మృణాల్‌తో డేటింగ్ వార్తలు.. స్పందించిన బాద్‌షా! | Badshah Shares Cryptic Post Amid Dating Rumours With Mrunal Thakur | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: మృణాల్‌తో డేటింగ్ వార్తలు.. స్పందించిన బాద్‌షా!

Published Tue, Nov 14 2023 12:38 PM | Last Updated on Tue, Nov 14 2023 12:50 PM

Badshah Shares Cryptic Post Amid Dating Rumours With Mrunal Thakur - Sakshi

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతోంది. గతంలోనే ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. తాజాగా మరోసారి మృణాల్ డేటింగ్‌లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీనికి ప్రధాన కారణం ముంబయిలో జరిగిన శిల్పాశెట్టి దివాళీ బాష్‌కు హాజరవ్వడమే. పార్టీకి హాజరైన ముద్దుగుమ్మ ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్‌షాతో సన్నిహితంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారా నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

తాజాగా నెట్టింట వైరలవుతున్న మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్ రూమర్స్‌పై ర్యాపర్‌ బాద్‌షా స్పందించారు.  ‘మిమ్మల్ని నిరాశపరిచినందుకు నన్ను క్షమించండి. మీరు అనుకుంటున్నట్లు అలాంటిదేం లేదు' అంటూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అయితే వీరిద్దరి వస్తున్న రూమర్స్‌ గురించే ఈ పోస్ట్ పెట్టాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీపావళి బాష్‌లో రాపర్ బాద్షా, మృణాల్ ఠాకూర్ చేయి  పట్టుకుని నడుస్తూ వీడియోలో కనిపించారు. కాగా. మృణాల్ ఇటీవలే ఇషాన్ ఖట్టర్‌తో కలిసి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన 'పిప్పా'లో కనిపించింది. బ్రిగేడియర్ బలరామ్ సింగ్ మెహతా రచించిన 'ది బర్నింగ్ ఛాఫీస్' పుస్తకం ఆధారంగా రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్‌లో నవంబర్‌ 10న విడుదలైన ఈ మూవీకి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంషు పైన్యులి, సోని రజ్దాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లోనూ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటిస్తోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement