ఇద్దరు సెలబ్రిటీలు ఒకచోట కనిపిస్తే చాలు లవ్ అని పేరు పెట్టేస్తున్నారు. డేటింగ్ అంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఓసారి ఈ రూమర్స్ బారిన పడినవారే! ఆ మధ్య బాద్‌షా హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌తో కనిపించగా సమ్‌థింగ్..సమ్‌థింగ్.. ఏదో జరుగుతోందని వెంటపడ్డారు. అలాంటిదేమీ లేదండీ బాబు అని బాద్‌షా స్వయంగా చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. పాకిస్తాన్ నటి హనియా ఆమిర్‌తోనూ బాద్‌షాను లింక్ చేశారు. వీరిద్దరూ ఒకరి పోస్టుకు మరొకరు రిప్లై ఇస్తుంటారు. దుబాయ్‌లోనూ కలుసుకోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది.
పార్టీ చేసుకున్నాం..
తాజాగా తన డేటింగ్ రూమర్‌పై హనియా స్పందించింది. బాద్‌షా పాటలంటే నాకు ఇష్టం. అతడు నా ఫ్రెండ్. తనతో కలిసి పార్టీ చేసుకున్నదానికి రిలేషన్‌షిప్‌లో ఉన్నామని అతిగా ఊహించుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నేను పెళ్లి చేసుకోకపోవడమే పెద్ద సమస్య అనుకుంటా.. వైవాహిక జీవితం మొదలుపెట్టి ఉంటే ఇలాంటి రూమర్లకు దూరంగా ఉండేదాన్ని.
ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్
బాద్‌షాతో నా స్నేహం ఎలా మొదలైందంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చేసిన రీల్‌కు అతడు కామెంట్ పెట్టాడు. అది నా ఫ్రెండ్ చూసి బాద్‌షా కామెంట్ చేశాడంది. ఏంటి, నిజమా? అని ఆశ్చర్యపోయాను. తను నాకు డైరెక్ట్‌గా కూడా మెసేజ్ చేశాడు. అలా ఇద్దరం మాట్లాడుకున్నాం. తను చాలా మంచి వ్యక్తి. నేనెప్పుడైనా బాధలో ఉండి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోతే.. ఏమైంది? అంతా ఓకేనా? ఏం జరుగుతోంది? అని ఆరా తీస్తుంటాడు. బాద్‌షా నాకు దొరికిన గొప్ప మిత్రుడు అని హనియా చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment