kho kho team
-
తెలుగు యోధాస్‌కు షాక్.. ఉత్కంఠ పోరులో చెన్నై క్విక్ గన్స్ గెలుపు
అల్టిమేట్ ఖో ఖో ఆరంభ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు యోధాస్ 'వి'జైత్రయాత్ర యాత్రకు అడ్డుకట్ట పడింది. తమిళ తంబిల జట్టు చెన్నై క్విక్ గన్స్.. తెలుగు యోధాస్‌కు ఓటమిని పరిచయం చేసింది. తద్వారా తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఎడిషన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. Even-steven at the half-time mark 😱Another screamer on the cards? Let's find out in the second half 👊#TYvCQG #UltimateKhoKho #IndiaMaarChalaang #AbKhoHoga #KhoKho pic.twitter.com/kh4t4QxCN5— Ultimate Kho Kho (@ultimatekhokho) August 17, 2022 తొలి మ్యాచ్‌లో చెన్నై క్విక్ గన్స్ , రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ వారియర్స్‌ను ఓడించి జోరుమీదున్న తెలుగు యోధాస్.. బుధవారం జరిగిన ఉత్కంఠ పోరులో క్విక్ గన్స్ చేతిలో 46-52 తేడాతో ఓటమిపాలైంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన తొలి అర్ధభాగంలో ఇరు జట్లు సమాన పాయింట్ల (25-25)తో ఉన్నప్పటికీ.. సెకెండ్ హాఫ్‌లో క్విక్ గన్స్ పుంజుకుని అద్భుత విజయం సాధించింది. ఈ ఓటమితో ఆరు జట్లు పాల్గొంటున్న టోర్నీలో తెలుగు యోధాస్ రెండో స్థానానికి పడిపోగా.. ఎడిషన్‌లో తొలి విజయం సాధించిన క్విక్ గన్స్ నాలుగో ప్లేస్‌కు ఎగబాకింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 66-48తో ముంబై ఖిలాడీస్పై నెగ్గి, యోధాస్‌ను వెనక్కునెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉండగా.. ఒడిషా, ముంబై జట్లు 3, 5 ప్లేస్ల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ (ఆగస్ట్ 18) జరిగే మ్యాచ్‌ల్లో రాజస్థాన్ వారియర్స్‌తో ఒడిశా జాగర్‌నట్స్, చెన్నై క్విక్ గన్స్‌తో ముంబై ఖిలాడీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లు సోనీ టెన్, సోనీ టెన్ 4 (తెలుగు కామెంట్రీ)లో ఛానల్లలో రాత్రి 7.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. చదవండి: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తెలుగు యోధాస్ గెలుపు -
వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తెలుగు యోధాస్ గెలుపు
పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు యోధాస్ 68–47 పాయింట్ల తేడాతో రాజస్తాన్ వారియర్స్‌ను ఓడించింది. ఆదర్శ్ మొహితే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ మూడు నిమిషాల 43 సెకన్లు ఫీల్డ్‌లో గడిపి... ఆ తర్వాత 10 పాయింట్లు కూడా స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 54–49తో జగర్‌నట్స్ ఒడిషా జట్టుపై గెలిచింది. -
ఖో–ఖో లీగ్.. తెలుగు యోధాస్ కెప్టెన్ ఎవరంటే..?
న్యూఢిల్లీ: ఖో–ఖో లీగ్ ఫ్రాంచైజీ టోర్నీ ‘అల్టిమేట్ ఖో–ఖో’కు రంగం సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన కార్పొరేట్ సంస్థ జీఎంఆర్ ఇది వరకే హైదరాబాద్ నగరానికి చెందిన ఫ్రాంచైజీని చేజిక్కించుకోగా...ఆ జట్టు ‘తెలుగు యోధాస్’ పేరుతో బరిలోకి దిగుతోంది. అటాకింగ్ ప్లేయర్ ప్రజ్వల్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించిన టీమ్ మేనేజ్మెంట్ ఆల్‌రౌండర్ ప్రతీక్ వాయికర్ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఆరు ఫ్రాంచైజీలు ముంబై, ఒడిశా, చెన్నై, రాజస్తాన్, గుజరాత్, హైదరాబాద్‌ల మధ్య ఈ సీజన్ పోటీలు ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరుగనున్నాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు ఇతర ఫ్రాంచైజీలతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం ఐపీఎల్ తరహాలో ‘ప్లేఆఫ్స్’ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తుంది. మ్యాచ్‌లన్నీ పుణేలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు. సోనీ నెట్వర్క్ చానెల్లో, సోనీ లివ్ యాప్‌లో ఖో–ఖో పోటీలు ప్రసారం అవుతాయి. తెలుగు యోధాస్ జట్టు 14న తమ తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడుతుంది. జట్టు వివరాలు అటాకర్: ఆదర్శ్ దత్తాత్రే, ఆదిత్య దాస్, కేసీ ధనుశ్, గవర వెంకటేశ్, పి.హేమచంద్రన్, కె.ప్రజ్వల్, రోక్సన్ సినమ్, సచిన్ భార్గో, సదానంద తోక్చోమ్, వి.సుబ్రమణి; డిఫెండర్: భరత్ అవధూత్, బొజ్జం రంజిత్, దీపక్ విఠల్, ధ్రువ్, వైభవ్ ప్రసాద్, సుదర్శన్; ఆల్‌రౌండర్: అనుకూల్ సర్కార్, అరుణ్ అశోక్, ఎస్.అరుణ్, సంబి బాల, కిరణ్ ప్రతీక్, రోహన్ తనాజీ -
రాష్ట్ర ఖో–ఖో జట్లకు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర బాలబాలికల జట్లు రాణించాయి. నర్సరావుపేటలో ఇటీవల జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ జట్లు అండర్–17 బాలబాలికల విభాగంలో రెండు కాంస్య పతకాలను సాధించాయి. ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరిగింది. జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను ‘శాట్స్’ ఎండీ ఎ. దినకర్‌బాబు అభినందించారు.