kho kho tournament
-
తెలుగు యోధాస్‌కు షాక్.. ఉత్కంఠ పోరులో చెన్నై క్విక్ గన్స్ గెలుపు
అల్టిమేట్ ఖో ఖో ఆరంభ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు యోధాస్ 'వి'జైత్రయాత్ర యాత్రకు అడ్డుకట్ట పడింది. తమిళ తంబిల జట్టు చెన్నై క్విక్ గన్స్.. తెలుగు యోధాస్‌కు ఓటమిని పరిచయం చేసింది. తద్వారా తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఎడిషన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. Even-steven at the half-time mark 😱Another screamer on the cards? Let's find out in the second half 👊#TYvCQG #UltimateKhoKho #IndiaMaarChalaang #AbKhoHoga #KhoKho pic.twitter.com/kh4t4QxCN5— Ultimate Kho Kho (@ultimatekhokho) August 17, 2022 తొలి మ్యాచ్‌లో చెన్నై క్విక్ గన్స్ , రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ వారియర్స్‌ను ఓడించి జోరుమీదున్న తెలుగు యోధాస్.. బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో క్విక్ గన్స్ చేతిలో 46-52 తేడాతో ఓటమిపాలైంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి అర్ధభాగంలో ఇరు జట్లు సమాన పాయింట్ల (25-25)తో ఉన్నప్పటికీ.. సెకెండ్ హాఫ్‌లో క్విక్ గన్స్ పుంజుకుని అద్భుత విజయం సాధించింది. ఈ ఓటమితో ఆరు జట్లు పాల్గొంటున్న టోర్నీలో తెలుగు యోధాస్ రెండో స్థానానికి పడిపోగా.. ఎడిషన్‌లో తొలి విజయం సాధించిన క్విక్ గన్స్ నాలుగో ప్లేస్‌కు ఎగబాకింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 66-48తో ముంబై ఖిలాడీస్పై నెగ్గి, యోధాస్‌ను వెనక్కునెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండగా.. ఒడిషా, ముంబై జట్లు 3, 5 ప్లేస్ల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ (ఆగస్ట్ 18) జరిగే మ్యాచ్‌ల్లో రాజస్థాన్ వారియర్స్‌తో ఒడిశా జాగర్‌నట్స్, చెన్నై క్విక్ గన్స్‌తో ముంబై ఖిలాడీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు సోనీ టెన్, సోనీ టెన్ 4 (తెలుగు కామెంట్రీ)లో ఛానల్లలో రాత్రి 7.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. చదవండి: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తెలుగు యోధాస్ గెలుపు -
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తెలుగు యోధాస్ గెలుపు
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 68–47 పాయింట్ల తేడాతో రాజస్తాన్ వారియర్స్‌ను ఓడించింది. ఆదర్శ్ మొహితే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ మూడు నిమిషాల 43 సెకన్లు ఫీల్డ్‌లో గడిపి... ఆ తర్వాత 10 పాయింట్లు కూడా స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 54–49తో జగర్‌నట్స్ ఒడిషా జట్టుపై గెలిచింది. -
Ultimate Kho Kho: సీకేదిన్నె టు చెన్నై.. ఖోఖో చిరుతకు బంపర్ ఛాన్స్!
ఆటలెందుకురా.. చదువుకో అన్న వారు ఉన్నారు.. అవకాశాలు రావడం లేదు.. ఇక ఆటలు ఆపేసేయ్ అని కుటుంబ సభ్యులు అన్నారు.. అయినా మొక్కవోని పట్టుదల, నిరంతరం శ్రమించే తత్వం.. కళ్లముందు తల్లిదండ్రుల పేదరికం.. వెరసి కోచ్ మార్గదర్శనంలో రాటుదేలాడు కాట్ల రామ్మోహన్.. ఖోఖో క్రీడను ప్రాణంగా భావించి సాధన చేస్తున్న పేదింటి బిడ్డకు పెద్ద అవకాశం లభించింది. అల్టిమేట్ ఖోఖో లీగ్ పోటీల్లో చెన్నై క్విక్‌గన్స్ జట్టు రూ. 2లక్షలు వెచ్చించి రామ్మోహన్‌ను కొనుగోలు చేసింది. చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన ఖోఖో క్విక్‌గన్ రామ్మోహన్‌పై ప్రత్యేక కథనం.. కడప స్పోర్ట్స్: చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లెలోని ఎస్.వి.ఎయిడెడ్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ శిక్షణలో ఓనమాలు దిద్దుకున్న రామ్మోహన్ ఖోఖో క్రీడలో జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. మండల పరిధిలోని ఆర్.టి.పల్లెకు చెందిన సాధారణ రైతుకూలీ కె. రాముడు, బాలసిద్ధమ్మల కుమారుడైన కట్లా రామ్మోహన్ బయనపల్లెలోని ఎస్.వి. హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇక్కడే ఖోఖోలో ఓనమాలు నేర్చుకుని జాతీయస్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం బాపట్ల జిల్లా ఇనకొల్లులోని డి.సి.ఆర్.ఎం.కళాశాలలో డిగ్రీ చదువుకుంటూ జె.పంగలూరులోని ఎస్.ఎస్.ఆర్. ఖోఖో అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఛేజింగ్, రన్నింగ్‌లో ప్రత్యేకత చాటుతూ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎస్జీఎఫ్ మొదలు జూనియర్స్, సీనియర్స్, ఖేలో ఇండియా ఇలా అన్ని విభాగాల్లో జాతీయస్థాయిలో పతకాలు సాధించి ఖోఖో చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరుచుకుని, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడీ యువ క్రీడాకారుడు. చెన్నై క్విక్‌గన్స్ జట్టుకు.. క్రికెట్ ప్రీమియర్‌లీగ్, బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్, ప్రొ కబడ్డీ లీగ్ వలనే ఖోఖో క్రీడలో సైతం అల్టిమేట్ ఖోఖో పేరుతో లీగ్ పోటీలను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఈనెల 14, 15 తేదీల్లో పుణేలోని ఛత్రపతి స్పోర్ట్స్‌హబ్‌లో తొలిసీజన్లో దేశవ్యాప్తంగా 6 ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసి క్రీడాకారులను కొనుగోలు చేశారు. ఇందులో చెన్నై క్విక్‌గన్స్ ఫ్రాంచైజీ రామ్మోహన్‌ను రూ. 2లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించనున్న అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో చెన్నై క్విక్‌గన్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇతడికి చక్కటి అవకాశం లభించడం పట్ల జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి, కార్యదర్శి నరేంద్ర, ఎస్.వి.ఎయిడెడ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు దీన్‌దయాళ్, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎం.పవన్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. రామ్మోహన్ ఘనత ►2015లో చత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన అండర్–14 జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం ►2017లో 63వ ఎస్జీఎఫ్ అండర్–17 నేషనల్స్‌లో గోల్డ్‌మెడల్ ►2018లో ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా అండర్–17 నేషనల్స్‌లో కాంస్యపతకం ►2019లో పూణేలో నిర్వహించిన ఖేలో ఇండియా అండర్–17 నేషనల్స్‌లో రజతపతకం ►2019లో గుజరాత్లో నిర్వహించిన జూనియర్ నేషనల్స్‌లో కాంస్యపతకం ►2020లో అస్సాంలో నిర్వహించిన ఖేలోఇండియా అండర్–17 నేషనల్స్‌లో ప్రాతినిధ్యం ►2021లో వరంగల్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్స్ (సౌత్‌జోన్)లో కాంస్యపతకం ►2021లో మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్స్‌తో ప్రాతినిధ్యం చదవండి: Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్ సేనకు భారీ షాక్! ఆలస్యంగా వెలుగులోకి.. Shikhar Dhawan: ఆ ముగ్గురు అద్భుతం చేశారు.. అలాంటి పొరపాట్లు సహజం.. ఆవేశ్ సైతం! -
ఖో ఖో లీగ్‌లో ఆరో జట్టుగా ముంబై
ముంబై: అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో ఆరో జట్టుగా ముంబై చేరింది. ప్రముఖ గాయకుడు బాద్షా, బాలీవుడ్ సినీ నిర్మాత, వ్యాపారవేత్త పునీత్ బాలన్ ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. ఈ ఏడాది చివర్లో అల్టిమేట్ ఖో ఖో లీగ్ జరగనుంది. ‘మా అమ్మ కాలేజీ రోజుల్లో ఖో ఖో ఆడేది. ఆటపై ఇష్టం, వ్యక్తిగత అనుబంధం నన్ను ఖో ఖో లీగ్‌లో భాగమయ్యేలా చేసింది’ అని తొలిసారి క్రీడల్లో పెట్టుబడి పెడుతున్న బాద్షా అన్నాడు. బాలన్ గ్రూప్ అధినేత పునీత్ బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, హ్యాండ్‌బాల్ లీగ్‌లలోనూ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశారు. ఇప్పటికే అల్టిమేట్ ఖో ఖో లీగ్‌లో అదానీ గ్రూప్, జీఎంఆర్ గ్రూప్, కాప్రి గ్లోబల్, కేఎల్ఓ స్పోర్ట్స్ వివిధ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి. చదవండి: Elorda Cup 2022: సిమ్రన్‌జిత్ శుభారంభం..! -
రంగారెడ్డి ఖో–ఖో జట్ల డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య (ఎస్జీఎఫ్) అండర్–19 ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జిల్లా జట్లు డబుల్ ధమాకా సాధించాయి. బాలబాలికల విభాగాల్లో విజేతగా నిలిచాయి. సరూర్ నగర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన బాలుర ఫైనల్లో రంగారెడ్డి జట్టు 10–6తో వరంగల్‌పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డి 12–6తో ఆదిలాబాద్‌పై, వరంగల్ జట్టు 6–4తో ఖమ్మంపై గెలుపొందాయి. బాలికల తుదిపోరులో రంగారెడ్డి 4–2తో మహబూబ్‌నగర్ జట్టుపై నెగ్గింది. సెమీఫైనల్లో రంగారెడ్డి అమ్మాయిలు 6–2తో కరీంనగర్ జట్టుపై, మహబూబ్‌నగర్ 8–3తో వరంగల్‌పై విజయం సాధించాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు బాలబాలికల జట్లకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. -
ఖోఖో రాష్ట్ర జట్ల ఎంపిక
పంగులూరు : ఖోఖో 18 సంవత్సరాల విభాగంలో రాష్ట్ర బాలబాలికల జట్లను స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో బుధవారం ఎంపిక చేశారు. ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ఖోఖో క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికలు 30 మంది పాల్గొనగా, వారిలో 12 మందిని, బాలురు 40 మంది రాగా, వారిలో 12 మందిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన జట్లు శుక్ర, శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే 22వ జాతీయస్థాయి దక్షిణాది రాష్ట్రాల బాలబాలికల 18 సంవత్సరాల విభాగం ఖోఖో పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. ఎంపికైన జట్లను లాయర్ మేకల ఉషారెడ్డి పరిచయం చేసుకున్నారు. పోటీల్లో ప్రతిభ చూపి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాలుర జట్టుకు కోచ్‌గా ఎన్.ఆవులయ్య (ఐవీఎస్), కె.రామారావు (పీఈటీ) మేనేజర్‌గా వ్యవహరిస్తారు. బాలికల జట్టుకు కోచ్‌గా పి.నరసింహారెడ్డి (ఐవీఐఎస్), మేనేజర్‌గా ఎం.అనిల్‌కుమార్ వ్యవహరిస్తారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి, పీఈటీ హనుమంతరావు, మురళీకృష్ణ, రత్తయ్య, లక్ష్మణరావు, జవహర్‌బాబు పాల్గొన్నారు. బాలుర జట్టు క్రీడాకారులు వీరే... కె.స్వామినాథన్(ప్రకాశం), డి.వంశీ (ప్రకాశం), ఎల్.అప్పలనాయుడు (వెస్ట్ గోదావరి), ఎస్.రాజేష్ (ఈస్ట్ గోదావరి), వై.డాల్ నాయుడు (క్రిష్ణా), పి.అప్పలరాజు (విజయనగరం), డి.కిరీటి (వైజాగ్), టి.శివతలుపులు (వైజాగ్), టి.ప్రేమ్‌కుమార్ (చిత్తూరు), వి.రాజశేఖర్ (అనంతపురం), పి.శివక్రిష్ణ (కడప), ఎన్.జయక్రిష్ణా (నెల్లూరు). బాలికల జట్టు... కె.ప్రత్యూషా (ప్రకాశం), సీహెచ్ ఈశ్వరమ్మ (శ్రీకాకుళం), పి.ప్రియాంక (విజయనగరం), ప్రదీపిక (వైజాగ్), కె.శ్యామల (ఈస్ట్ గోదావరి), ఎం.విజయశ్రీ (వెస్ట్ గోదావరి), టి.ఝాన్సీ (క్రిష్ణా), ఐ.పద్మా (గుంటూరు), వై.ప్రసన్న (నెల్లూరు), పి.చరితా (చిత్తూరు), ఐ.శివహర్షిత (కర్నూలు). -
కేజీపీ స్కూల్‌కు టైటిల్
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా జూనియర్ ఖో- ఖో టోర్నమెంట్లో కేజీపీ రెసిడెన్షియల్ స్కూల్ చాంపియన్‌గా నిలిచింది. సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం జరిగిన బాలికల ఫైనల్లో కేజీపీ రెసిడెన్షియల్ స్కూల్ (కుల్కచర్ల) 8-4తో జెడ్పీహెచ్ఎస్, తూముకుంటపై గెలుపొంది టైటిల్‌ను కై వసం చేసుకుంది. కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ (బాచుపల్లి), జెడ్పీహెచ్ఎస్ (దశంపల్లి) జట్లు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. బాలుర విభాగంలో జెడ్పీహెచ్ఎస్ (తూముకుంట) టైటిల్‌ను గెల్చుకోగా... తుక్కుగూడ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో తూముకుంట స్కూల్ 10-9తో తుక్కుగూడ జట్టును ఓడించింది. టీటీడబ్ల్యుఆర్ఎస్ (కుల్కచర్ల), కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ (బాచుపల్లి) జట్లు మూడు, నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో చైతన్యపురి కార్పొరేటర్ విఠల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఖో-ఖో సంఘం కార్యదర్శి కె. రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి జయప్రకాశ్ పాల్గొన్నారు.