్ధా అండ్ జీత్. మరి బెంగాలీ సినిమా తప్ప శ్రద్ధా చేతిలో సినిమాలు లేవా? అంటే అదేం లేదు. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలు చేస్తున్నారు. అలాగే ఇటీవలే ‘సోల్’ ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్‌తో డిజిటల్ రంగం వైపు కూడా అడుగు వేశారు శ్రద్ధా. ఇక ముంబైలో పుట్టినప్పటికీని శ్రద్ధాదాస్ తల్లిదండ్రులు బెంగాల్‌కి చెందినవారన్న విషయం తెలిసిందే. -
చెడు దుర్వాసన లాంటిది
తోటి వారు సంతోషాల్లో ఉంటే చూసి ఏడ్వడం, బాధల్లో ఉంటే నవ్వడం మనల్ని కష్టాలు పాలు చేస్తుంది. జునైద్ తెలివైన యువకుడు. అందుకే అతడంటే పాదుషాకి ఎంతో అభిమానం. జునైద్ ను సంప్రదించకుండా ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. అది చూసి దర్బారులోని ఒక మంత్రి ఓర్వలేకపోయాడు. దర్బారునుంచి జునైద్ ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రకరకాల కుట్రలు పన్నేవాడు. ఒకరోజు పాదుషా దగ్గరికెళ్లి ‘‘పాదుషా గారు జునైద్ మీ గురించి చెడుగా చెబుతున్నాడు. మీ దేహం నుంచి దుర్వాసన వస్తుందని ప్రచారం చేస్తున్నాడు. కావాలంటే రేపు అతను దర్బారులోకి రాగానే అతన్ని మీ దగ్గరకు పిలిపించుకుని చూడండి. అతను మీతో మాట్లాడేటప్పుడు ముక్కు, నోరు మూసుకుని మీతో మాట్లాడతాడు.’’ విషం చిమ్మాడతను. మంత్రి మాటలకు పాదుషా ఆశ్చర్యపోయాడు. రెండోరోజు ఉదయం మంత్రి తన పథకంలో భాగంగా జునైద్ కు మాయమాటలు చెప్పి తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. విందు ముగిసాక మాటల్లో పెట్టి వెల్లిపాయలు తినిపించాడు. విందు అవగానే జునైద్ దర్బారుకు వెళ్లాడు. జునైద్‌ను ఏదో అడిగేందుకు పాదుషా దగ్గరికి పిలిపించుకోగానే తన నోటినుంచి వస్తున్న దుర్వాసన వల్ల పాదుషా గారికి ఇబ్బంది కలుగుతుందనే భయంతో ముక్కూ, నోరు మూసుకున్నాడు. అది చూసిన పాదుషా మంత్రి చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నాడు. జునైద్ మీద కట్టలు తెగేంత కోపం వచ్చింది. వెంటనే ఒక లేఖను రాసి ఈ లేఖను గవర్నర్‌కు ఇమ్మని దానికి జునైద్ కు అందించాడు. జునైద్ లేఖను తీసుకుని దర్బారు నుంచి బయటకు వచ్చాడు. దారిలోనే మంత్రి ఎదురయ్యాడు. జునైద్ చేతిలో ఉన్న లేఖను చూసి ‘ఈ ఉత్తరంలో ఏముంది?’ అని అడిగాడు. ‘‘పాదుషా గారు నాకోసం నగదు బహుమతులు ఇవ్వమని సిఫారసు లేఖ రాశారనుకుంటాను’’ అని చెప్పాడు. మంత్రి ఆ లేఖను తనకివ్వవలసిందిగా ప్రాధేయపడ్డాడు. జునైద్ ఆ ఉత్తరాన్ని మంత్రికి ఇచ్చేశాడు. మంత్రి ఆ ఉత్తరాన్ని అందుకుని ఎంతో సంబరపడుతూ తీసుకెళ్లి గవర్నర్ కు అందించాడు. గవర్నర్ ఉత్తరాన్ని తెరిచి చూడగా అందులో ‘‘ఈ లేఖను తెచ్చిన వ్యక్తిని ఉరితీసి చంపేయండి. శవాన్ని నా దగ్గరకు పంపండి’’ అని రాసి ఉంది. పాదుషా గారి ఆజ్ఞ మేరకు మంత్రిని ఉరికొయ్యకు వేలాడదీశారు. మరునాడు యధావిధిగా దర్బారుకు వచ్చిన జునైద్‌ను చూసిన పాదుషా నిర్ఘాంతపోయి తానిచ్చిన ఆ ఉత్తరం ఏమయ్యిందని అడిగారు. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు జునైద్. ఈ మాటలు విన్న పాదుషా నువ్వు మంచి వాడివి కాబట్టే నీ మంచే నిన్ను బతికించింది. పాపానికి ఒడిగట్టిన ఆ మంత్రికి తగిన శాస్తి జరిగిందని చెప్పి జునైద్ కు విలువైన కానుకలు అందించాడు. తోటి వారు సంతోషాల్లో ఉంటే చూసి ఏడ్వడం, బాధల్లో ఉంటే నవ్వడం మనల్ని కష్టాలు పాలు చేస్తుంది. – ముహమ్మద్ ముజాహిద్ -
అవకాశాల కోసం ఎవరినీ అడగను
అవకాశాల కోసం ఎవరినీ అడగనని, అందుకు ఎవరి వద్దా చేతులు కట్టుకుని నిలబడనని అంటోంది నటి ఇలియానా. ఇటీవల ఈ బ్యూటీ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో కెక్కాలన్నది పరిపాటిగా పెట్టుకున్నట్లుంది. ఇంతకు ముందు టాలీవుడ్లో యమ క్రేజీ హీరోయిన్గా రాణించిన ఇలియానా అనూహ్యంగా బాలీవుడ్‌పై దృష్టి సారించింది.దీంతో ఇటు కోలీవుడ్, అటు టాలీవుడ్‌లోనూ అవకాశాలు అడుగంటాయి. ఇక బాలీవుడ్‌లోనూ పరిస్థితి అంతంత మాత్రమే. ఆ మధ్య అక్షయ్‌కుమార్‌కు జంటగా నటించిన రుస్తుం చిత్రం వసూళ్ల వర్షం కురిపించినా ఇలియానాను బాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం అజయ్ దేవ్గన్తో కలిసి బాద్షా అనే ఒక్క చిత్రంలోనే నటిస్తోంది.కాగా మగాడి సంపాదన, ఆడదాని వయసు చెప్పకూడదనే సామెత ఉంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే చెప్పనే అక్కర్లేదు. అలాంటిది ఇటీవల తన అసలు వయసు 30 అంటూ వెల్లడించి అందర్నీ ఆశ్చర్య పరచింది.ఆ విషయంలోనూ భారీ ప్రచారాన్నే పొందిన ఇలియానా తాజాగా ఒక వేదికపై మాట్లాడుతూ తనకు బాలీవుడ్ చిత్రాల్లో నటించడం ఇష్టం అని, అయితే అక్కడ అవకాశాలు రావడం కష్టం అని పేర్కొంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అవే ఉన్నత స్థాయిలో నిలబెడతాయని, లేకపోతే బాలీవుడ్ మొత్తం మనల్ని దూరంగా పెట్టేస్తుందని అంది. అయఇతే అవకాశాలు లేకపోయినా పర్వాలేదు గానీ తాను మాత్రం వాటి కోసం ఎవరిని అడగనని, ఎవరి వద్ద చేతులు కట్టుకుని నిలబడి బతిమలాడనని అంటూ మరో సారి వార్తల్లోకెక్కింది.ఈ విధంగా ఉచిత ప్రచారం పొందాలన్నది ఈ అమ్మడి ట్రిక్కుల్లో ఒక భాగం అనుకుంటా! అనే భావన పరిశ్రమ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. -
'బాద్షా మిస్సింగ్.. జాడ చెబితే 50 వేలు'
వారణాసి: కొందరు బంధుత్వాలకు బానిసలు. ఆ బంధుత్వాలు మనుషులతో బలహీనంగా ఉంటాయేమోగానీ, మూగజీవాలతో అయితే మాత్రం చాలా గాఢంగా ఉంటాయి. ఎందుకంటే తమకు ఇష్టమైన మూగజీవం కనిపించడం లేదని రోజుల తరబడి తిండితిప్పలు మానేసిన సందర్భాలు కోకొల్లలు. వాటికోసం కాలం చేసినవారు లేకపోలేరు. అంత గాఢంగా మూగజీవాలతో అనుబంధం ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని జరిగిన ఈ ఘటన కూడా మూగజీవాలకు మనుషులకు మధ్య ఉన్న ప్రేమ ఏమిటో తెలియజేస్తుంది. తప్పిపోయిన తన ఎద్దును గుర్తించి తిరిగి తమకు అప్పగించిన వారికి రూ.50 వేలు రివార్డును ప్రకటించాడు వారణాసికి చెందిన ఓ వ్యక్తి. వారం రోజులపాటు దానికోసం చెప్పులు అరిగేలా తిరిగి ఆచూకీ కనిపించకపోవడంతో ఇక చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు. ఆ ఎద్దు పోస్టర్లను పలు ప్రాంతాల్లో గోడలకు అంటించి దానిని గుర్తించినవారికి రూ.50 వేలు పారితోషికం ఇవ్వబడుతుందని ప్రకటించాడు. అయితే, కేసును మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్న పోలీసులు ఏ మాత్రం ముందడుగు వేయలేదు. కానీ, సమాజ్‌వాది పార్టీ నేత అజాంఖాన్ బర్రెలు పోయినప్పుడు మాత్రం మొత్తం సీనియర్ పోలీసు పటాలమంతా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. సారనాథ్‌కు చెందిన మనోజ్ కుమార్ పాండే అని వ్యక్తికి ఒక మూడేళ్ల ఎద్దు ఉంది. అది కొంచెం నలుపు, తెలుపు ఎరుపుతో ఉంది. అదంటే అతడికి ఎంతో ప్రేమ కావడంతో చాలా బాగా చూసుకున్నాడు. దీంతో అది చాలా బలిష్టంగా ఆకట్టుకునేలా తయారైంది. దానికి అతడు ముద్దుగా 'బాద్ షా' అని పేరు కూడా పెట్టుకున్నాడు. వారం రోజుల కిందట తన బాద్షా కనిపించకుండా పోయాడు. దీంతో తొలుత తనకు పరిచయం ఉన్న అన్ని చోట్లలో వెతికిన పాండే చివరకు పోలీసులను ఆశ్రయించి రివార్డు కూడా ఇస్తానని ప్రకటన చేశాడు. మరో విచిత్రం ఏమిటంటే వారు భోజనం చేసే ముందు ఆ ఎద్దు కిచెన్‌కు వస్తుందట. తను నిద్రపోయే సమయంలో బెడ్ రూంలోకి వచ్చి పడుకుంటుందని, తన దృష్టిలో అది కేవలం ఎద్దు మాత్రమే కాదని, తమ కుటుంబ సభ్యుడు అని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
దోస్తీ కా బాద్షా
ఇది రంజాన్ మాసం. పవిత్రమైన మాసం. దేవుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించే మాసం. మానవత్వానికి ప్రతిరూపమైన మాసం. ఈ మాసంలో నిష్టగా ఉండేవాడే సచ్చా ముసల్మాన్. ప్రతిమాసం ఈ మాసంలో ఉన్నట్లే ఉండేవాడు... అచ్చా ముసల్మాన్. అహ్మద్ బాషా... మంచితనానికి బాద్షా! లోక కల్యాణం కోసం ఆ ఆంజనేయుడు సంజీవినిని మోసాడంటారు. స్నేహధర్మాన్ని నిలబెట్టడం కోసం బాషా ఈ ఆంజనేయుడినే మోస్తున్నాడు. తండ్రీకొడుకులు, అన్నదమ్ములే విడిపోతున్న ఈ సమాజంలో... స్నేహితుణ్ణి కష్టసుఖాల్లో సమానంగా ఆలింగనం చేసుకుంటున్న అహ్మద్ బాషాను చూస్తుంటే అప్పుడే రంజాన్ వచ్చేసిందా అనిపిస్తుంది! అహ్మద్, ఆంజనేయులకు... దోస్తీ ముబారక్. యథాలాపంగా కాదు గానీ, కాస్త మనసుపెట్టి వీళ్లిద్దరినీ గమనిస్తే ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..’, ‘యే దోస్తీ.. హమ్ నహీ ఛోడేంగే..’ వంటి పాటలు అసంకల్పితంగానే గుర్తుకొస్తాయి. వాళ్లను చూసినప్పుడు అలాంటి పాటలు గుర్తుకు రాకపోతే మాత్రం మనం ఎక్కడో ఆలోచిస్తున్నట్టు లెక్క! ఎందుకంటే, పొడిపొడి పలకరింతల స్నేహాలు.. అవసరార్థ స్నేహాలు.. అనవసరపు స్నేహాలు.. అనివార్య స్నేహాలు.. కాకా స్నేహాలు.. బాకా స్నేహాలు.. ముఖపరిచయ మాత్రపు స్నేహాలు.. ముఖస్తుతి స్నేహాలు.. మొహమాటపు స్నేహాలు.. విందు స్నేహాలు.. మందు స్నేహాలు.. రాజకీయ స్నేహాలు వంటి కల్తీ స్నేహాలే ‘స్నేహం’గా చలామణీ అవుతున్న లోకంలో వాళ్లిద్దరూ స్ఫటికంలాంటి సిసలైన స్నేహంలోని స్వచ్ఛతకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నారు మరి! ఎవరా స్నేహితులు.. ఏమా కథ.. అంటారా..? అక్కడికే వద్దాం.. ప్రకాశం జిల్లా పొదిలిలో ఉంటారు వాళ్లు. పల్లెకు ఎక్కువ, పట్టణానికి తక్కువలాంటి ఊరు అది. ఇద్దరిదీ అదే ఊరు. ఏడేళ్లుగా కొనసాగుతోంది వాళ్ల స్నేహం. అలాగని వాళ్లిద్దరూ చిన్ననాటి క్లాస్మేట్స్ కాదు. ఇద్దరికీ ఎలాంటి బంధుత్వమూ లేదు. ఇద్దరివీ వేర్వేరు మతాలు, వేర్వేరు నేపథ్యాలు. అయితే ఇవేవీ వారి స్నేహానికి అడ్డురాలేదు. పెద్దమసీదు తోట ప్రాంతంలో అహ్మద్ బాషా కుటుంబం ఉంటోంది. బాషా ఇంటికి కాస్త దగ్గర్లోనే ఆంజనేయులు ఇల్లు ఉంది. ఆంజనేయులు వికలాంగుడు. పుట్టిన కొన్ని నెలలకే పోలియో బారిన పడ్డాడు. ఏడో తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు. బాషా ఇంటర్ వరకు చదువుకున్నాడు. తండ్రి మరణించడంతో కుటుంబ భారం మీద పడి, చదువు ఆగిపోయింది. తండ్రి మరణించాక, కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు బేల్దారి పనులకు వెళ్లడం ప్రారంభించాడు బాషా. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసిన తర్వాత, సాయంత్రం వేళ తన స్నేహితులతో కలసి తన ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఒక అరుగుపై కూర్చొని పిచ్చాపాటీ కబుర్లతో కాలక్షేపం చేసేవాడు. వాళ్లు రోజూ కబుర్లు చెప్పుకొనే సమయంలో ఆంజనేయులు తన ఇంటి అరుగుపై ఒంటరిగా కూర్చొని వాళ్లను గమనించేవాడు. ఒకరోజు బాషా స్నేహితులు రాలేదు. అదే సమయంలో ఒంటరిగా కూర్చున్న ఆంజనేయులును గమనించాడు బాషా. ఇద్దరికీ మాటలు కలిశాయి. ఏ ముహూర్తాన వాళ్ల మధ్య మాటలు కలిశాయో గానీ, అనతికాలంలోనే వాళ్లిద్దరూ ప్రాణస్నేహితులుగా మారారు. వికలాంగుడైన ఆంజనేయులు మాటల్లో ఆత్మవిశ్వాసాన్ని గమనించిన బాషాకు అతడిపై అభిమానం పెరిగింది. అప్పటి వరకు తనతో రోజూ కబుర్లతో కాలక్షేపం చేసే స్నేహితులను వదులుకొని ఆంజనేయులుతో అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఏడేళ్లవుతున్నా, వాళ్లిద్దరి మధ్య ఒక్కసారి కూడా ఎలాంటి పొరపొచ్చాలు రాలేదంటే, వాళ్ల మధ్య అనుబంధం ఎంతగా అల్లుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. తమ స్నేహంపై వాళ్లిద్దరూ ఒకరి గురించి మరొకరు పంచుకునే అనుభూతులు కూడా వాళ్ల స్నేహంలాగే స్వచ్ఛంగా, నిష్కల్మషంగా ఉంటాయి. - పచ్చా ఎ.కిషోర్‌బాబు, సాక్షి, ఒంగోలు టౌన్ ఫొటోలు: ఎం.ప్రసాద్, ఒంగోలు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు మా నాన్న పోయాక మానసికంగా కుంగిపోయాను. కొంచెం తేరుకున్నాక మెల్లగా పనుల్లోకి వెళ్లేవాడిని. ఒకసారి ఆరోగ్యం బాగులేక ఐదురోజులు మంచానపడ్డాను. అలా బాధపడుతున్న నన్ను ఆంజనేయులు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. తన మూడు చక్రాల సైకిల్‌పైనే పొదిలి ఆస్పత్రికి తీసుకు వెళ్లి నా పేరు మీద చీటీ రాయించాడు. వైద్యం పొందే వరకు నన్ను విడిచి పెట్టలేదు. నేను పనుల్లోకి వెళ్లేటప్పుడు ఇంటి దగ్గర అమ్మకు ఏ అవసరమైనా వెంటనే సాయం చేసేవాడు. మా స్నేహాన్ని చెడగొట్టడానికి కూడా కొందరు ప్రయత్నించారు. వికలాంగుడితో స్నేహమేంటని గేలిచేశారు. అయితే, వాళ్లే నాకు దూరమయ్యారు. - అహ్మద్ బాషా దేవుడిచ్చిన స్నేహితుడు బాషా నాకు దేవుడిచ్చిన స్నేహితుడు. ఎవరో ఒకరు సాయం చేయనిదే ముందుకు కదల్లేని స్థితిలో ఉన్న నన్ను అనుక్షణం కనిపెట్టుకొని ఉంటాడు. ఉదయాన్నే నిద్ర లేచాక నా మూడు చక్రాల సైకిల్‌పై కూర్చుంటే, బస్టాండ్ వరకు నెట్టుకుంటూ తీసుకువెళతాడు. బస్టాండులో ఇద్దరం చాయ్ తాగి తిరిగి ఇంటికి వస్తాం. ఒకసారి నాకు బాగా జ్వరం వచ్చి, కదల్లేని స్థితిలో ఉంటే, బాషా నన్ను రెండు చేతులతో ఎత్తుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. బాషా లేకుంటే ఆంజనేయులు అనేవాడు ఉండడు. - ఆంజనేయులు -
రాంజీ... రాంజీ రాంజీ... రాంజీ...
లిరిక్ మేజిక్ ‘‘ఈవారం ‘లిరిక్ మేజిక్’ ఏం చేద్దాం’’ అన్నారు క్యాబిన్లోకి వెళ్లగానే మా ఫీచర్స్ ఎడిటర్ రామ్. ఆయనకు కిక్ అంటే ఇష్టం. ఎమోషన్లో కూడా కిక్ ఉండాలి. వట్టి ఉద్వేగపు ప్రాణి. ‘‘బంతిపూల జానకీ జానకీ... నీకంత సిగ్గు దేనికీ దేనికీ... బాద్షా మూవీలోది సార్’’. ‘‘వొద్దొద్దు’’ అన్నారు రామ్. ‘‘ఎక్కుతుంది సార్’’. ‘‘అందుకే వద్దు. వాటిజ్ దట్. ‘కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో’ ఆ పాటలోనే కదా..’’ ‘‘అవున్సార్. థియేటర్ బద్దలైపోయింది. మంచుకొండల్లో కాజల్, జూనియర్ ఎన్టీఆర్ గుంపునేసుకుని పాడతారు’’. ‘‘ఏం చెబుతావు... ఈ పాట గురించి... నా కూతురికి, నా మేనకోడలికి? కొట్టించుకోండి, తిట్టించుకోండి. తాళిబొట్టు కట్టించుకోండి అనా? వేరే పాటల్లేవా రామజోగయ్యశాస్త్రి ఉట్టిలో’’ ‘‘రెండు లైన్లే కదా సార్’’. ‘‘రెండు లైన్లే. పాటంతా అయ్యాక గుర్తుండేదీ ఆ రెండు లైన్లే’’. ‘‘పదాల్లో రిథమ్ ఉంది సార్. చేద్దాం’’ ‘‘నో’’ ‘‘ఏంట్సార్ మీ అబ్జెక్షన్?! ‘‘రిథమ్‌తో లిటరరీ వాల్యూ వస్తుందా మాధవ్? గో టు హెల్ విత్ యువర్ బంతిపూల జానకి’’ ‘‘రిథమ్ కూడా లిరిక్కే సార్. అందులోని మేజిక్ గురించి రాద్దాం’’. ‘‘సరే సావు. ఈ పాట విషయంలో జోగయ్యశాస్త్రిని ఆహా ఓహో అంటే మాత్రం నే ఐటమ్ పెట్ట’’. సాకీ : ఆమె : కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడురో రాంజీ రాంజీ రాంజీ రాంజీ... హాయ్ రాంజీ రాంజీ రాంజీ రాంజీ పల్లవి : అతడు: బంతిపూల జానకీ జానకీ నీకంత సిగ్గు దేనికీ దేనికీ చలో చలో నాతో వచ్చెయ్ అత్తారింటికీ ॥॥ ఆమె: ఆకువక్క సున్న ముంది నోరు పండటానికి ఆడ ఈడు ముందరుంది నీకు చెందడానికి అతడు: ఉట్టిమీద తేనెపట్టు నోటిలోకి జారినట్టు సోకులన్ని పిండుకుంటనే రెండేళ్లయింది ‘బాద్షా’ రిలీజై! ఆ సినిమాలోని ‘‘బంతిపూల జానకి’’... మ్యూజిక్ లవర్ల చెవుల్నించి ఇంకా రిలీజ్ కాలేదు. అక్కడే ఉండిపోయి రిథమిక్‌గా స్టెప్పులు వేస్తూనే ఉంది. ఫ్లష్ అండ్ బ్లడ్ రామజోగయ్య శాస్త్రి ప్రాణం పోసింది ఎస్.ఎస్.థమన్. ప్రాణం తీసింది కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. అమృతం పోసి అప్లిఫ్ట్ చేసింది దలేర్ మెహందీ, రనీనారెడ్డి. (సింగర్స్) సాకీ, పల్లవి... అల్టిమేట్! జోడు గుర్రాల హార్స్ పవర్. తర్వాతి రెండు చరణాలు మాటల ప్రవాహం. తేనె ఊటల తీరని దాహం. సిగ్గుపడకుండా అత్తారింటికి వచ్చేయ్మని హీరో హీరోయిన్ని ప్రతి చరణానికి ముందూ అడుగుతుంటాడు. ఆమె కూడా నాట్ ఈటెన్ లెస్. తక్కువేం తిన్లేదు. అసలు పాట మొదలు పెట్టిందే ఆమె. ఎండ్ చేసిందీ ఆమే! చరణాల మొదలూ తుదీ ఆమెవే. ‘కొట్టినా తిట్టినా..’ అని హీరోయిన్ స్టార్ట్చెయ్యగానే, హీరో ఆలోచన్లు డెరైక్టుగా అత్తారింటికి వెళ్లిపోతాయి. పల్లవిలో ఆమె ఆకు వక్క సున్నం అనగానే బాద్షా ఊహలు ఉట్టిమీది తేనెపట్టులో చిక్కుకుపోతాయి. మొదటి చరణంలో అతడు చెంప గిల్లితే, ఆమె చేప ముల్లై గుచ్చుతుంది. రెండో చరణంలో అతడు ఆమెను జల్లెడ పడితే, ఆమె అతడికి కుర్రకళ్ల కుంపటై సెగపెడుతుంది. పదాలకు దారాలు కట్టి వాటి చివర్లకు హీరోహీరోయిన్లను కట్టి రిథమిక్‌గా ఆడించారు రామజోగయ్య. సంకురాత్రి కోడి అంటాడు, శంకుమార్కు లుంగీ అంటాడు. పాలమీగడ అంటాడు. కంచిపట్టు పావడా అంటాడు. మందారం అంటాడు. బంగారం అంటాడు. కాజల్ ఒంటినీ, బాద్షా కంటినీ రిప్రెజెంట్ చేస్తూ రామజోగయ్య రాసుకుపోయాడు. యూత్ పురాణాన్ని స్మూత్‌గా రక్తి కట్టించాడు. ఇది ఆయనకు కాంప్లిమెంట్ కాకపోవచ్చు. కానీ రిథమ్‌కి ఆయనిచ్చిన లిటరరీ స్టేటస్ ఇది. నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ (ఖలేజా), దేవదేవం భజే దివ్య ప్రభావం (అత్తారింటికి దారేది), నీ పదముల ప్రభవించిన గంగా యమున (శిరిడిసాయి) లాంటి పాటలు రాసిన రామజోగయ్యశాస్త్రిని ఈ పాట రాసినందుకు మా ఫీచర్స్ ఎడిటర్ క్షమించేయొచ్చు. -
బాలీల్యాండ్
ఎంటీవీ ‘బాలీల్యాండ్ సిటీ కన్సర్ట్’ మ్యూజిక్‌తో షేక్ చేసింది. బాలీవుడ్ గాయకులు మికాసింగ్, బాద్షా, కనికాకపూర్, ఆకృతిల గానం.. డీజేలు చేతస్, ఎన్వైకేలు రాకింగ్ మ్యూజిక్ బీట్స్.. ఆహూతులను కుర్చీల్లో కూర్చోనివ్వలేదు. మాదాపూర్ నోవాటెల్‌లో శుక్రవారం జరిగిన ఈ మెగా ఈవెంట్ సిటీజనులకు వీనుల విందు చేసింది. ఆరేళ్ల నుంచే... ‘ఆరేళ్ల నుంచే క్లాసికల్ మ్యూజిక్ ప్రాక్టీసు మొదలెట్టా. చదువు పూర్తయిన తర్వాత లండన్‌కు వెళ్లా. ప్లే బ్యాక్ సింగర్ కావడానికి ముందు యూరప్‌లో మోడలింగ్ చేశా. 2012లో జగ్ని జీ పాట పాడా. రాగిని ఎంఎంఎస్2లో పాడిన బేబీ డాల్ పాట నాకు బంపర్ అవకాశాలు తీసుకొచ్చింది. షారుఖ్‌ఖాన్ నటించిన హ్యపీ న్యూ ఇయర్ సినిమాలో పాడే లక్కీ చాన్స్ కొట్టేశా. హైదరాబాదీలు మ్యూజిక్‌ను సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు’ అని పంజాబీ ఫోక్ సింగర్ కనికాకపూర్ ‘సిటీప్లస్’తో చెప్పారు. పాత, కొత్త తరం సంగీతాన్ని మిక్స్‌చేసే బాణీల్లో ఉండే మజానే వేరని మికాసింగ్ అన్నారు. ఇక్కడి వంటలు బాగా ఇష్టమన్నారు. వీఎస్ -
రాకుమారుడిలాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలి!
‘‘నాకు చదువు అంటే పెద్ద ఆసక్తి లేదు. అయితే అల్లరి మాత్రం చాలా బాగా చేస్తాను. నాకు రాకుమారుడులాంటి బాయ్‌ఫ్రెండ్ కావాలని ఉంది. అయ్యో... ఇదంతా నా పర్సనల్ అనుకునేరు. ‘నా రాకుమారుడు’ సినిమాలో నేను పోషించిన బిందు పాత్ర తీరు తెన్నులివి’’ అని నవ్వుతూ చెప్పారు రీతూవర్మ. నవీన్‌చంద్ర, రీతూవర్మ జంటగా సత్య దర్శకత్వంలో హరివిల్లు క్రియేషన్స్ పతాకంపై వజ్రంగ్ నిర్మించిన ‘నా రాకుమారుడు’ రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రీతూవర్మ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘నేను పుట్టింది నార్త్‌లో. పెరిగింది... చదివింది హైదరాబాద్‌లో. ‘అనుకోకుండా’ అనే లఘు చిత్రంలో తొలుత నటించాను. ఆ తర్వాత ‘బాద్షా’లో కాజల్ అగర్వాల్ చెల్లెలుగా యాక్ట్ చేశాను. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో నా పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. ‘నా రాకుమారుడు’ నాకు మంచి బ్రేక్ ఇస్తుందని నమ్ముతున్నాను. అందుకే విడుదలయ్యే వరకూ కొత్త సినిమాలు కమిట్ కావడం లేదు. దర్శకుడు సత్య నా పాత్రను బాగా డిజైన్ చేశాడు’’ అని చెప్పారు. -
జపనీస్ భాషలో ఎన్టీఆర్ సినిమా
జపాన్ తెరపై త్వరలో ఎన్టీఆర్‌ను చూడొచ్చును. అంటే ఎన్టీఆర్ జపనీస్ భాషలో సినిమా చేస్తున్నారా అని అనుకోవద్దు. ఆయన నటించిన ‘బాద్షా’ సినిమా జపనీస్ భాషలోకి అనువాదమవుతోంది. జపాన్‌లో రజనీకాంత్‌కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అక్కడ రజనీ సినిమాలను బాగా ఆదరిస్తారు. జపాన్‌లో రజనీకి ప్రత్యేకంగా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే - మన తెలుగు హీరోల సినిమాలు ఇంతవరకూ జపనీస్ భాషలో అనువాదమైన దాఖలాలు లేవు! ఇప్పుడిప్పుడే అక్కడ ఎన్టీఆర్ పట్ల ఓ క్రేజ్ మొదలైందట. ఎన్టీఆర్ డాన్సులు అక్కడి యూత్‌ని బాగా ఆకట్టుకుంటున్నాయట. ఈ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకునే అక్కడి నేషనల్ చానల్ అయిన ఫుజీ టీవీ ఎన్టీఆర్‌పై 2011లో ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. పుజీ టీవీ బృందం హైదరాబాద్‌కు ప్రత్యేకంగా విచ్చేసి, ఎన్టీఆర్‌ని ఇంటర్వ్యూ కూడా చేశారు. తాజాగా జపాన్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ ‘బాద్షా’ను జపనీస్ భాషలో అనువదించడానికి హక్కులు తీసుకుంది. సింహాద్రి, యమదొంగ, స్టూడెంట్ నెం.1 చిత్రాలను కూడా జపనీస్ భాషలోకి డబ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే మే, జూన్‌ల్లో జపాన్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్‌కి ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా పిలవబోతున్నారట.