
ముంబై: అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో ఆరో జట్టుగా ముంబై చేరింది. ప్రముఖ గాయకుడు బాద్‌షా, బాలీవుడ్ సినీ నిర్మాత, వ్యాపారవేత్త పునీత్ బాలన్ ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ ఏడాది చివర్లో అల్టిమేట్ ఖో ఖో లీగ్ జరగనుంది. ‘మా అమ్మ కాలేజీ రోజుల్లో ఖో ఖో ఆడేది. ఆటపై ఇష్టం, వ్యక్తిగత అనుబంధం నన్ను ఖో ఖో లీగ్‌లో భాగమయ్యేలా చేసింది’ అని తొలిసారి క్రీడల్లో పెట్టుబడి పెడుతున్న బాద్‌షా అన్నాడు.
బాలన్ గ్రూప్ అధినేత పునీత్ బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, హ్యాండ్‌బాల్ లీగ్‌లలోనూ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. ఇప్పటికే అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో అదానీ గ్రూప్, జీఎంఆర్ గ్రూప్, కాప్రి గ్లోబల్, కేఎల్‌ఓ స్పోర్ట్స్ వివిధ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి.
చదవండి: Elorda Cup 2022: సిమ్రన్‌జిత్ శుభారంభం..!
Comments
Please login to add a commentAdd a comment