Is Hrithik Roshan and Saba Azad Dating Insider Reveals Deets on Relationship - Sakshi
Sakshi News home page

Hrithik Roshan: యంగ్‌ హీరోయిన్‌తో హృతిక్‌ సీక్రెట్‌ డేటింగ్‌.. వీడియో వైరల్‌

Published Tue, Feb 1 2022 7:17 PM | Last Updated on Tue, Feb 1 2022 8:07 PM

Is Hrithik Roshan And Saba Azad Dating Insider Reveals Deets On Relationship - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌, ఓ యంగ్‌ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు కొద్ది రోజులుగా బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు నటి సబా ఆజాద్‌. విరిద్దరు తరచూ కలుసుకోవడం, సన్నిహితంగా మెలగడంతో హృతిక్‌, సబాలు మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ నడుస్తోందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇటీవల ముంబైలో వీరిద్దరూ డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో హృతిక్‌ ఆమె చేయి పట్టుకుని బయటకు వస్తూ కనిపించాడు. ఇదిలా ఉంటే హృతిక్‌ మాజీ భార్య సుశానే ఖాన్‌ నటుడు అర్స్లాన్ గోనితో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపస్తున్నాయి.

ఈ క్రమంలో హృతిక్‌, సబాల రిలేషన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. సబా, హృతిక్‌ను జంటగా చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. హృతిక్‌ మళ్లి డేటింగ్‌లో ఉన్నాడా? అంటూ అభిప్రాయం వ్య​క్తం చేస్తున్నారు. అంతేకాదు సుశానేతో విడాకులు అనంతరం హృతిక్‌ లైఫ్‌లో మూవ్‌ ఆన్‌ అయ్యాడని, వీరిద్దరిని ఇలా చూస్తే ఆమె కుళ్లు కోవడం ఖాయమంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే అసలు సబా, హృతిక్‌ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, వారిద్దరు డిన్నర్‌ డేట్‌కు వెళ్లడం వెనక అసలు కారణం బయటకు వచ్చింది. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా హృతిక్‌, సబాలు కలిశారట. అప్పటి నుంచి వీరిద్దరూ క్లోజ్‌గా ఉంటున్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం.  

అంతేకాదు తరచూ వీరిద్దరూ కలుసుకుంటుంటారట. సబా ఓ ఇండి మ్యూజిషియన్‌ అని, తనకు ఓ బ్యాండ్‌ కూడా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరి పరిచయం తర్వాత హృతిక్‌ తన మ్యూజిక్‌ను బాగా ఇష్టపడుతున్నాడట. ఈ క్రమంలోనే సబాను తరచూ కలుస్తుంటాడని, అంతేకాదు వీరిద్దరూ కలిసి వర్క్‌ చేయాలనే అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వర్క్‌ గురించి చర్చించేందుకే వారిద్దరు కలిసి డిన్నర్‌ డేట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా సబా 2008లో ‘దిల్‌ కబడ్డి’ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తాజా ఆమె ‘రాకేట్‌ బాయ్స్‌’లో నటించింది. ఇది త్వరలోనే సోని లైవ్‌లో రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement