
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 68–47 పాయింట్ల తేడాతో రాజస్తాన్ వారియర్స్‌ను ఓడించింది. ఆదర్శ్ మొహితే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ మూడు నిమిషాల 43 సెకన్లు ఫీల్డ్‌లో గడిపి... ఆ తర్వాత 10 పాయింట్లు కూడా స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 54–49తో జగర్‌నట్స్ ఒడిషా జట్టుపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment