న్యూఢిల్లీ: ఖో–ఖో లీగ్ ఫ్రాంచైజీ టోర్నీ ‘అల్టిమేట్ ఖో–ఖో’కు రంగం సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన కార్పొరేట్ సంస్థ జీఎంఆర్ ఇది వరకే హైదరాబాద్ నగరానికి చెందిన ఫ్రాంచైజీని చేజిక్కించుకోగా...ఆ జట్టు ‘తెలుగు యోధాస్’ పేరుతో బరిలోకి దిగుతోంది. అటాకింగ్ ప్లేయర్ ప్రజ్వల్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించిన టీమ్ మేనేజ్‌మెంట్ ఆల్‌రౌండర్ ప్రతీక్ వాయికర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఆరు ఫ్రాంచైజీలు ముంబై, ఒడిశా, చెన్నై, రాజస్తాన్, గుజరాత్, హైదరాబాద్‌ల మధ్య ఈ సీజన్ పోటీలు ఈ నెల 14 నుంచి సెప్టెంబర్ 4 వరకు జరుగనున్నాయి.
లీగ్ దశలో ఒక్కో జట్టు ఇతర ఫ్రాంచైజీలతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. అనంతరం ఐపీఎల్ తరహాలో ‘ప్లేఆఫ్స్’ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 4న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తుంది. మ్యాచ్‌లన్నీ పుణేలోని ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహిస్తారు. సోనీ నెట్‌వర్క్ చానెల్‌లో, సోనీ లివ్ యాప్‌లో ఖో–ఖో పోటీలు ప్రసారం అవుతాయి. తెలుగు యోధాస్ జట్టు 14న తమ తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడుతుంది.
జట్టు వివరాలు
అటాకర్: ఆదర్శ్ దత్తాత్రే, ఆదిత్య దాస్, కేసీ ధనుశ్, గవర వెంకటేశ్, పి.హేమచంద్రన్, కె.ప్రజ్వల్, రోక్సన్ సినమ్, సచిన్ భార్గో, సదానంద తోక్‌చోమ్, వి.సుబ్రమణి; డిఫెండర్: భరత్ అవధూత్, బొజ్జం రంజిత్, దీపక్ విఠల్, ధ్రువ్, వైభవ్ ప్రసాద్, సుదర్శన్; ఆల్‌రౌండర్: అనుకూల్ సర్కార్, అరుణ్ అశోక్, ఎస్.అరుణ్, సంబి బాల, కిరణ్ ప్రతీక్, రోహన్ తనాజీ
Comments
Please login to add a commentAdd a comment