అల్టిమేట్ ఖో ఖో ఆరంభ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు యోధాస్ 'వి'జైత్రయాత్ర యాత్రకు అడ్డుకట్ట పడింది. తమిళ తంబిల జట్టు చెన్నై క్విక్ గన్స్.. తెలుగు యోధాస్‌కు ఓటమిని పరిచయం చేసింది. తద్వారా తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఎడిషన్ తొలి విజయాన్ని నమోదు చేసింది.
Even-steven at the half-time mark 😱
— Ultimate Kho Kho (@ultimatekhokho) August 17, 2022
Another screamer on the cards? Let's find out in the second half 👊#TYvCQG #UltimateKhoKho #IndiaMaarChalaang #AbKhoHoga #KhoKho pic.twitter.com/kh4t4QxCN5
తొలి మ్యాచ్‌లో చెన్నై క్విక్ గన్స్ , రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ వారియర్స్‌ను ఓడించి జోరుమీదున్న తెలుగు యోధాస్.. బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో క్విక్ గన్స్ చేతిలో 46-52 తేడాతో ఓటమిపాలైంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి అర్ధభాగంలో ఇరు జట్లు సమాన పాయింట్ల (25-25)తో ఉన్నప్పటికీ.. సెకెండ్ హాఫ్‌లో క్విక్ గన్స్ పుంజుకుని అద్భుత విజయం సాధించింది. ఈ ఓటమితో ఆరు జట్లు పాల్గొంటున్న టోర్నీలో తెలుగు యోధాస్ రెండో స్థానానికి పడిపోగా.. ఎడిషన్‌లో తొలి విజయం సాధించిన క్విక్ గన్స్ నాలుగో ప్లేస్‌కు ఎగబాకింది.
మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 66-48తో ముంబై ఖిలాడీస్‌పై నెగ్గి, యోధాస్‌ను వెనక్కునెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండగా.. ఒడిషా, ముంబై జట్లు 3, 5 ప్లేస్‌ల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ (ఆగస్ట్ 18) జరిగే మ్యాచ్‌ల్లో రాజస్థాన్ వారియర్స్‌తో ఒడిశా జాగర్‌నట్స్, చెన్నై క్విక్ గన్స్‌తో ముంబై ఖిలాడీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు సోనీ టెన్, సోనీ టెన్ 4 (తెలుగు కామెంట్రీ)లో ఛానల్‌లలో రాత్రి 7.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
చదవండి: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తెలుగు యోధాస్ గెలుపు
Comments
Please login to add a commentAdd a comment