పార్టీలో మెరిసిన సీతారామం బ్యూటీ.. అతనితో డేటింగ్ నిజమేనా! | Mrunal Thakur Badshah Spark Dating Rumours After They Hold Hands At Diwali Party, See Netizens Reactions - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: పార్టీలో మెరిసిన మృణాల్ ఠాకూర్.. అతనితో డేటింగ్ రూమర్స్!

Published Mon, Nov 13 2023 4:16 PM | Last Updated on Mon, Nov 13 2023 5:04 PM

Mrunal Thakur Badshah spark dating rumours hold hands at Diwali party - Sakshi

సీతారామం సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాకుండా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్‌ అయిన పిప్పా అనే హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్ తాజాగా ముంబయిలో తళుక్కున మెరిసింది. శిల్పాశెట్టి నిర్వహించిన దివాళీ బాష్‌లో సందడి చేసింది.

అయితే శిల్పాశెట్టి పార్టీకి హాజరైన మృణాల్ ఠాకూర్, బాలీవుడ్ ర్యాపర్‌ బాద్‌షాతో కలిసి జంటగా కనిపించింది. అంతే కాకుండా అతని చేతిలో చేయి పట్టుకుని కనిపించడంతో సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. మృణాల్‌ అతనితో డేటింగ్‌లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్, అతనితో కలిసి ఓకే కారులో వెళ్లడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. 

ఓ నెటిజన్ రాస్తూ.. " మృణాల్,  బాద్‌షా డేటింగ్‌లో ఉన్నారా? అంటూ కామెంట్ చేయగా.. మరొకరు 'వీరిని జంటగా నేను ఊహించలేదు ... వావ్ " అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ..'అతను ఇప్పటికే పెళ్లయినట్లు కనిపిస్తున్నారంటూ' కామెంట్ చేశాడు. ఓ నెటిజన్ ఏకంగా 'ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది' అంటూ రాసుకొచ్చారు. అయితే కొందరేమో ఈ జోడీ సెట్ కాలేదంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఇటీవలే టాలీవుడ్‌ హీరోను పెళ్లి చేసుకోనుందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement